Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కుకీల నుంచి ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌ను రక్షించుకోవడం ఎలా?

$
0
0

విండోస్ పీసీలో వాడే మొజిల్లా ఫైర్ ఫాక్స్‌లో కుకీస్‌ల నుంచి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌ను ఎలా రక్షించుకోవాలో, ప్రైవేట్ డేటాలను ఎలా కాపాడుకోవాలో చూద్దాం.
ముందుగా కుకీస్:
కుకీలను అనుమతించాలా వద్దా అనే ఆప్షన్స్ ఇస్తూ ఫైర్‌ఫాక్స్ తగిన నియంత్రణ నిస్తుంది. కుకీలను అనుమతించా లనుకొన్న వెబ్‌సైట్ల చిరునామాలను సెట్ చేయడానికి ‘ఉనషళఔఆజ్యశఒ’ అనే ఆప్షన్‌ను ఎంచుకొని అందులో ఒక వెబ్‌సైట్ నుంచి కుకీలను సదా అనుమతించమని, తాత్కాలికంగా మాత్రమే అనుమతించమని లేదంటే ఎప్పటికీ అనుమతించవద్దనీ చెప్పవచ్చు. ఇది యూసర్ కోరినా కోరకున్నా, ఫైర్ ఫాక్స్ ఇచ్చే సెట్టింగ్. యూసర్ అవసరాన్నిబట్టి దీనిని మార్చుకోవచ్చు.
ఒక నిర్ధారిత సైట్ నించి కుకీస్‌ను తొలగించే విధానం ఇదీ:
1.ఫైర్‌ఫాక్స్ ఆప్షన్స్‌లో ప్రైవసీ టాబ్ కుకీ సెట్టింగ్‌లను చూడొచ్చు.
2.తదుపరి సెషన్స్ నించి కుకీలను అనుమతించకూడదనుకొంటే, ‘ని ష్యఒళ జూళచ్యిన’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
3.నమ్మదగ్గ వెబ్‌సైట్‌ల నుంచి కుకీలను అనుమతించ వచ్చు. దీనికి ఎక్సెప్షన్స్ అనే టాబ్‌ను ఎంచుకోండి.
4.మీరు కుకీలను అనుమతించవచ్చనుకొన్న వెబ్‌సైట్ అడ్రస్‌ను టైప్ చేసి అలౌ అనే బటన్‌ను ఎంచుకోండి.
5.మీరు కుకీలను అనుమతించ వద్దనుకొన్న వెబ్‌సైట్ అడ్రస్‌ను టైప్ చేసి బ్లాక్ అనే బటన్‌ను ఎంచుకోండి.
ఇపుడు ప్రైవేట్ డేటా:
1.ఫైర్ ఫాక్స్‌ను వాడి బ్రౌజింగ్ చేసిన ప్రతిసారీ బ్రౌజర్ ఏర్పరచిన తాత్కాలిక మెమరీ నుంచి సమాచారాన్ని, కుకీస్‌ను, బ్రౌజింగ్ హిస్టరీని, డౌన్‌లోడ్ హిస్టరీని ప్రతిసారీ మాన్యువల్‌గా కాక ఆటోమేటిగ్గా తొలగించే వీలునిస్తుంది.
* టూల్స్ - ఇంటర్నెట్ ఆప్షన్స్ ఎంచుకొని అందులో ప్రైవసీ అనే టాబ్‌పై క్లిక్ చేయండి.
* ప్రైవేట్ డేటా అనే విభాగంలో Always clear my private data when I close firfox అనే చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి.
2.బ్రౌజింగ్ చేసిన ప్రతిసారీ బ్రౌజర్‌ను క్లోజ్ చేసే ముందు ఏయే సమాచారాన్ని ఫైర్‌ఫాక్స్ ఎరేజ్ చేస్తుందీ తెలుసుకోవాలంటే, సెట్టింగ్స్ బటన్‌పై క్లిక్ చేయండి.
3."cookies and saved passwords'ఎంచుకోండి.
4.యూసర్ పాస్‌వర్డ్‌లను బ్రౌజర్ గుర్తుంచుకోకుండా ఉండటానికి సెక్యూరిటీ టాబ్‌ను క్లిక్ చేయండి.
5.కింద చూపిన విధంగా బాక్స్‌ను అన్‌చెక్ చేయండి.
బ్రౌజర్‌ను క్లోజ్ చేసే ప్రతిసారీ ఏయే సమాచారం ఎరేస్ అవుతుందో సెట్టింగ్స్ కంట్రోల్ చెబుతుంది. కుకీస్‌ను డిలీట్ చేయమని టిక్కు పెట్టడం మర్చిపోకూడదు.
ఐతే, ఈ పాస్‌వర్డ్‌లను ఉంచుకోవాలా, ఎరేస్ చేయాలా అనేది యూసర్ ఇష్టాయిష్టాలపై, పాస్‌వర్డ్ మేనేజర్ సౌకర్యాన్ని వాడటంపై ఆధారపడి ఉంటుంది. "Ask me before clearing private data'అనే ఆఫ్షన్‌ను చెక్ చేసుకొంటే, ప్రతీ బ్రౌజర్ సెషన్ అంతంలో ఆ ప్రైవేట్ డేటాను ఉంచాలా తొలగించాలా అని ఫైర్‌ఫాక్స్ నిర్ణయించుకొంటుంది.

