Image may be NSFW.
Clik here to view.
Clik here to view.

నాసిక్, ఏప్రిల్ 29: ఆసియా క్రీడల్లో పతకం సాధించిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కవితా రావత్ సోమవారం నాసిక్‌లో వివాహం చేసుకుంది. హర్సుల్ గ్రామానికి చెందిన రావత్ మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న మహేష్ తుంగర్‌ను పరిణయమాడింది. ఈ సందర్భంగా కవితా రావత్ విలేఖర్లతో మాట్లాడుతూ, మహేష్‌తో కలసి వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ అథ్లెటిక్ కెరీర్‌ను నిలిపివేయబోనని, సాధ్యమైనంత కాలం పాటు లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా కొనసాగుతానని స్పష్టం చేసింది. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనాలన్నది తన స్వప్నమని ఆమె తెలిపింది.
ఆసియా క్రీడల్లో పతకం సాధించిన
english title:
kavitha rawat
Date:
Tuesday, April 30, 2013