కరాచీ, ఏప్రిల్ 30: ఇంగ్లాండ్, వేల్స్‌లో జూన్ 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ జరుగనున్న ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే పాకిస్తాన్ జట్టులో మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీతో పాటు మరో బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌కు చోటు లభించలేదు. వీరిరువురినీ పక్కన పెట్టి 15 మంది సభ్యులతో కూడిన పాక్ జట్టును ఈ టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు. సెలెక్టర్లు గత వారమే ఈ జట్టు సభ్యులను ఖరారుచేసి పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) అనుమతి కోసం సమర్పించారు. అయితే సుదీర్ఘ చర్చల అనంతరం చీఫ్ సెలెక్టర్ ఇక్బాల్ ఖాసిం సోమవారం లాహోర్‌లో ఈ జట్టును ప్రకటించారు. సెలెక్టర్లు ఇంతకుముందు సమర్పించిన ఆటగాళ్ల జాబితాలో చివరకు రెండు మార్పులు చేసి ఈ జట్టును ప్రకటించారు. గాయంతో బాధపడుతున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హారిస్ సొహైల్ స్థానంలో అమర్ అమిన్‌ను, అలాగే అజీజ్ చీమా స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ వహాబ్ రియాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ రెండు మార్పులు మినహా సెలక్టర్లు సమర్పించిన జాబితాలోని ఆటగాళ్లందరినీ చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి ఎంపిక చేశామని, అఫ్రిదీ గత కొంత కాలం నుంచి బౌలింగ్‌లో విఫలమవుతుండటంతో అతనికి ఉద్వాసన పలకాల్సి వచ్చిందని ఖాసిం వివరించాడు. ‘పాక్ జట్టుకు అఫ్రిదీ ప్రధానంగా బౌలర్‌గానే సేవలు అందిస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో అతను అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. వికెట్లు సాధించడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. అందుకే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే పాక్ జట్టులో అఫ్రిదీకి చోటు కల్పించలేదు’ అని ఖాసిం పేర్కొన్నాడు.
ఇదీ జట్టు
మిస్బా ఉల్‌హక్ (కెప్టెన్), నజీర్ జంషెడ్, ఇమ్రాన్ ఫర్హత్, మహ్మద్ హఫీజ్, అసద్ షఫిక్, షోయబ్ మాలిక్, ఉమర్ అమిన్, కమ్రాన్ అక్మల్, సరుూద్ అజ్మల్, అబ్దుల్ రెహ్మాన్, జునైద్ ఖాన్, మొహమ్మద్ ఇర్ఫాన్, అసద్ అలీ, ఎహ్సాన్ ఆదిల్, వహాబ్ రియాజ్.
బ్యాటింగ్ కోచ్‌గా ఉడ్‌హిల్
ఇదిలావుంటే, పాక్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన ట్రెంట్ ఉడ్‌హిల్‌ను నియమించినట్టు పిసిబి ప్రకటించింది. మూడు వారాల పాటు అతను ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడని, ఇంగ్లాండ్‌లో అతను తమ జట్టులో చేరి చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో సేవలు అందిస్తాడని పిసిబి పేర్కొంది. ట్రెంట్ ఉడ్‌హిల్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
15 మందితో పాకిస్తాన్ జట్టు
english title:
i
Date:
Wednesday, May 1, 2013