Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వైఎస్‌ఆర్‌సిపిలో కుమ్ములాట!

$
0
0

ఒంగోలు, మే 2: జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఠా కుమ్ములాటలతో సతమతమవుతోంది. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సిపి టిక్కెట్ విషయంలో సిట్టింగ్ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్, మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్యల మధ్య వార్ జరుగుతోంది. దీంతో నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్‌సిపి మండల నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. 2014 ఎన్నికల్లో తాను అద్దంకి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని గరటయ్య పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. తనకు అద్దంకి టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చిన మీదట పార్టీలోకి వచ్చానని ఆయన గుర్తుచేశారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈనెల నాలుగో తేదీ నుండి గడప గడపకు గరటయ్య పేరుతో బాచిన పర్యటించనున్నారు. ఆ మేరకు ఆయన గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ విఃయాన్ని వెల్లడించారు. 2014 సంవత్సరంలో జరిగే ఎన్నికలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల పార్టీ అధిష్ఠానం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. సమన్వయకర్తలు నియోజకవర్గ అభ్యర్థులు కారని ప్రకటించింది. దీంతో అద్దంకి నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఇప్పటినుండే గరటయ్య పావులు కదుపుతున్నారు. ఇంటింటా గరటయ్య పేరుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళతాన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని గరటయ్య ధ్వజమెత్తారు. దీన్నిబట్టిచూస్తే పరోక్షంగా శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌ను గరటయ్య టార్గెట్ చేశారు. ప్రధానంగా పేదవర్గాలపై గరటయ్య దృష్టిసారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆ నిధులు పేదవర్గాలకు అందడం లేదని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో మంచినీరు, విద్యుత్ సౌకర్యం లేదని పేర్కొంటున్నారు. కేవలం ఎస్‌సి, ఎస్‌టి వర్గాలపైనే కాకుండా రైతులను ఆకర్షించేలా గరటయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. శనగ రైతులకు సక్రమంగా మార్కెటింగ్ సౌకర్యం లేదని, ఉపాధి హామీ పథకంలో భారీఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలోని కొరిశపాడు ఎత్తిపోతల పథకం 170 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నప్పటికీ పథకాన్ని అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలాఉండగా నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై కూడా గరటయ్య దృష్టిపెట్టారు. ప్రజల ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించేందుకు తన ట్రస్టుద్వారా నిధులను ఖర్చు చేసేందుకు గరటయ్య ముందుకొచ్చారు. ప్రధానంగా బిపి, షుగర్, గుండె వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా 2014 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రణాళికాబద్ధంగా గరటయ్య ముందుకు వెళ్తున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాగా సిట్టింగ్ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ కూడా తనకే టిక్కెట్ అంటూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే గొట్టిపాటి నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారు. మొత్తంమీద నియోజకవర్గంలో టిక్కెట్ విషయమై గొట్టిపాటి, బాచిన వర్గీయుల మధ్య దుమారం రేగుతోంది. అద్దంకి సీటు విషయంపై వైఎస్‌ఆర్‌సిపి అధిష్ఠానవర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

