న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా 27 జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సిడిసి) కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఆదివారం ఇక్కడ తెలిపారు. ఇప్పటికే ఉన్న 8 ఎన్‌సిడిసి కేంద్రాల బలోపేతంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం ఇక్కడ ఎన్‌సిడిసి నూతన భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ప్రమాదకర రోగాల బారిన పడకుండా ఈ ఎన్‌సిడిసి ప్రధాన పాత్రను పోషిస్తుందని, రోగాల నియంత్రణ, ఆరోగ్యపరమైన అంశాల్లో నిఘా వ్యవస్థ ఎన్‌సిడిసిలతో పటిష్టమవుతుందనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా ఆయన వెలిబుచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలను అందించడంలో ఎన్‌సిడిసి కేంద్రాలు ప్రధాన భూమిక పోషించనున్నాయన్నారు.
కాగా, ఎఐఐఎమ్‌ఎస్ గురించి స్పందిస్తూ ఇది భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కలల ప్రాజెక్టు అని అన్నారు. నిన్నమొన్నటి వరకు దేశంలో కేవలం ఒక్క ఎఐఐఎమ్‌ఎస్ ఉందని, కానీ ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరుకుపైగా ఎఐఐఎమ్‌ఎస్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు.
12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు
english title:
m
Date:
Monday, April 29, 2013