కడప, ఏప్రిల్ 28: కడప వైఎస్సార్ జిల్లాలో విస్తారంగా ఉన్న ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించడానికి ముందుగా పన్నిన వ్యూహంలో భాగంగానే బ్రహ్మణి స్టీల్స్‌కు శంకుస్థాపన జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ స్థాపించాలనే ఆలోచన అటు గాలి జనార్ధనరెడ్డికి గాని ఇటు వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి గాని లేదన్నారు. ఆదివారం ఆయన కడప స్టేట్ గెస్ట్‌హౌస్‌లో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆస్తులు సంపాదించిన జగన్ తనపై నమోదయిన కేసుల నుండి బయట పడడానికి కాంగ్రెస్ అధిష్ఠానంతోపాటు నేతలపై నిందలు వేస్తున్నారన్నారు. న్యాయస్థానాలు, సిబిఐ పట్ల గౌరవం ఉంటే జగన్ చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. తప్పు చేయని వారిని జైలుకెలా పంపుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వినూత్నంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ పటిష్టతకు అంకితమైన సోనియా, రాహుల్ దేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని నడిపించాలనే లక్ష్యంతో పదవులకు దూరంగా ఉంటున్నారన్నారు. అవినీతి కేసుల ఊబిలో కూరుకుపోయిన జగన్ బయటకు రావడం సాధ్యం కాదన్నారు.
గాలి, జగన్లకు పరిశ్రమ పెట్టే యోచన లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ఆరోపణ
english title:
g
Date:
Monday, April 29, 2013