ఓల్వో బస్సును ఢీకొన్న లారీ
15 మందికి గాయాలు
సంతమాగులూరు, మే 2: మండల పరిధిలోని పుట్టావారిపాలెం జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఓల్వో బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేశినేని ట్రావెల్‌కు చెందిన ఓల్వో బస్సు చెన్నై నుండి హైదరాబాదుకు వెళ్తుండగా పుట్టావారిపాలెం కూడలి వద్ద వినుకొండ వైపు నుండి ధాన్యం లోడుతో వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో లారీ, బస్సు రెండు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. అదే సమయంలో హైదరాబాదు నుండి వస్తున్న అద్దంకి సిఐ ఘట్టమనేని శ్రీనివాసరావు, బల్లికురవ ఎస్‌ఐ అజయ్‌కుమార్‌లు సంఘటనా స్థలికి చేరుకుని స్థానిక ఎస్‌ఐ ఏ శివనాగరాజును అప్రమత్తం చేశారు. అందులోబాటులో ఉన్న రెండు ప్రొక్లైయిన్లను తెప్పించి పడిపోయిన బస్సును పైకి లేపి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను దించివేశారు. వారిలో గాయాలైన 15 మందిని 108 అంబులెన్స్‌లో నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వారిలో హైదరాబాదుకు చెందిన శివరాంప్రసాదు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘటన స్థలాన్ని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ గురువారం ఉదయం సందర్శించారు. కూడలిలో నాలుగువైపుల స్పీడుబ్రేకర్లను వేయించాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యుడు ఆదేశాల మేరకు రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న రాంకీ ప్రతినిధులను పిలిపించి కూడలిలో నాలుగువైపుల సాయంత్రానికి స్పీడుబ్రేకర్లను వేయించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరోలారీ
* బ్యాటరీ షార్ట్‌సర్క్యూట్‌తో లారీ క్యాబిన్ దగ్ధం
బేస్తవారపేట, మే 2: ఆగిఉన్న లారీని మరోలారీ ఢీకొనడంతో బ్యాటరీ షార్ట్‌సర్క్యూట్ అయి లారీక్యాబిన్ దగ్ధమైన సంఘటన గురువారం తెల్లవారుజామున బేస్తవారపేటలో జరిగింది. వివరాల్లోనికి వెళితే.. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరుకు పత్తిలోడుతో వెళ్తున్న లారీని స్థానిక పోలీసుస్టేషన్ సమీపంలో రోడ్డుపక్కన నిలిపారు. బనగానపల్లి నుంచి సిమెంటులోడుతో వెళ్తున్న లారీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బ్యాటరీ షార్ట్‌సర్క్యూట్ అయి సిమెంటు లారీ క్యాబిన్ దగ్ధమైంది. ఆ మంటలు పత్తిలోడు లారీకి వ్యాపించడంతో దాదాపు 10క్వింటాళ్ళ పత్తి కాలి బూడిదైంది. పోలీసుస్టేషన్ సమీపంలో ఈసంఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులు కంభం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈప్రమాదంలో పత్తిలారీడ్రైవర్ సుబ్బయ్య ఎడమచేతికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రమేష్‌బాబు, పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దమ్ముంటే ఎన్నికలు పెట్టు
* సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి బాలినేని సవాల్
పొదిలి, మే 2: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డీ దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సిపి విప్ బాలినేని శ్రీనివాసులరెడ్డి సవాల్ చేశారు. బుధవారం రాత్రి పొదిలి మండలంలోని వేలూరు గ్రామంలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మండల వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షులు జి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు అంటేనే జ్వరం వస్తుందని, వైఎస్‌ఆర్‌సిపి పట్ల ప్రజాదరణ చూసి ప్రభుత్వం ఎన్నికలు జరిపించేందుకు వెనుకాడుతుందని బాలినేని విమర్శించారు. స్వతంత్ర ప్రతిపత్తిగల సిబిఐ కాంగ్రెస్‌పార్టీకి జేబు సంస్థగా మారిందని, కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడిన తీరుతోనే ఈవిషయం తేటతెల్లం అవుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌పార్టీలో జగన్ ఉంటే నీతి పరుడవుతాడని, లేకుంటే ఆయన అవినీతి పరుడని కేంద్ర మంత్రే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమకు నచ్చని వాళ్లపై సిబిఐని ప్రవేశించి అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపుతున్నారని, కేంద్ర ప్రభుత్వానికి ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు కూడా ప్రభుత్వానికి కొమ్ముకాయడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు పాదయాత్ర అంతా సినీ ఫక్కీలో జరిగిందని, ఆయన జరిపిన పాదయాత్రను పరిశీలించిన ప్రతి ఒక్కరికి ఈవిషయం అర్థమవుతుందన్నారు. ప్రజల వద్దకు వెళ్లేటప్పుడు సినిమా దర్శకులతో పాదయాత్రకు పేర్లు పెట్టించుకోవడం ఏమిటని బాలినేని నిలదీశారు. అధికారంలోకి ఎలాగో రానని తెలిసిన చంద్రబాబు అడ్డమైన వాగ్దానాలు చేస్తున్నారని, ఆయన వాగ్దానాలు నెరవేరాలంటే ఐదేళ్ల రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలను బతికించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీని అమలు చేశారని, అయితే ప్రస్తుత పాలకులు ఆపథకానికి తిలోదకాలు ఇచ్చారని బాలినేని ఆక్షేపించారు. రానున్న ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి అఖండ విజయం సాధిస్తుందని, త్వరలో జగన్ కడిగిన ఆణిముత్యంలా బయటకు వచ్చి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడం తథ్యం అని బాలినేని స్పష్టం చేశారు. అంతకముందు బాలినేని శ్రీనివాసులరెడ్డి గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసభలో వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి సుబ్బారెడ్డి, జంకె వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, వెన్న హనుమారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, వై వెంకటేశ్వర్లు, బూచేపల్లి వెంకాయమ్మ, ఉడుముల కోటిరెడ్డి, జి రమణారెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, షేక్ జిలానీబాషా, రాచమర్ల వెంకటరామిరెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, గూడూరి వినోద్, ఆర్ వెంకటేశ్వరరెడ్డి, హానిమున్ శ్రీనివాసరెడ్డి, ధర్మవరపు రామిరెడ్డి, జి గిరిబాబురెడ్డి, కుప్పం ప్రసాద్, ధర్మవరపు ప్రసాద్‌రెడ్డి, ధర్మవరపు సంజీవరెడ్డి, కటారి శంకర్, చాయి రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబును కలిసిన మార్కాపురం టిడిపి నేతలు
* బాబు ఆశీస్సులు పొందిన బూదాల
మార్కాపురం, మే 2: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడును గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌లో మార్కాపురం టిడిపి నేతలు కలిసి ఆయనను అభినందించారు. అభినందించిన వారిలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లాపరిషత్ మాజీవైస్‌చైర్మన్ డాక్టర్ మనె్న రవీంద్ర, టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మాజీమున్సిపల్ చైర్మన్ జక్కాప్రకాశ్, వైస్‌ఛైర్మన్ షెక్షావలిలు ఉన్నారు.
* బాబును కలిసిన బూదాల
యర్రగొండపాలెం టిడిపి టిక్కెట్టు తన సతీమణికి ఇవ్వాలని కోరుతూ బూదాల కోటేశ్వరరావు గురువారం మార్కాపురం టిడిపి నాయకులతో కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌లో చంద్రబాబును కలిసి కోరారు. ప్రస్తుతం మార్కాపురం, వైపాలెం ప్రాంతాలకు చెందిన ముఖ్యనేతలు అందరూ ఉన్నందున వారందరూ ఏకగ్రీవంగా మరోపర్యాయం నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీ కార్యకర్తలకు, నాయకులతో చర్చించి నిర్ణయం తెలపాలని చంద్రబాబు కోరినట్లు టిడిపి నేతలు తెలిపారు. బూదాల కోటేశ్వరరావు సతీమణి బూదాల అజితను రానున్న ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు సిద్ధం అవుతున్నారు. 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన పాలపర్తి డేవిడ్‌రాజు పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సిపిలో చేరినందున ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి అభ్యర్థి అవసరమయ్యారు. రెండేళ్ళుగా ఈ నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకులు లేక కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో టిడిపి నుంచి పోటీ చేసేందుకు ఆర్థిక అంగ బలాలు ఉన్న అభ్యర్థి రంగంలో దిగడంతో టిడిపి నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

