న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ అవకతవకలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న క్రమశిక్షణా కమిటీ తన సిఫారసులను మే నెలాఖరులోగా బిసిసిఐకి సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ సోమవారం న్యూఢిల్లీలో సమావేశమై మోడీ తరఫు న్యాయవాదులతో పాటు బిసిసిఐ తరఫు న్యాయవాదుల వాదనలను నమోదు చేసుకుంది. అన్ని పక్షాల వాదనలను ఆలకించిన ఈ కమిటీ మోడీ తుది సమాధానం ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. మోడీ నుంచి తుది సమాధానం పొందిన తర్వాత ఈ కమిటీ మే నెలాఖరులోగా తన నిర్ణయాన్ని ఖరారు చేస్తుందని భావిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కమిటీ సమర్పించే సిఫారసులను పరిశీలించి మోడీ భవితవ్యంపై బిసిసిఐ తుది నిర్ణయం తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఐపిఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ
english title:
l
Date:
Wednesday, May 1, 2013