Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘జూన్ నాటికి అందరికీ యుఐడి నెంబర్లు’

$
0
0

విజయనగరం, మే 2: ప్రభుత్వ పథకాల కింద లబ్ధిపొందుతున్న లబ్ధిదారులందరికీ జూన్ నాటికి ఆధార్ నంబర్లు (యుఐడిఎఐ) కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య చెప్పారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆధార్ కార్డుల నమోదుకు సంబంధించి వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 23.45 లక్షల జనాభా ఉన్నారని వారిలో 18 లక్షలు వరకు ఆధార్ చేయించుకున్నారని చెప్పారు. అయితే వాటిలో 40 శాతం వరకు వివిధ కారణాల వల్ల విభేదిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో 92 వేల మంది లబ్ధిదారులకు జూలై నుంచి ఆధార్ అవసరం కాగా అందులో చాలా మంది ఎన్‌రోల్ చేసుకున్నారని వాటిని సరిచేయాల్సి ఉందన్నారు. అదే విధంగా రెండో దశలో గ్యాస్ కనెక్షన్, పింఛన్లకు ఆధార్ విస్తరిస్తామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆధార్ నమోదు చేసుకున్న వారదరికీ ఆలస్యంగానైనా కార్డులు వస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమైతే లబ్ధిదారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆధార్ నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ఆధార్ నంబరు బదులు యుఐడిఎఐ అనుసంధానించి నగదు బదిలీ పథకాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఆధార్ కోసం మండల స్థాయిలో మండల ప్రత్యేకాధికారి, మండల తహశీల్దారు, ఎంపిడిఒలే బాధ్యత వహించాలని కలెక్టర్ ఆదేశించారు. భవిష్యత్‌లో ఆధార్‌తోనే అన్ని సేవలు
భవిష్యత్‌లో ఆధార్‌తోనే అన్ని సేవలు లభిస్తాయని యుఐడిఎఐ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఆధార్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి అన్నారు. ఒక వ్యక్తికి రెండు, మూడు బ్యాంకు ఖాతాలు, జాబ్ కార్డుల నంబర్లు ఉండే అవకాశం ఉందని, అయితే ఆధార్‌లో ఒకే నంబరు ఉంటుందని తద్వారా బోగస్‌లను అరికట్టే అవకాశం ఉందన్నారు. అదే విధంగా పథకాలు సక్రమ అమలుకు, లబ్ధిదారునికి నేరుగా అందించడానికి పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆధార్ నమోదు తప్పనిసరి అన్నారు. అదే విధంగా పథకాల సక్రమ అమలుకు, లబ్ధిదారునికి నేరుగా అందించడానికి పథకం దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఆధార్ నమోదు తప్పనిసరి అన్నారు. ఆధార్ పేమెంట్ బ్రిడ్జి (ఎపిబి) ద్వారా ఆధార్ నంబరు ఆధారంగా డబ్బులు ఒక చోట నుంచి వేరే చోటుకు సులభంగ పంపవచ్చునన్నారు. అదే విధంగా మైక్రో ఎటిఎం ద్వారా అనేక నగదు లావాదేవీలు చేయవచ్చునన్నారు. కాగా, ఆధార్ పొందిన వారు తిరిగి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, నమోదు నంబరు (ఇఐడి)తో వెబ్‌సైట్‌లో వెతికితే స్టేటస్ తెలుస్తుందన్నార. గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేది ముందు నమోదు చేసుకున్న వారి వివరాలు లభ్యం కావడం లేనందున వారు మాత్రం మరోసారి ఎన్‌రోల్ చేయించుకోవాలన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా ఇ-ఆధార్‌ను పొందవచ్చునన్నారు. ఆధార్ కేంద్రంలో నమోదు జరిగిన ఒక నెల రోజుల తరువాత స్టేటస్ తెలుస్తుందన్నారు. ఇప్పటి వరకు దేశంలో 33 కోట్ల మందికి ఆధార్ తీయించుకున్నారని వారికి ఆధార్ కార్డులు పంపడంలో ఆలస్యం జరుగుతుందన్నారు. ఒక్కసారి నమోదు జరిగిన తరువాత 1:1 చేయాల్సి ఉన్నందున తద్వారా డూప్లికేషన్లు నివారించవచ్చునని అన్నారు. జిల్లాలో కొన్ని సాంకేతిక లోపాల వల్ల 8.50 లక్షల మందికి ఆధార్ నమోదులు తిరస్కరించడం జరిగిందన్నారు.
