న్యూఢిల్లీ, మే 1: ఇంకెంత మాత్రం నయం చేయలేనంతగా తీవ్ర కోమాలోకి వెళ్లిపోయిన సరబ్‌జిత్ సింగ్‌ను మానవత్వ కోణంలో తక్షణమే విడుదల చేయాలని పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా విజ్ఞప్తి చేసింది. మరింత ఉత్తమమైన చికిత్స చేయడానికి మూడో దేశానికైనా సరబ్‌ను తరలించాలని కోరింది. సరబ్ విషమ పరిస్థితి నేపథ్యంలో న్యాయ, అధికారిక కారణాలపై మంకు పట్టుపట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పాకిస్తాన్‌కు హితవు పలికారు. లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రిలో సరబ్‌జిత్‌కు చికిత్స చేస్తున్న వైద్యులు అందించిన తాజా నివేదికలు ఆయన ఆరోగ్యం పట్ల మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు విడుదల చేసినా సరబ్‌జిత్‌కు భారత్‌లో మరింత ఉత్తమ వైద్యం లభిస్తుందని స్పష్టం చేశారు.
భారత్‌కు పంపడం ఇబ్బంది అయితే మరో దేశానికైనా సరబ్‌ను తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఒక మనిషి ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి బదులు ఇతర అంశాలపై పట్టుబట్టడం ఎంత మాత్రం సముచితం కాదని, అందుకిది సమయం కాదని భారత్ తేల్చిచెప్పింది.
లాహోర్ నుంచి బుధవారం
భారత్‌కు తిరిగి వచ్చేస్తున్న సరబ్‌జిత్ కుటుంబ సభ్యులు