న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపాల్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు మద్దతు అందించడానికి భారత్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మన దేశంలో పర్యటిస్తున్న నేపాల్ మావోయిస్టు పార్టీ అధ్యక్షుడు పుష్పకమర్ ధహల్ (ప్రచండ)కు విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ విషయాన్ని తెలియజేసారు. నేపాల్ రాజ్యాంగ సభకు ఎన్నికలు నిర్వహించడం, కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం సహా అనేక విషయాల్లో భారత్‌ను మద్దతును కోరడం కోసం ప్రచండ మన దేశం వచ్చారు. భారత్, నేపాల్ సంబంధాలకు సంబంధించి మావోయిస్టు నేత ఎంతో స్నేహపూర్వకంగా, ఎలాంటి అరమరికలు లేకుండా, చాలా సానుకూలమైన ధోరణిలో మాట్లాడారని మంగళవారం ఇక్కడ ప్రచండతో విందు సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఖుర్షీద్ చెప్పారు. గతంలో అప్పటి ఆర్మీ చీఫ్ రుక్మాంగద్ కతువాల్‌ను తొలగించే విషయంలో అధ్యక్షుడు రామ్‌బరన్ యాదవ్‌తో విభేదాలు తలెత్తడం, దరిమిలా ప్రధాని పదవినుంచి తనను తప్పించినప్పటినుంచి ప్రచండ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న విషయం తెలిసిందే.
చైనా పర్యటన రద్దు యోచనలేదు
తన చైనా పర్యటన రద్దు చేసుకునే ఆలోచన లేదని కేంద్ర విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. భారత్ భూభాగంలోని లడఖ్‌లోకి చైనా దురాక్రమణ నేపథ్యంలో ఖుర్షీద్ పర్యటనపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇరుదేశాల మధ్య తలెత్తిన సరిహద్దు సమస్య తలెత్తినంత మాత్రాన పర్యటన రద్దు చేసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. తన పర్యటన భారత్ ప్రభుత్వం ఖరారు చేసింది. దాన్ని రద్దు చేసుకోవడానికి తాను ఎవర్నని ఆయన అడిగారు.
చైనా పర్యటన రద్దు చేసుకునేంత బలమైన కారణం ఏముందని ఖుర్షీద్ అన్నారు. చైనా ప్రధాని లీ కెక్యింగ్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో దాని ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు మే 9న ఖుర్షీద్ చైనా వెళ్లడానికి షెడ్యూల్ ఖరారైంది. అయితే ఖుర్షీద్ పర్యటనను మాజీ రక్షణ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తప్పుపట్టారు.
మావోయిస్టు పార్టీ నేత ప్రచండకు ఖుర్షీద్ హామీ
english title:
n
Date:
Wednesday, May 1, 2013