న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: తెలంగాణ ఏర్పాటుకు, అభివృద్ధికి తాను వ్యతిరేకినన్న ఆరోపణలను గవర్నర్ నరసింహన్ ఖండించారు. తనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకటేనని స్పష్టం చేశారు. తెలంగాణ గురించి తాను కేంద్రానికి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని చెప్పారు. రాష్టప్రతి భవన్లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణాను వ్యతిరేకిస్తున్నందునే ఆ ప్రజాప్రతినిధులు తనని గవర్నర్గా కొనసాగించటాన్ని వ్యతిరేకిస్తున్నారన్న వాదనతో ఆయన ఏకీభవించలేదు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు తనని అనుమానించవలసిన అవసరం లేదని గవర్నర్ చెప్పారు. తన పదవీ కాలం ముగిసిపోయినందున తిరిగి పదవిలో నియమితులయ్యే విషయమై తనకేమీ తెలియదని చెప్పారు ప్రభుత్వమే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు, అభివృద్ధికి తాను వ్యతిరేకినన్న
english title:
n
Date:
Wednesday, February 15, 2012