విశాఖపట్నం, మే 3: కాంట్రాక్ట్ మీటర్ రీడర్లకు చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) కాంట్రాక్ట్ మీటర్ రీడర్లు నిరవధిక సమ్మెకుదిగారు. గురుద్వారా జంక్షన్ సమీపానున్న సంస్థ కార్పొరేట్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో సంస్థ పరిదిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మీటర్ రీడర్లు పాల్గొని యాజమాన్య వైఖరిని నిరసించారు. అందరికీ పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, వేతనాలు నేరుగా బ్యాంకు అకౌంట్‌లో జమచేయాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు ప్రదానంగా ప్రభుత్వ సెలవులు, జీతంతో కూడిన సెలవుల సదుపాయాన్ని కల్పించాలన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎంప్లారుూస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జిఎస్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ మీటర్ రీడర్లకు చట్టపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. సంస్థ పరిధిలోకి వచ్చే అయిదు జిల్లాలకు సంబంధించి స్పాట్ బిల్లింగ్ పనిని సుమారు 15 ఏళ్ళుగా కాంట్రాక్ట్‌కు ఇచ్చి చేయించుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం సర్వీసు ఒక్కంటికీ రూ.2.75ల వంతున కాంట్రాక్టర్లకు యాజమాన్యం చెల్లిస్తోందన్నారు. సర్వీసుకు ఈ మొత్తాన్ని తీసుకుంటున్న కాంట్రాక్టర్లు, తమ వద్ద పనిచేస్తున్న మీటర్ రీడర్లకు మాత్రం కేవలం రూపాయిన్నర మాత్రమే అందజేస్తున్నారన్నామరు. అందువల్ల మీటర్ రీడర్లకు సదమీ స్కిల్డ్ వర్కర్ జీతం వచ్చేటట్టు పీన్‌రేటు నిర్ణయించాలని, జీతాలు నెల మొదటి వారంలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం పిఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్‌ల సౌకర్యం కల్పించాలన్నారు. జీతాలు నేరుగా మీటర్ రీడర్ బ్యాంకు అక్కౌంట్‌లో వేయాలనేవి ప్రధాన డిమాండ్లుగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మీటర్ రీడర్ల న్యాయమైన కోర్కేలను పరిష్కరించాలని కోరారు. రీడర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మెలో రీజియన్ అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్, ప్రతినిధులు మీటర్ రీడర్లు పాల్గొని సంస్థ యాజమాన్యం డౌన్ డౌన్, యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
* సంస్థ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె
english title:
meter readers
Date:
Saturday, May 4, 2013