ఘనంగా రథోత్సవం
పెద్దదోర్నాల, మే 2: శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మండలంలోని ఐనముక్కుల గ్రామంలో సీతారాముల దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. గురువారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు రథానికి కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఓల్వో బస్సును ఢీకొన్న లారీ
15 మందికి గాయాలు
సంతమాగులూరు, మే 2: మండల పరిధిలోని పుట్టావారిపాలెం జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఓల్వో బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేశినేని ట్రావెల్‌కు చెందిన ఓల్వో బస్సు చెన్నై నుండి హైదరాబాదుకు వెళ్తుండగా పుట్టావారిపాలెం కూడలి వద్ద వినుకొండ వైపు నుండి ధాన్యం లోడుతో వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో లారీ, బస్సు రెండు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. అదే సమయంలో హైదరాబాదు నుండి వస్తున్న అద్దంకి సిఐ ఘట్టమనేని శ్రీనివాసరావు, బల్లికురవ ఎస్‌ఐ అజయ్‌కుమార్‌లు సంఘటనా స్థలికి చేరుకుని స్థానిక ఎస్‌ఐ ఏ శివనాగరాజును అప్రమత్తం చేశారు. అందులోబాటులో ఉన్న రెండు ప్రొక్లైయిన్లను తెప్పించి పడిపోయిన బస్సును పైకి లేపి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను దించివేశారు. వారిలో గాయాలైన 15 మందిని 108 అంబులెన్స్‌లో నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వారిలో హైదరాబాదుకు చెందిన శివరాంప్రసాదు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘటన స్థలాన్ని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ గురువారం ఉదయం సందర్శించారు. కూడలిలో నాలుగువైపుల స్పీడుబ్రేకర్లను వేయించాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యుడు ఆదేశాల మేరకు రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న రాంకీ ప్రతినిధులను పిలిపించి కూడలిలో నాలుగువైపుల సాయంత్రానికి స్పీడుబ్రేకర్లను వేయించారు.

