Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కార్పొరేట్ ఆసుపత్రులకు ఆరోగ్య ‘సిరి’

$
0
0

శ్రీకాకుళం , మే 2: ఆరోగ్యశ్రీ ముసుగులో కార్పొరేట్ దందా బలీయమైన శక్తిగా మారింది. ఆ శక్తి నుంచే అక్రమ బిల్లుల కథలు పుట్టుకొచ్చి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తోంది. దీనిని శస్తచ్రికిత్స చేస్తామన్న ఆరోగ్యశ్రీశాఖ మంత్రిని సైతం డౌన్..డౌన్ అంటూ బెదిరిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 2012-2013 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వైద్యానికి సర్కార్ చెల్లించే ఆరు కోట్ల రూపాయల్లో ఎన్ని అక్రమ బిల్లులు ఉన్నాయన్న అసలు విషయాలు తెలుసుకునేందుకు ఆడిట్ రిపోర్టులు అడిగితే..అంతా మంత్రిని ఆడిపోసుకుంటున్న వైనం జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరు అర్థమవుతుంది! పేదవాడికి కార్పోరేట్ వైద్యం.. ఇది ఆరోగ్యశ్రీ నినాదం. పేదోడికి తెలుపురంగు రేషన్‌కార్డు ఉందంటే చాలు ఆ కుటుంబం ఆరోగ్యానికి ప్రభుత్వం ఇచ్చిన భరోసా... ప్రైవేట్ ఆసుపత్రుల పాలిట బంగారు బాతుగా తయారైంది. అధికారులు సైతం ప్రైవేట్ కార్పొరేట్ వైద్యానికే మొగ్గుచూపిస్తూ ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారనడానికి గత ఆర్ధిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన చెల్లింపులే నిదర్శనం. ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ చేసిన చెల్లింపుల ద్వారా ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలు మెరుగుపరచుకోవడానికి, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగపడుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు బలోపేతం కావడానికి ఆరోగ్య శ్రీ నిధులు పరోక్షంగా ఉపయోగపడుతుండటం విశేషం. పేదోడి నిధులు ఇలా ప్రైవేట్‌కు కనకవర్షం కురిపిస్తున్నా పాలకులు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తుండటం పలు విమర్శలకు తావిస్తుంది. కొద్ది నెలల కిందట ఆరోగ్యశ్రీ పరిధిలోనికి వచ్చిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సింగిల్ డిజిట్‌లోనే సేవలందిస్తుండగా జిల్లాకే తలమానికమైన రిమ్స్ ఆసుపత్రి కార్పొరేట్ స్థాయిలో 21 విభాగాలలో సేవలందిస్తోంది. ఇదిలా ఉండగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి సుమారు ఆరు కోట్ల రూపాయలు ఆరోగ్య శ్రీ పరిధిలో చెల్లించడం, అదీ కొద్దినెలలకు గాను కావడం అధికారులకు ప్రైవేట్‌పై ఉన్న మక్కువ ఏపాటిదో అర్ధం అవుతుంది. జిల్లాకు చెందిన వైద్య విద్య శాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్ ఇటీవల ఓ కార్యక్రమంలో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నాము అంటూ పేర్కొన్నప్పటికీ, జిల్లాలోనే ఉన్న వైద్య విద్య కళాశాలకు ఆరోగ్య శ్రీ ద్వారా తక్కువ మొత్తంలో చెల్లిస్తున్నా ఏనాడూ సమీక్షించిన దాఖలా లేదు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య శ్రీ కార్డుదారులకు వివిధ శస్త్ర చికిత్సలకు గాను ప్రభుత్వం సుమారు 11 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు 3,11,34,000 రూపాయలను చెల్లించగా, ప్రైవేట్ ఆసుపత్రులకు 7,84,25,000 రూపాయలు చెల్లించారు. విశాఖపట్నంలో జిల్లా ప్రజలు అందుకున్న ఆరోగ్య శ్రీ సేవలకు చెల్లింపులు దీనికి అదనం. కాగా రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్) లో ఆరోగ్య శ్రీ ద్వారా ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు, మూత్రకోశవ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, ప్రమాదగాయాలు, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సల్లో 2259 శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అదే కిమ్స్ సాయిశేషాద్రి ప్రైవేట్ ఆసుపత్రి, బగ్గుసరోజినీదేవి, సింధూర ఆసుపత్రుల్లో ఎక్కువగా మూత్రకోశ వ్యాధులు, ప్రమాద గాయాలు, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సల్లో 2589 శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఒక్క శస్త్ర చికిత్సను చేయకపోవడం కూడా వైధ్యాధికారుల అలసత్వానికి నిదర్శనం. ప్రభుత్వానికి కాదని, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ నిధులు కోట్ల రూపాయలు చెల్లించడంలో ఉన్న తేడాల్లో మర్మం అధికారులకే తెలియాలి.