ఆధార్ నమోదు సమయంలో లోపాలు గుర్తిస్తే 96 గంటల్లో సరిచేసుకోవచ్చునన్నారు. లేకుంటే కార్డు వచ్చాకగాని లేదా ఇఐడి నంబరు ఆధారంగా వివరాలను అప్‌డేషన్ చేసుకోవచ్చునన్నారు. ఆధార్ సీడింగ్ ద్వారా 12 అంకెల యుఐడిఎఐ నంబరు కాకుండా ర్యాండమ్‌గా నంబరు జనరేట్ అవుతుందన్నారు. ఈ నెంబరు దేశంలో ఒక్కరికే ఉంటుందని యుఐడిఎఐ నంబరు లేదా ఇఐడి నంబరును లబ్ధిదారులు బ్యాంకు ఖాతా నంబరు, ఐడి నంబరు, కార్డు నంబరు తదితర నంబర్లతో అనుసంధానించి లబ్ధి చేకూరుస్తామన్నారు. ఈ సదస్సులో జెసి శోభ, డిఆర్వో హేమసుందర్, జెడ్పీ సిఇఒ మోహనరావు, ఐటిడిఎ పిఒ అంబేద్కర్, ఆర్డీవోలు రాజకుమారి, వెంకటరావు, యుఐడిఎఐ అధికారులు, సంక్షేమ8 పథకాలు అమలు చేస్తున్న విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ప్రచార రథాలను ప్రారంభించిన కలెక్టర్
విజయనగరం, మే 2: ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాకు రెండు ప్రచార రథాలను ఏర్పాటు చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రతి కార్యక్రమం, పథకాలపై ప్రజల్లో అవగాహన కలిగి వాటిని వినియోగించుకునే స్థాయికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. కళాజాతాలపై ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, సామాన్యుడు కూడా అర్థం చేసుకుంటారని అన్నారు. ప్రచార రథంలో ఏర్పాటు చేసిన డయాస్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్‌సి ప్రాజెక్టరు, స్క్రీన్‌లను పరిశీలించిన కలెక్టర్ ప్రచారానికి వాటిని కూడా సద్వినియోగపరచుకోవాలని సూచించారు. కురపాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో 40 కళాజాతల ద్వారా ప్రచార కార్యక్రమాలను గురువారం నుంచి నిర్వహిస్తామని డిపిఆర్‌ఒ గోవిందరాజులు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై చేపట్టిన పలు అంశాలతో కూడిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కళా బృందాలు, ఛాయాచిత్ర ప్రదర్శనల ద్వారా 100 రోడ్‌షోలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అందుకు సంబంధించి ఫ్లెక్సిలు, కరపత్రాలు, స్టిక్కర్లు మొదలైనవి రెండు, మూడు రోజుల్లో సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. ప్రచార రథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎపిఆర్‌ఒ జానకమ్మ, ఎ.వి.సూపర్‌వైజర్ కె.బాలమాన్‌సింగ్, పబ్లిసిటీ అసిస్టెంట్లు డి.సత్యనారాయణ, బి.మురళీమోహన్, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్.ప్రభుదాస్ పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
‘రా సుగర్ ఉత్పత్తికి చర్యలు’
సీతానగరం, మే 2: లచ్చయ్యపేట ఎన్.సి. ఎస్. సుగర్ ఫ్యాక్టరీ ముడి పదార్థం ద్వారా చక్కెర ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు సి. ఇ. ఒ. ఆంజనేయులు తెలిపారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రా సుగర్ ఉత్పత్తికి 27వేల టన్నులు ముడి సరకును దిగుమతి చేశామని, దీని ద్వారా రోజుకు 500 నుంచి 600 వరకు పంచదార బస్తాలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. రా సుగర్ ఉత్పత్తి ప్రారంభమయ్యాక చెరకు బిల్లుల చెల్లింపులను కూడా వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి ఫిబ్రవరి వరకు రైతులకు చెల్లించాలని చెరకు బిల్లులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. యాజమాన్యానికి రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బొబ్బిలి పౌర సంక్షేమశాఖ అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్మనాయుడు చెరకు బిల్లుల చెల్లింపులపై సి.ఇ.ఓ.కు విన్నవించుకున్నారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా బిల్లుల చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు.