త్వరితగతిన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, మే 2: జిల్లాలో ఈనెలాఖరు నాటికి నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ విజయకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గృహనిర్మాణం, బ్యాంకు లింకేజి ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై అసెంబ్లీ నియోజకవర్గ కో -ఆర్డినేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మండలానికి రెండువేల వంతున వ్యక్తిగత మరుగుదొడ్లు మొదటి దశలో కేటాయించామన్నారు. మొదటి దశలో కేటాయించిన వ్యక్తిగత మరుగుదొడ్లను మే 15వతేదీలోగా గ్రౌండింగ్ పూర్తిచేయాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో త్వరితగతిన వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తిచేసేందుకు ఐకెపి డ్వామా సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడతగా మరో లక్ష వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించటం వల్ల సుమారు 250 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులు ఖర్చు అవుతాయన్నారు. తాగునీటి బోర్ల మరమ్మతులు చేసేందుకు సామాగ్రిని వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యలపై పరిశీలించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల దినోత్సవాల్లో విపరీతంగా తాగునీటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. తాగునీరు పథకాలు అందుబాటులో లేనట్లయితే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ప్రజలకు సరఫరా చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తిచేయటంలో వెనుకబడిన కనిగిరి, అద్దంకి డ్వామా ఎపిడిఒలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈసమావేశంలో సిపిఒ కెటి వెంకయ్య, డిఆర్‌డిఎ పిడి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

ఐస్ పార్లర్‌లో కంప్రెషర్ పేలి
ముగ్గురికి తీవ్ర గాయాలు
దర్శి, మే 2: స్థానిక పొదిలి రోడ్డులోని గీతా ఐస్‌క్రీం పార్లర్‌లో గురువారం కంప్రెషర్ పేలటంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మెకానిక్ మరమ్మతు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా పెద్దశబ్దంతో కంప్రెషర్ పేలింది. కంప్రెషర్ శకలాలు దాదాపు ఫర్లాంగు దూరంలో చెల్లచెదురుగా పడ్డాయి. ఐస్‌పార్లర్ షెడ్డు తునాతునకలైంది. కంప్రెషర్ పేలటంతో విద్యుత్ వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డిఎస్‌పి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈసంఘటన జరగటంతో వెంటనే డిఎస్‌పి వెంకటలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకున్నారు. 108 వాహనం వెంటనే రావటంతో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యంకోసం ఒంగోలుకు తరలించారు. ఈసంఘటనలో మూడేళ్ళ చిన్నారి జ్ఞానేశ్వర్‌కు, ఐస్‌పార్లర్ యజమాని కోటా రామసుబ్బారావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తరలించారు. ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైతు సదస్సుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, మే 2: జిల్లాలో రైతులు వ్యవసాయంపై మక్కువ చూపేలా రైతు సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో రైతు సదస్సుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయశాఖ, అనుబంధ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రైతు సదస్సులు ఏర్పాటుచేసేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అందులో భాగంగా వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ ఉదయం 8 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మార్కాపురం జిల్లాపరిషత్ బాలుర హైస్కూలులో, పదవ తేదీ ఉదయం ఎనిమిది నుండి ఐదుగంటల వరకు ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో, 13వ తేదీ ఉదయం ఎనిమిది నుండి ఐదుగంటల వరకు టిఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కందుకూరులో ఏర్పాటుచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సదస్సులో రైతులు వ్యవసాయంలో విత్తనాల నుండి ఎరువుల వాడకం, దిగుబడులు పొందేవరకు అవసరమైన ఖర్చులు తగ్గించి అధిక ఆదాయం పొందేవిధంగా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. రైతులకు ఉత్సాహం కలిగే విధంగా వ్యవసాయశాఖ అనుబంధ శాఖలు ప్రదర్శనలు ఏర్పాటుచేయాలన్నారు. ప్రతిశాఖ తమశాఖ ద్వారా రైతులకు అందించే ప్రయోజనాలను తెలియచేయాలన్నారు. ఈసమావేశంలో వ్యవసాయ శాఖ జెడి వి నరసింహులు, పశుసంవర్ధక శాఖ జెడి రజని, ఉద్యానవన శాఖ ఎడిలు రవీంద్రబాబు, జెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