షార్ట్ కట్స్ (్ఫటోషాప్ 7.0 టూల్స్)

+ ఒక ఆకారాన్ని (Shape) జోడించడానికి
ఒక ఆకారాన్ని (Shape) తొలగించడానికి
బ్రష్ పరిమాణాన్ని తగ్గించడానికి
బ్రష్ పరిమాణాన్ని పెంచడానికి

తెలుసుకోవాల్సిన సంగతి..

కంప్యూటర్ ఉథ్యోగాలంటే...
గంటల కొద్దీ కంప్యూటర్లతో పని చేయడం వల్ల కళ్లూ, చేతులూ, కాళ్లూ, కండరాలూ, నడుమూ, వీపూ, మెడా - ఇలా చెబుతూ పోతూ మొత్తం దేహంలోని అన్నీ అవయవాల పేర్లూ చెప్పాల్సి వస్తుంది. చేతి కదలికలు తగ్గిపోయి కండరాలు కుంచించుకు పోతాయి. మన దేహంలో ఏ భాగాన్నీ వదలకుండా అన్నిటిపైనా దాడి చేస్తుంది ఈ కంప్యూటర్. గంటల కొద్దీ నిర్విరామంగా కంప్యూటర్లతో పని చేయడం వల్ల కంప్యూటర్ వెదజల్లే విద్యుదయస్కాంత తరంగాలు రోగిష్టులుగా చేస్తాయి. మనలని నిస్సత్తువ చేసి, నిర్జీవంగా మార్చేసి తరచూ ఒక రకమైన డిప్రెషన్‌కి లోను అయ్యేలా చేస్తాయి. కంప్యూటర్లు ఉండే చోట్లలో గాలీ వెలుతురుకు సంబంధించిన జాగ్రత్తలని తీసుకోవడం చాలా ముఖ్యం. ఐతే, దీనికి బెంబేలెత్తి పోవాల్సిన పనిలేదు. వృత్తిపరమైన, పరిసరాల సంబంధిత ఆరోగ్య సమస్యలివి. అర్థం చేసుకుని సరిగ్గా పరిష్కరించుకోవాలి. మానిటర్ల ముందు కూర్చుని పని చేయడం వల్ల వచ్చే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా సివిఎస్ వల్ల ప్రపంచం మొత్తంగా కొన్ని కోట్ల మంది అవస్థ పడుతున్నారు. కంప్యూటర్ వాడేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకుని పని చేసుకుంటే ఆరోగ్యానికేం ప్రమాదం ఉండదు.