రిమ్స్‌లో బయోమెట్రిక్ రగడ

సమయపాలనతోనే జీతాలు
వ్యతిరేకించిన నర్సులు
అవగాహన లేదని మొర

శ్రీకాకుళం , మే 2: జిల్లా కేంద్రం రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)లో అనుకున్నట్టుగానే బయోమెట్రిక్ వివాదం రాజుకుంది. ఇటీవల సిబ్బంది సమయపాలనపై మీడియా బయోమెట్రిక్ పద్ధతిని వెలికితీసిన విషయం విధితమే. చర్యల్లో భాగంగా రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.అరవింద్ బయోమెట్రిక్ సమయం సరిచూడనిదే జీతాలు ఇచ్చేది లేదంటూ నర్సుల జీతాల పట్టికలో సంతకం చేయలేదు. దీంతో నర్సులంతా గురువారం ఉదయం సూపరింటెండెంటు కార్యాలయాన్ని ముట్టడించారు. బయోమెట్రిక్ నుండి ప్రస్తుతానికి మినహాయింపునివ్వాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను తాను పాటించక తప్పదని, వ్యక్తిగతంగా తనకు నర్సులపై ద్వేషం లేదని చెప్పారు. అయితే బయోమెట్రిక్‌పై తమకు పూర్తి అవగాహన లేదని, ఒక్కో పర్యాయం బయోమెట్రిక్ పనిచేయని సందర్భాలు ఉన్నాయని సిబ్బంది సూపరింటెండెంటు దృష్టికి తీసుకువచ్చారు. సూపరింటెండెంటు మాత్రం జీతాలు చూడాల్సిన విషయం డిడివో శోభారాణిదంటూ ఆమెకు అప్పజెప్పారు. ఆమె సీనియర్ అసిస్టెంటు వస్తే బయోమెట్రిక్ చూసి జీతాల పట్టిక తయారుచేస్తారని చెప్పడంతో నర్సులు సూపరింటెండెంట్‌తో వాదనకు దిగారు. బయోమెట్రిక్ విషయంలో పొరపాటులుంటే ఇంకో విధంగా చర్యలు తీసుకోవాలని, జీతాలు ఎలా ఆపుచేస్తారంటూ రగడ చేశారు. అనంతరం సూపరింటెండెంటు అరవింద్ తాను ఈ విషయం తరువాత చూస్తానని, జీతాలు వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పడంతో వారు వెనుదిరిగారు.

ఆధార్ ఆధారిత పట్టాదారు పాసు పుస్తకాలు

* జాయింట్ కలెక్టర్ భాస్కర్

శ్రీకాకుళం (టౌన్), మే 2: జిల్లాలో ఆధార్ ఆదారిత పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు జ్లి జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలను ఆధార్ కార్డుతో అనుసంధానించి జారీచేయడానికి అన్ని చర్యలు చేపట్టాలని తహశీల్దార్లను ఆదేశంచారు. తహశీల్దార్ల ఆధీనంలో 1 బి రిజిష్టర్‌ను పూర్తి ప్రక్షాళన చేసి ఎటువంటి తప్పులు లేకుండా చేయాలని చెప్పారు. మొదటగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఆ వివరాలు తాజా పరచాలని అన్నారు. సదస్సులో వచ్చిన సమస్యలను వాటి నిర్ధేశిత సమయంలో పరిష్కరించాలని ఆయన తెలిపారు. ముందుగా సమస్యలపైన తహశీల్దార్లకు అవగాహన ఉండాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్‌ల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రుణ అర్హత గల వారి జాబితా బ్యాంకులవారీగా ఈ నెల 7వ తేదీ నాటికి అందించాలని అన్నారు. సమావేశంలో డీ ఆర్వో నూర్‌భాషా ఖాసిం, ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

బిఎస్‌ఎన్‌ఎల్ కేబుళ్ల ధ్వంసంపై..