స్వయం సహాయక సంఘాలు
సమాజం కోసం పాటుపడాలి
కలెక్టర్ విజయకుమార్ పిలుపు
ఒంగోలు, మే 2: స్వయం సహాయక సంఘాల సభ్యులు తమకోసం తమ సమాజం కోసం పాటుపడాలని జిల్లాకలెక్టర్ విజయకుమార్ స్వయం సహాయక సంఘాల సభ్యులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా శిక్షణా కేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో నాలుగు లక్షల 62వేల మంది సభ్యులున్నారని తెలిపారు. మహిళలు సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలపై, సామాజిక పరిస్థితులపై ఉద్యమించాలన్నారు. కేవలం స్వయం సహాయక సంఘాలు పొదుపుచేయటం, రుణాలు తీసుకోవటం కాకుండా సామాజిక అంశాలపై శ్రద్ధ పెట్టాలన్నారు. గతనెలలో జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలను జిల్లా అధికారులు తీసుకున్న చర్యలను సభ్యులతో చర్చించారు. జిల్లాలో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి మహిళలు సంఘాల్లో ఇప్పటివరకు చేరని సభ్యులను గుర్తించి వారిని పొదుపు సంఘాల్లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలు స్వయంప్రతిపత్తి గల సంస్థలన్నారు. స్వయం సహాయక సంఘాలు ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం చివరిలో సంఘ సర్వసభ్య సమావేశం జరపాలన్నారు. గ్రామ సమాఖ్యలో 25 గ్రూపులకంటే ఎక్కువ ఉన్న గ్రామ సమాఖ్య సంఘాలను విడదీసి కొత్త ఆర్గనైజేషన్‌తో ఏర్పాటుచేయాలన్నారు. వివిధరకాల పేర్లతో ఉన్న స్వయం సహాయక సంఘాలను గ్రామాల పేర్లతో సంఘాలను మార్చేందుకు జిల్లాసహకార అధికారికి తెలియచేయాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలు నిర్ణయించుకున్న తేదీన తప్పక సమావేశాలు నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోను అదే తేదీన సమావేశం జరగాలన్నారు. స్వయం సహాయక సంఘాలు తమకుతామే బాగానే చేస్తున్నాయని భావించటం తప్పు అన్నారు. సంఘసభ్యులు ఏకతాటిపై నిలబడి బలోపేతం కావాలన్నారు. కుటుంబాలకోసం, తోటిప్రజల కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఈసందర్భంగా కలెక్టర్‌కు తెలియచేశారు. మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో జరిగే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలకు తప్పక స్వయం సహాయక సంఘాల సభ్యులు హాజరుకావాలన్నారు. పొదుపుసంఘాల మహిళలు బ్యాంకులో దాచుకున్న పొదుపు సొమ్మును సభ్యులు బ్యాంకుల నుండి తిరిగి తీసుకునేందుకు బ్యాంకర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. పై వార్తకు పొటోను నెట్‌ద్వారా పంపించటం జరిగింది.

* అద్దంకి సీటు కోసం గొట్టిపాటి, బాచిన మధ్య వార్
english title: 
addanki

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>