విజయవాడ , మే 2: రైల్వే గుర్తింపు సంఘాల ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే జోనల్, డివిజన్ లెవల్‌లో ఎంప్లాయీస్ సంఘ్ ఘన విజయాన్ని సాధించింది. గత నెల 25, 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా రైల్వే గుర్తింపు సంఘాల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు విజయవాడ డివిజన్ పరిధికి సంబంధించిన వరకు రైల్వే జూనియన్ కళాశాలల గురువారం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. డివిజన్ మొత్తం మీద 84 బ్యాలెట్ బాక్స్‌లను ఐదు విభాగాలుగా విభజించి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండ్‌లో ఎంప్లారుూస్ సంఘ్, మజ్దూర్ యూనియన్‌పై 267 ఓట్ల మెజార్టీ సాధించింది. రెండవ రౌండ్‌లో ఎంప్లారుూస్ సంఘ్‌కి 1491 ఓట్లు రాగా మజ్దూర్ యూనియన్‌కు 1722 ఓట్లు వచ్చాయి. అక్కడ నుంచి జరిగిన మూడో రౌండ్‌లో మజ్దూర్ యూనియన్‌పైన ఎంప్లారుూస్ సంఘ్ 142 ఓట్ల మెజార్టీని సాధించగా నాలుగవ రౌండ్‌లో 107 ఓట్ల మెజార్టీ ఎంప్లారుూస్ సంఘ్ సాధించింది. చివరిగా ఐదోరౌండ్‌లో 51 ఓట్ల మెజార్టీతో మజ్దూర్ యూనియన్ మీద ఎంప్లారుూస్ సంఘ్ సాధించింది. ఐదు రౌండ్లు కలుపుకుంటే 336 ఓట్ల ఆధిక్యతతో ఎంప్లారుూస్ సంఘ్ ఘన విజయం సాధించింది. ఇందులో చెల్లని ఓట్లు మొత్తం 105 ఉండగా మజ్దూర్ యూనియన్‌కు వచ్చిన మొత్తం ఓట్లు 7233 కాగా ఎంప్లారుూస్ సంఘ్‌కు 7569 ఓట్లు వచ్చాయి. కాగా మిగిలిన రెండు యూనియన్‌లు డిపాజిట్లు కోల్పోయాయి. దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘ్‌కు ఐదు రౌండ్‌లలో కలిపి 933 ఓట్లు రాగా, రైల్వే మజ్దూర్ యూనియన్‌కు కేవలం 306 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2007లో జరిగిన ఇదే గుర్తింపు ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్, ఎంప్లారుూస్ సంఘ్‌పై ఆధిక్యతను సాధించగా ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఎంప్లారుూస్ సంఘ్ విజయకేతనం ఎగురవేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఓట్ల పరిధిలో 35 శాతం కాని పోలింగ్‌లో 30 శాతం ఓట్లు సాధించిన వారికి గుర్తింపు కలిగి ఉంటుందని నిబంధన ప్రకారం మజ్దూర్ యూనియన్, ఎంప్లారుూస్ సంఘ్ రెండింటికి యథావిథిగా గుర్తింపును రైల్వే బోర్టు స్థాయిలో ఎప్పటిలాగానే యథావిథిగా లభించింది. మిగిలిన రెండు యూనియన్లకు ఎటువంటి గుర్తింపు లభించలేదు. ఈ సందర్భంగా మెడికల్ బ్రాంచి కార్యదర్శి సంఘ్ పౌర సంబంధాల విభాగపు ఇన్‌చార్జి బి సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా నిత్యం వారి సమస్యలకు పోరాడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
భారీ స్థాయిలో ఊరేగింపు
కాగా అఖండ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ఎంప్లారుూస్ సంఘ్ దక్షిణ మధ్య రైల్వేలోని ఐదు డివిజన్‌లలో నాలుగు డివిజన్‌లలో అఖండ విజయం సాధించిన దృష్ట్యా నగరంలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న సంఘ బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు భారీ స్థాయిలో ఊరేగింపు నిర్వహించారు.
గుంతకల్ డివిజన్‌ని మజ్దూర్ యూనియన్, ఎంప్లారుూస్ సంఘ్‌పై స్వల్ప మెజార్టీతో గెలుపొందింది. దీంతో తిరుపతి సిఆర్‌ఎస్‌తో పాటు గుంతకల్ డివిజన్ కలిపి రెండు స్థానాలను మజ్దూర్ యూనియన్ గెలుపొందింది.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు
విజయవాడ, మే 2: ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 5వ తేదీన జిల్లాలోని చందర్లపాడు, ఇబ్రహీంపట్నం మండలాల్లో పర్యటనపై వివిధ శాఖల అధికారులతో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి చందర్లపాడు మండలం, గుడిమెట్ల ఎత్తిపోతల పథకం వద్ద ఇబ్రహీంపట్నం మండలంలో చేపట్టవలసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. 5వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా చందర్లపాడు మండలం గుడిమెట్ల చేరుకుంటారని తెలిపారు. ఎత్తిపోతల పథకం పంపింగ్ స్కీము వద్ద పథకం ప్రారంభించే శిలాఫలకాన్ని ఏర్పాటు చేయటంతోపాటు కంచికచర్ల, మోగులూరు, గని ఆత్కూరు, ఎత్తిపోతలకు సంబంధించిన శంకుస్థాపనలకు అవసరమైన శిలాఫలకాన్ని సిద్ధం చేయాలని ఎపి ఎస్‌ఐడిసి అధికారులను ఆదేశించారు. పథకం ప్రారంభం అనంతరం రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇబ్రహీంపట్నం మండలంలో ‘పురా’ పథకాన్ని ప్రారంభించేందుకు గుడిమెట్ల నుండి హెలిక్యాప్టర్‌లో ఇబ్రహీంపట్నంలోని డాన్ బాస్కో పబ్లిక్ స్కూల్ సమీపంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేయాలన్నారు. కొండపల్లి డిఎవి పబ్లిక్ స్కూల్ నందు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారన్నారు. ఏర్పాట్లు పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్‌పి ప్రభాకరరావు, సబ్ కలెక్టర్ డి హరిచందన, డిసిపి యం రవిప్రకాష్, ఎసిపి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.