పాట్నా, ఏప్రిల్ 28: శారదా చిట్‌ఫండ్ మోసం నేపథ్యంలో ఆదివారం బీహార్ రాజధాని పాట్నా శివారుల్లో డజనుకుపైగా చిట్‌ఫండ్ సంస్థలపై దాడులు చేసిన ఆ రాష్ట్ర పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బక్తియార్‌పూర్, బార్హ్, మొకామా ప్రాంతాల్లోని చిట్‌ఫండ్ కార్యాలయాలపై ఓ ప్రత్యేక బృందం ఈ దాడులను నిర్వహించిందని ఓ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన స్పష్టం చేసింది. 14 చిట్‌ఫండ్ సంస్థల కార్యాలయాలపై సోదాలు చేయగా, కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడుపుతున్న సంస్థలే ఇందులో అధికంగా ఉన్నాయి. 25,000-30,000 మంది స్థానికులు ఈ సంస్థల్లో డబ్బులు దాచుకున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, 1,700 పాస్‌పుస్తకాలు 10,400 బాండ్ పేపర్లు, మెచ్యురిటీ సర్ట్ఫికెట్లు, 50 క్యాష్‌బుక్కులు కూడా పోలీసులు ఈ సోదాల్లో స్వాధీనపరుచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో శారదా చిట్‌ఫండ్ భారీ ఎత్తులో నిధులను సేకరించి ఆ తర్వాత డిపాజిటర్లకు కుచ్చుటోపి పెట్టిన క్రమంలో పొరుగు రాష్టమ్రైన బీహార్ ప్రభుత్వం అప్రమత్తమవగా, ఇందులోభాగంగానే జరిగినవే ఈ తాజా దాడులు.
బీహార్‌లో 11మంది అరెస్టు, 8 లక్షల నగదు స్వాధీనం
english title:
c
Date:
Monday, April 29, 2013