ఆకట్టుకుంటున్న మే ఫ్లవర్స్
కురుపాం, మే 2: కేవలం మే నెలలోనే పువ్వులు పూసే చెట్లు చాలా అరుదు. అటువంటి మే ప్లవర్ చెట్టు కురుపాంలో పలువురిని ఆకర్షిస్తోంది. నెలకో పువ్వు వంతున అన్నట్లుగా ఒకేసారి 12పువ్వులు పూసి అందరినీ ఆకర్షించడం ఎంతో విశేషం. కురుపాం శోభలతాదేవి కాలనీలో నెల్లి శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న ఈ మే ప్లవర్ చెట్టు ఎంతగానో ఆకర్షిస్తోంది. చక్కనైన రంగులో ముద్దబంతి పువ్వులా ఉండే ఈ పువ్వులు ప్రతీ ఏడాది మేలోనే పూస్తాయని చెట్టు పెంపకందారుడు చెప్పారు.

భారంగా మారిన భూ క్రయ, విక్రయాలు
గజపతినగరం, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి భూముల విలువను ఒక్కసారిగా రెండింతలు పెంచి రిజిస్ట్రేషన్ రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజుల శాతాన్ని తగ్గించింది. వాస్తవానికి రిజిస్ట్రేషన్ ఫీజుల భారాన్ని మండల కేంద్రాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిస్తున్నట్లు చెప్పినప్పటికీ భూముల విలువను ఒక్కసారిగా పెంచడంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ రూపంలో కట్టాల్సిన భారం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం పరోక్షణగా భూముల క్రయవిక్రయదారుపైనా భారాన్ని మోపుతున్నది. ఈనెల నుండి క్రయ విక్రయాలు జరుపుతున్న భూముల యజమానులు రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళితె ప్రభుత్వం పెంచిన భారాలతో లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం ఈనెల నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూముల ధరలను రెండింతలు పెంచేసింది. ఉదాహరణకు పురిటిపెంటలో మెట్ట్భుమి ధర 2.50 లక్షల రూపాయలు, పల్లంభూమి ధర మూడు లక్షల రూపాయలు ఉండగా ప్రస్తుతం మెట్ట్భూమి 4 లక్షలు, పల్లంభూమి విలువను 4 లక్షలకు పెంచింది. వాస్తవంగా చూసుకుంటే బహిరంగ మార్కెట్‌లో కూడా ధరలు ప్రభుత్వ ధరలకు అనుగుణంగానే ఉన్నాయి. గతంలో పురిటిపెంట రెవెన్యూ పరిధిలో ఇళ్ల స్థలాలకు సంబంధించి గజం ధర వెయ్యిరూపాయల విలువను రిజిస్ట్రేషన్ అధికారులు నిర్ణయించగా ప్రస్తుతం 2 వేల రూపాయలకు పెంచారు. అదే ఇంటి నెంబరు కలిగిఉన్నట్లయితే ధరను 2500 రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. మదుపాడలో గజం ధర 750 రూపాయల, గజపతినగరంలో పురిటిపెంట రేట్లనే నిర్ణయించారు. వ్యవసాయ భూమి అయినప్పటికీ 10 సెంట్లులోపు భూములను క్రయ విక్రయాలు జరిపితే గృహ అవసరాలుగానే రిజిస్ట్రేషన్ అధికారులు గుర్తించడం విశేషం. పది సెంట్లలోపు వ్యవసాయ భూమి అయినప్పటికీ గృహ అవసరాల భూమిగా గుర్తించి గజం ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో గ్రామాల్లో చిన్న కమతాలు కొనుగోలు చేసే రైతులకు ప్రభుత్వ నిర్ణయం శిరోభారంగా తయారైంది. రిజిస్ట్రేషన్లకు గత ఆర్ధిక సంవత్సరంలో 8.5 శాతం ఫీజును వసూలు చేయగా ప్రస్తుతం 5.5 శాతానికి తగ్గించారు.రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి భూముల విలువ పెంచడంతో భారం తప్పడం లేదు.