నెట్ న్యూస్

ఇదో రకం వెర్రి...
అదేంటోగానీ, మొన్నటిదాకా అమెరికా జనాలకు మాత్రమే టెక్నాలజీ వేలంవెర్రి అనుకునేవాళ్లంతా. నెమ్మదిగా ప్రపంచమంతా ఆ వెర్రి వ్యాపిస్తోందా అనిపిస్తోంది. ఐఫోన్ అంటే జనాలకెంత క్రేజో వేరేగా చెప్పక్కర్లేదు. మొన్నటికి మొన్న ఐఫోన్ 4 ఎస్ జనాలకు వెర్రెక్కించిందో లేదో, ఇపుడు ఐఫోన్ 5ఎస్ మార్కెట్లోకి వచ్చేస్తోందని తాజా వార్త. ఇది ఎ7 చిప్‌తో 2 జిబి రామ్, పవర్ SGX 554 MP4 GPU తో వచ్చేసిందంటున్నారు విశే్లషకులు. డ్రాయిడ్ గేటర్ అనే సంస్థ తాను ఐఫోన్ 5ఎస్ మదర్ బోర్డ్ చిత్రాన్ని సంపాదించినట్లు చెబుతోంది. డ్రాయిడ్ గేటర్ ఉప్పందించిన ప్రకారం ఈ కొత్త ఐఫోన్‌లో ఉండే మదర్ బోర్డు దాదాపు 4ఎస్‌లో ఉండేంత సైజులోనే ఉందనీ, దానిలో ఉండేంత 4 అంగుళాల టచ్ స్క్రీన్‌తోనే 5 ఎస్ కూడా వస్తుందనీ తెలుస్తోంది. ఆస్సద్ అందించిన ఛాయాచిత్రంలో ఎ7 చిప్ కూడా కనిపిస్తోంది. ఈ ఎ7 చిప్ 1.2 గిగాహెర్ట్జ్ వేగంతో పనిచేసే క్వార్డ్ కోర్ ప్రాసెసర్ అనీ తెలుస్తోంది. ఇంకా అతి తక్కువ కాంతిలో మెరుగ్గా పనిచేసే 12 మెగాపిక్సల్ కెమెరా దీని ప్రత్యేకత అనీ తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాలోని ఆపిల్ ఉపకరణాలను తయారుచేసే సంస్థ ఫాక్స్ కాన్ కొత్తగా ఫ్యాక్టరీలో అసెంబ్లీ లైనులో పనిచేసే 10 వేల మంది ఉద్యోగులను తీసుకుందని వార్త. ఇది కొత్త ఐఫోన్ ఉపకరణాలను పుంఖానుపుంఖాలుగా మార్కెట్లోకి తేవడానికే అని నెట్‌లో తాజా వార్త.

పద పారిజాతం

Virus - వైరస్ అనేది ఓ కంప్యూటర్ ప్రోగ్రాం. కాకపోతే అది సక్రమంగా పనిచేసే కంప్యూటర్‌ని పని చేయనీయక పోవడమో, మరో సమస్యని లేవనెత్తడమో చేస్తుంది.
VLSI - విఎల్‌ఎస్‌ఐ లేదా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్‌కి క్లుప్త రూపం.
VRAM - విడియో రామ్ అని అర్థం. అంటే, విడియో కార్డ్ లేదా అడాప్టర్‌లపై ఉండే రామ్.
VSAT - విసాట్ అంటే వెరీ స్మాల్ ఎపర్చర్ టెర్మినల్ అని అర్థం.
............................
సామెత: తిరిగే హార్డ్ డిస్క్ తిరగడం లేదంటే చెడిందన్న మాటే...

కంప్యూటర్ కాలమ్
english title: 
c
author: 
-వి.వి.వి.రమణ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>