సిమ్లా, ఫిబ్రవరి 14: హిమాచల్‌ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లా స్పిల్లో ప్రాంతంలో సరిహద్దు రోడ్ల సంస్థ (బిఆర్‌ఓ)కు చెందిన ట్రక్కు ఒకటి మంగళవారం 200 అడుగుల లోతయిన లోయలోకి పడిపోవడంతో 17 మంది కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. చనిపోయిన వారంతా బీహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందినవారే. కన్నౌర్ ప్రాంతంలో భారీగా మంచు కురవడంతో రోడ్లు మంచుతో కప్పడిపోయాయి. ఫలితంగా జారుడుగా మారిపోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మధ్యాహ్నం 12.45 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ వీణా భారతి చెప్పారు. మృతదేహాలను లోయలోంచి బైటికి తీసి గుర్తించడం జరిగిందని ఆమె చెప్పారు. ట్రక్కులో కూలీలు ప్రయాణించడానికి అనుమతించిన ట్రక్కు డ్రైవర్‌పైన, జనరల్ ఇంజనీరింగ్ రిజర్వ్ ఫోర్స్‌పైన కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. గాయపడిన ఇద్దరినీ దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చగా, ఒకరిని ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి చేయగా, మరొకరిని పేవోలోని జోనల్ ఆస్పత్రికి తరలించారు. పూహ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పనిలో ఉన్న కార్మికులు పని పూర్తి చేసుకుని స్పిల్లోలోని తమ క్యాంప్‌కు ట్రక్కులో తిరిగి వస్తుండగా భారీగా మంచు కురవడం ప్రారంభమైందని, ఫలితంగా ట్రక్కు ప్రమాదానికి గురయిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పారు.
ట్రక్కు లోయలో పడి 17 మంది మృతి
english title:
h
Date:
Wednesday, February 15, 2012