చురుగ్గా స్టేట్ హైవే నిర్మాణ పనులు
గరుగుబిల్లి, మే 2: తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న స్టేట్ హైవే నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుతం ఉన్న పార్వతీపురం- శ్రీకాకుళం రహదారి ముంపునకు గురవ్వడంతో నూతనంగా స్టేట్ హైవే రహదారిని నిర్మించారు. ఈ మేరకు సుంకి రహదారి జంక్షన్ నుంచి పార్వతీపురం సమీపంలోని నవిరి నిర్వాసితుల కాలనీ వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా రహదారి పరిధిలో పలు చోట్ల వర్షం నీరు వెళ్లేందుకు వీలుగా వంతెన నిర్మాణం చేపట్టామని తోటపల్లి ప్రాజెక్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ప్రస్తుతం కొంతమేర తారు రోడ్డు నిర్మాణం పనులు పూర్తయ్యాయని మిగిలిన రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వీలైనంత త్వరగా రహదారి నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వంతెనల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియచేశారు.
దీంతో చాలా కాలంగా ఉన్న నిర్వాసితుల డిమాండ్ తీరనున్నదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్వాసితుల కాలనీకి రహదారి సమస్య తీరనుందని తెలిపారు.

‘్ఫటోగ్రఫి కోర్సుల ప్రారంభానికి కృషి’
డెంకాడ, మే 2 : ఆంధ్రవిశ్వవిధ్యాలయం అనుబంధ కళాశాలల్లో కొత్తగా ఫోటో గ్రఫీ కోర్సులను ప్రారంభించనున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి జి.సూర్యనారాయణరాజు అన్నారు. పివిజి రాజు 90వ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని మహారాజా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ కెఎల్‌ఎన్ రాజు ఆధ్వర్యంలో మాన్సాస్ సంస్థల చైర్మన్ పి.ఆనందగజపతిరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన ఏయు విసి మాట్లాడుతూ ఏయు అనుబంధంగా గతంలో ఏర్పాటు చేసిన డిప్లమె కోర్సుల మాదిరిగా కొత్తగా ఫొటో గ్రఫీ కోర్సులను ఏర్పాటు చేస్తున్నామని ఎన్‌సిసిని కూడా ఇంజనీరింగ్ కళాశాలలకు అనుబంధం చేస్తామని, మాన్సాస్ సంస్థ చాలా గొప్పదని కొనియాడారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో బోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.