మున్సిపల్ కమిషనర్‌పై కేసు?
శ్రీకాకుళం , మే 2: పట్టణంలో విస్తరణలో భాగంగా రోడ్డు కిరువైపులా నిర్మాణం చేపట్టిన కాలువల తవ్వకాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ కేబుళ్లు పాడైనందుకు మున్సిపల్ కమిషనర్ పి.రామలింగేశ్వర్‌పై బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు కేసు పెట్టడంతో పాటు, నష్ట పరిహారం కోరనున్నట్లు బిఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం సంస్థ అనుమతి తీసుకోకుండా పట్టణ విస్తరణలో భాగంగా సూర్యమహల్ కూడలి వద్ద చేపడుతున్న కాలువ నిర్మాణం కోసం చేసిన తవ్వకాల్లో సుమారు 1500 బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు పాడైపోయాయి. వీటి పరిధిలో ఉన్న జాతీయ బ్యాంకుల్లో లావాదేవీలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. దీంతో వినియోగదారులకు అందిస్తున్న సేవల్లో అంతరాయం ఏర్పడగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కమీషనర్‌పై కేసు పెట్టనున్నామన్నారు. కేసుతో పాటు 45 లక్షల రూపాయల నష్టపరిహారం కోరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పట్టణానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు బిఎస్‌ఎన్‌ఎల్ జియం మహంతిపై ఫిర్యాదు చేయగా వీడియో కాన్ఫరెన్సులోనే ఢిల్లీ స్థాయిలోని ఉన్నతాధికారి పట్టణ మున్సిపల్ కమీషనర్‌పై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసామని చెప్పారు.

వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
అటవీశాఖ రేంజ్ అధికారి సంజయ్‌యాళ్ల
పాతపట్నం, మే 2: వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ రేంజ్ అధికారి సంజయ్‌యాళ్ల అన్నారు. ఇక్కడ అటవీశాఖ కార్యాలయంలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ సీతంపేట మండలం చిన్నబగ్గు పంచాయతీ పరిధిలోని మోహనకాలనీకి చెందిన బిడ్డిక వీరస్వామి, ఎ.గంగన్నలు నాటుతుపాకీతో వన్యప్రాణుల వేటకు పాల్పడ్డారన్నారు. మంగళవారం రాత్రి కొత్తూరు పరిధిలో బత్తిలి రిజర్వు ఫారెస్టు పరిధిలో వీరు వేటాడిన వన్యప్రాణులు తప్పించుకుపోతుంటే బుధవారం ఉదయం ఉపాధి పనులు ముగించుకుని మరలా వేటాడిన జంతువుల ఆధారంగా వాటిని వెతుకుతున్న తరుణంలో విధి నిర్వహణలో భాగంగా ఆ ప్రాంతానికి చెందిన కొత్తూరు ఎస్.ఎస్.ఒ వినోద్‌కుమార్, ఎస్‌జిఒ దయానంద్‌లు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. బిడ్డిక వీరస్వామి పట్టుబడగా గంగన్న తప్పించుకున్నాడని తెలిపారు. పట్టుబడిన వీరస్వామిని పాలకొండ కోర్టు పరిధిలో హాజరుపరిచినట్లు తెలిపారు.

కూర్మనాథుని క్షేత్రంలో మంత్రి కన్నా

గార, మే 2: దశావతారాల్లో రెండవ దైన కూర్మావతారంలో మహావిష్ణువు భక్తులచే పూజలందుకొంటున్న శ్రీకూర్మ క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుటుంబీకులతో కలసి గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి అర్చకులు, పాలక మండలి సభ్యులు, ఆలయాధికారులు సాదరంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ బేడా మండపంలోని గోడలపై ఒడిశా ఆకుపసర్లుతో వేసిన నాటి చారిత్రక చిత్రాల విశిష్టతను అక్కడి అధ్యాపకులు వివరించడమే కాకుండా క్షేత్ర మహాత్స్యాన్ని, ఆలయ చరిత్ర, విశిష్టతలను చెప్పుకొచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు చామర్ల సీతారామ నృసింహాచార్యులు నేతృత్వంలో అర్చకులు వీరిచే విశేషార్చనలు, పూజలు నిర్వహింపజేసారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ సన్నిధిలో కూడా వీరిచే అర్చకులు విశేషార్చనలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో ఆర్చకులు ఆశీర్వచనాలు పలికి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. ఆయన వెంట డి.సి.ఎం.ఎస్.చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మాజీ ఎంపిపి గొండు రఘురాం, శ్రీకాకుళం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బరాటం నాగేశ్వరరావు, కైబాడి రాజు, దివిలి అప్పారావు, పొన్నాడ రుషీశ్వరరావు, బరాటం రామశేషులతో పాటు పలువురు ఉన్నారు.
ఆదిత్యుని సేవలో మంత్రి కన్నా
శ్రీకాకుళం: రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కన్నాలక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యులతో గురువారం అరసవల్లి ఆదిత్యుణ్ణి దర్శించుకున్నారు. తొలుత ఆలయ మర్యాదలతో అర్చకులు లోపలకు ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం అనివెట్టి మండపంలో మంత్రి దంపతులకు ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆశీర్వచనాలు పలికి తీర్ధప్రసాదాలు అందించారు. జిల్లాకు చెందిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

మహిళలు విద్యపై ఆసక్తి పెంచుకోవాలి
* వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ పద్మప్రియ
నరసన్నపేట, మే 2: నేటి సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యపట్ల మహిళలు మరింత ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ అన్నారు. గురువారం ఇక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ పరీక్షలను ఆమె రాశారు. విద్యపట్ల మక్కువతోనే తాను ఈ వయసులో బిఏ చదివేందుకు ముందుకు వచ్చానని తెలిపారు. నేటిపరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, మహిళల పట్ల అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రతీ ఒక్కరూ అన్ని విషయాల్లో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈమె వెంట డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జ్యోతిఫెడరిక్, అధ్యాపకులు పాల్గొన్నారు.

రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమిది
* చంద్రబాబు పాలనలో అన్నదాతకు దుర్భిక్ష పరిస్థితులు
* రుణ మాపీ, ఉచిత విద్యుత్, పంట గిట్టుబాటుధర కాంగ్రెస్ ఘనతే
* వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
పాలకొండ(టౌన్)/ బూర్జ, మే 2: రాష్ట్రానికి ప్రాణపదమైన వ్యవసాయాన్ని, వెన్నుముకలాంటి రైతులను అధికారంలో ఉన్నప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు గాలికొదిలేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ విమర్శించారు. గురువారం ఆయన బూర్జ మండలంలో కొల్లివలసలో నిర్వహించిన రైతుచైతన్య యాత్రకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగని చెప్పి రైతులను విస్మరించారన్నారు. ఆయన హయాంలో ఎక్కడ చూసినా కరువు, బీడుభూములతో అన్ని ప్రాంతాల్లోను ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. అనంతరం అధికారం లోకి వచ్చిన తాము రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, రాయితీలకే ఎరువులు, విత్తనాలు, పనిముట్లు అందించి గిట్టుబాట ధర సహితం కల్పించిందన్నారు. దీంతో రైతులు వ్యవసాయం పట్ల శ్రద్ధ వహించడంతో దేశంలోనే వరిపండించడంలో మన రాష్ట్రం రెండవ స్థానం సాధించిందన్నారు. తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమన్నారు.
రైతులకు వెన్నుముక వంటివి భూసార పరీక్షలు
రైతులకు వ్యవసాయం లాభసాటిగా జరిగేందుకు వెన్నుముకవంటివి భూసార పరీక్షలని ఆయన వెల్లడించారు. మెరుగైన విత్తనాలు, సకాలంలో అందించాల్సిన ఎరువులు వంటివి రైతులు గుర్తించి వ్యవసాయం చేయాలన్నారు. ప్రభుత్వం ఎరువుల సబ్సీడీలో భాగంగా వేలాది రూపాయలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విత్తన రాయితీల కోసం 150 కోట్లు, ఎరువుల రాయితీ కోసం 9200 కోట్లు భరిస్తుందని దీంతో రైతులకు తక్కువ ధరకు వీటిని అందించడం జరుగుతుందన్నారు. ఉచిత విద్యుత్ కోసం ఏటా 4000 కోట్లు రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయకూలీలకు ఆధారం లభించందన్నారు. గతంలో వలసలతో గ్రామాలు ఖాళీలయ్యే పరిస్థితి ఉండేదని ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు. సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ తాను ప్రభుత్వంలో మంత్రినైనప్పటికీ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రితో పాటు ఎవరితోనైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి టిఆర్ రాజుపేట వచ్చిన సందర్భంగా తోటపల్లి సాగునీటిని ఓనిగెడ్టకు అనుసంధానం చేయాలని కోరామని, అయితే ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని త్వరితగతిన ఈ పనులను ప్రారంభించేందుకు మంత్రులు సహకరించాలని ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ కోరగా ఆయన పై విధంగా స్పందించారు. రైతుల ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు.
అప్పుల ఊబిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు 13.5కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత తమ తమప్రభుత్వానిదేనన్నారు. బ్యాంకుల ద్వారా 54వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు అందించడం జరిగిందన్నారు. ఓనిగెడ్డ కాలవలో తోటపల్లి కాలువలకు అనుసంధానం చేసేందుకు 7కోట్ల రూపాయలతో పంపించిన ప్రతిపాదనలను పరిశీలించి నిధులు మంజూరుకు కృషిచేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
అనంతరం మండలంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి కన్నాకు దుశ్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కోండ్రుమురళీమోహన్ లకు నాగళ్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, పాలకొండ, టెక్కలి, అముదాలవలస ఎమ్మెల్యేలు నిమ్మకసుగ్రీవులు, కొర్లభారతి, బొడ్డేపల్లి సత్యవతి, కలెక్టర్ సౌరభ్‌గౌర్, వ్యవసాయశాఖాధికారులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

* ఏడాదికి రిమ్స్‌కు రూ. 3కోట్లు * కిమ్స్‌కు రూ. 6 కోట్లు చెల్లింపులు
english title: 
arogya sree

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>