విలువలతో కూడిన విద్య అవసరమని అన్నారు. సమయం ధనం, విద్య, చాలా విలువైనవని సూచించారు. కార్యక్రమం అనంతరం విసికి కళాశాల అధ్యాపక బృందం ప్రత్యేకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎ.రాఘవరావ్, వైస్ ప్రిన్సిపాల్స్ రామచంద్రరాజు, శేఖర్, పాలకమండలి సభ్యులు కృష్ణరాజు, పిఎల్ రాజు, డా.రామ, మాన్సాస్ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

పట్టణంలో పలు చోట్ల చోరీలు
విజయనగరం , మే 2: పట్టణంలో దొంగలు వీరవిహారం చేశారు. ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో నాలుగు ఇళ్లు, ఒక పాన్‌షాపులో దుండగలు చోరీలకు పాల్పడ్డారు. ఒకరోజు నాలుగు చోట్ల చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. ఈ దొంగతనాలన్నీ పాత నేరస్థుల పనిగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో అలకానందా కాలనీకి చెందిన విశ్రాంత కోశాధికారి ఇమ్మంది పాండురంగారావు ఇంట్లో దుండగలు చొరబడి 15.5 తులాల బంగారు నగలను అపహరించికుపోయారు. ఆయన ఒక గదిలో, భార్య మరో గదిలో నిద్రిస్తున్నారు. ఇంటి వెనుక ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన దుండగలు పాండురంగారావు భార్య మెడలో బంగారు పుస్తెల తాడును కత్తితో కోసివేశారు. ఆ పుస్తెల తాడుకు ఉన్న తాళంతో బీరువాను తెరచి అందులో ఉన్న బంగారు, వెండి వస్తువులను అపహరించుకుపోయారు. అక్కడకి సమీపంలో కె.ఆర్ ప్రసాద్ ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 17.5 తులాల బంగారు నగలు అపహరించుకుపోయారు. సాలిపేటలోని సైలాడ కాలనీకి చెందిన జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆర్.వి రమణమూర్తి ఇంట్లో 6 తులాల బంగారు నగలు, ఒక ద్విచక్ర వాహనం 10 వేల రూపాయల నగదును అపహరించికుపోయారు. రమణమూర్తి బుధవారం హైదరాబాద్ వెళ్లడంతో ఆయన భార్య సత్యవతి, కుమారుడు అవినాష్‌లో మేడపైన గదిలో పడుకున్నారు. దీంతో దుండగలు వారు పడుకున్న గదికి బయట గడియపెట్టి, కింది భాగంలోని ఇంటి వెనుక తలుపు చెక్క పెకిలించి లోపలికి ప్రవేశించారు. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక ప్రైవేట్ సంస్థ ఉద్యోగి సి.హెచ్ సూర్యనారాయణ భార్య సుజాత స్వగ్రామం వెళ్ళింది. సూర్యనారాయణ బుధవారం రాత్రి డ్యూటీ వెళ్ళిపోవడంతో ఇంటి తలుపులు విరగ్గొట్టి ఇంట్లో ఉన్న సుమారు 2.5 తులాల బంగారు నగలు, 2 వేల రూపాయల నగదును అపహరించికుపోయారు. అక్కడకి సమీపంలోగల గోకపేటలో పలకల ఈశ్వరమ్మకు చెందిన పాన్‌షాపులో 30 వేల రూపాయల నగదు, 10 తులాల వెండి పట్టీలను అపహరించారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు ఒకటవ పట్టణ పోలీసులు క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలను సేకలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
శృంగవరపుకోట, మే 2 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు. రైతు చైతన్య యాత్రల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారం చేపట్టిన దగ్గర నుండి నేటి వరకూ రైతుల పక్షాన నిలిచి అనేక అభివృద్ధి సంక్షేమ పధకాల ద్వారా రైతులను ఆదుకుంటుంన్నామన్నారు. గతంలో 300 కోట్ల రూపాయలు కేటాయించగా ప్రస్తుతం 2900 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రైతులకు రుణాల లక్ష్యాన్ని 74 వేలకోట్ల రూపాయలకు పెంచామన్నారు. కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు,రుణాలు, రుణమాఫీలు కూడా వర్తించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం 1.5 లక్షల రూపాయలకు పెంచిన ఘనత కాంగ్రెస్‌దే నన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్ సకాలంలో విత్తనాలు ఎరువులు పంటకు గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ రైతు చైతన్య యాత్రల్లో భాగంగా వ్యవసాయశాఖా మంత్రి జిల్లాకు రావడం హర్షనీయమన్నారు. వ్యవసాయానికి సంబంధించిన జిల్లాలో ఉన్న పలు సమస్యలను వినతులద్వారా మంత్రికి అందజేసారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకోసం మండు టెండలో మంత్రులు, అధికారులు గ్రామాలు తిరిగి రైతులను చైతన్య పరచడానికి, ఆధునిక పద్దతుల పట్ల అవగాహన కల్పించేందుకే ఈ యాత్రలు నిర్వహిన్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు, రుణాలు, అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది జిల్లాలో 900 కోట్లు రైతులకు వివిధ బ్యాంకుల ద్వారి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. తాటిపూడి రిజర్వాయిర్ నుండి తాగునీటి జెఎ ఛానల్ అభివృద్ధి, వేములాపల్లి గ్రోయిన్ తిరిగి పునరుద్ధరించాలని, నీలం తుపాను కారణంగా పాడైన చెరువులను తిరిగి బాగు చేయాలని, ఈ ప్రాంతంలో కూరగాయల పంటలు ఎక్కువగా ఉన్నందున కోల్డ్ స్టోరేజి, రైతు బజార్ ఏర్పాటు చేయాలని మాజీ వైస్ ఎంపిపి ఇందుకూరి రఘురాజు వివిధ సమస్యలను మంత్రి దృష్టికితీసుకు వెళ్లారు. ముందుగా వ్యవసాయ విత్తనాభివృద్ధి, పశుసంవర్ధక,పట్టు పరిశ్రమ,కోఆపరేటివ్ సుగర్, మైక్రోఇరిగేషన్, ఉద్యానవన శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాజకుమారి, వ్యవసాయశాఖ జెడి లీలావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దొంగలు బాబోయ్... దొంగలు!
విజయనగరం, మే 2: వేసవిలో ఉక్కపోతను భరించలేక ఇబ్బందులు పడుతున్న జనానికి జిల్లాలో వరుస దొంగతనాలు దడ పుట్టిస్తున్నాయి. మనుష్యులు ఉన్న ఇళ్ళలోను, లేని ఇళ్ళలోను వరస దొంగతనాలకు పాల్పడటంతో జనం దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏకదాటిగా వరుస ఇళ్లలో చోరీకి పాల్పడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పట్టణంలోని కె.ఎల్.పురం, పూల్‌బాగ్ కాలనీల్లో చోరీకి పాల్పడ్డారు. తాజాగా రెండు రోజుల క్రితం డెంకాడలో దొంగతనానికి ప్రయత్నించిన ముఠా గురువారం రాత్రి పట్టణంలో వరుస నాలుగిళ్లలో చోరీకి పాల్పడి సుమారు 42 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దీంతో స్థానికులు ఇళ్లు విడిచి ఎక్కడికి వెళ్లాలన్న భయపడుతున్నారు. రాత్రి వేళ పోలీసు గస్తీ తగ్గుముఖం పట్టడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు విమర్శిస్తున్నారు. నేడు పోలీసులు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు ప్రజల్ని అప్రమత్తం చేయడంతోపాటు రాత్రి వేళ గస్తీకి ఎక్కువ సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది.
కాగా, వరస ఇళ్ళల్లో చోరీకి పాల్పడుతున్న వైనాన్ని పరిశీలిస్తే.. ఇటీవల జైళ్ల నుంచి విడుదలైన నేరస్తులు ఈ దొంగతనాలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ఉడా కోలనీ, రింగురోడ్డు, కొండకరకాం, బాబామెట్ట దాసన్నపేట, కాళీఘాట్ కోలనీ తదితర ప్రాంతాల్లో తరచు దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు చోరీలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాల కింద లబ్ధిపొందుతున్న లబ్ధిదారులందరికీ జూన్
english title: 
uid

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles