విశాఖపట్నం, మే 3: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశమై అధినేత చంద్రబాబుపై చేసిన అనుచిత వాఖ్యలపై జిల్లాపార్టీ ముక్తకంఠంతో ఖండించింది. పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం సమన్వయ కమిటీ శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా పార్టీ యంత్రాంగం విలేఖరులతో మాట్లాడుతూ దాడి వైఖరిపై మండిపడ్డారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, ఆరేళ్లపాటు ఎమ్మెల్సీ, శాసనసభా పక్ష నేతగా పార్టీ పదవులు అనుభవించిన దాడి ఇప్పుడు తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ ఆరోపించడం దారుణమన్నారు. పార్టీ మానవవనరుల విభాగం అధ్యక్షునిగా కూడా పనిచేసిన దాడి జోడు పదవులను అనుభవించిన వ్యక్తని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలో లేనప్పుడు జిల్లా నుంచి ఎమ్మెల్సీ పదవిని మహిళకు కేటాయించాలనుకున్న తరుణంలో జిల్లా నాయకత్వం పట్టుపట్టి దాడిని పోటీకి దించామన్నారు. పార్టీ నుంచి ఇంతగా సేవలు పొందిన దాడి తనకు అన్యాయం జరిగిందంటూ పార్టీని వీడివెళ్లడం దారుణమన్నారు. అధినేత చంద్రబాబు జిల్లాలో పాదయాత్ర మొత్తం దాడి తనయుడు రత్నాకర్ నేతృత్వంలోనే జరిగిన మాట వాస్తవం కాదాని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయానికి పాదయాత్రను సైతం అడ్డుకుంటానని చెప్పడం నమ్మకద్రోహంగా పేర్కొన్నారు. దాడి రాజకీయ క్రీడకు కార్యకర్తలు అభ్యంతరం తెలిపారని అన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతోందన్న వాదనచేస్తున్న దాడి మండలిలో విపక్ష హోదా పోయిన రోజే గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనప్పుడు పార్టీపై దాడి విమర్శలు చేసినా స్పందించని తాము ఇప్పుడు ఆయన పార్టీని వీడివెళ్లినందునే స్పందించామని అన్నారు. వ్యక్తులు బయటకు వెళ్లిన అన్ని నియోజకవర్గాల్లోను తెలుగుదేశం పార్టీ గెలిచిందని గుర్తు చేశారు.
పార్లమెంట్ మాజీ సభ్యుడు పప్పల చలపతిరావుమాట్లాడుతూ మరో సీనియర్ నేత ఆడారి తులసీరావు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ వల్ల ఎక్కువగా లబ్దిపొందింది దాడి ఒక్కరేనని అన్నారు. మాజీ మంత్రి అప్పలనరసింహరాజు మాట్లాడుతూ సీనియర్ నేత దాడి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్‌లో ఆయన కనుమరుగుకావడం ఖాయమని అన్నారు. పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ పార్టీలో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవన్నదానికి దాడి ఉదంతమే నిదర్శనమని అన్నారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం ఎదుట తెలుగు యువత ప్రతినిధులు దాడి వీరభద్రరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి ఎం మణికుమారి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ ఇన్‌ఛార్జ్ పిజివిఆర్ నాయుడు, యలమంచిలి ఇన్‌ఛార్జ్ లాలం భాస్కరరావు, ఉత్తర ఇన్‌ఛార్జ్ భరణికాన రామారావు, గాజువాక ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
దాడిపై పార్టీశ్రేణుల ఆగ్రహం
కంగుతిన్న తండ్రీ తనయులు
అనకాపల్లి, మే 3: సుదీర్ఘకాలంపాటు రాజకీయాల్లో ఉంటూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, టిడిపి శాసనమండలి పక్షం నేతగా మెలిగి ఈ పదవులు కల్పించిన తెలుగుదేశం పార్టీకే రాజీనామా చేసి విద్రోహ చర్యలకు పాల్పడతారా? అని మాజీ మంత్రి దాడి వీరభద్రరావును టిడిపి నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో నిలదీశారు. దేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సిపిలో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు స్థానిక దేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి సమావేశంలో వీరభద్రరావు ప్రకటించగా నాయకులు, కార్యకర్తలు ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ అధినేత బాబుపై నిప్పులు చెరిగిన దాడి అనకాపల్లిలో జరిగిన పాదయాత్రలో పాల్గొనకుండా డుమ్మాకొట్టిన విషయం విదితమే. పార్టీకి వీరభద్రరావుతోపాటు ఆయన తనయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడం, రాజీనామాకు దారితీసే పరిస్థితులను వివరించి తాను చేరబోతున్న వైఎస్సార్ సిపిలోకి రావాలని పార్టీశ్రేణులను కోరే లక్ష్యంతో ఏర్పాటుచేసిన సమావేశానికి అనూహ్య సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. తమతో ముందుగా మాటమాత్రమైనా ప్రస్తావించకుండా పార్టీకి రాజీనామా చేసి వేరొక పార్టీలో చేరేందుకు ఒప్పందం కుదుర్చుకుని సమావేశం ఏర్పాటు పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవిని అనుభవించి పదవీకాలం పూర్తయ్యాక పార్టీ అధినేత చంద్రబాబుపై అభాంఢాలు వేసి రాజీనామా చేయడం ఎంతవరకు సమంజసమని దాడిని బాహాటంగానే నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. పాదయాత్ర దిగ్విజయం కోసం తాము అష్టకష్టాలు పడితే అప్పుడు ఏవిధంగా స్పందించకుండా వైఎస్సార్ సిపిలో తమకు అనుకూల పరిస్థితి వస్తే అర్ధాంతరంగా రాజీనామా చేసి మీరు ఎవరిని మోసం చేస్తారని కశింకోట మండలం నుండి పరవాడపాలేనికి చెందిన గొంతిన నూకరాజు, బెల్లం కార్మిక సంఘం కార్యదర్శి బొడ్డేడ వెంకటరమణ, అనకాపల్లి అంబేద్కర్ రిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడు మట్టా నూకరాజు నిలదీశారు. సుదీర్ఘకాలం పాటు పనిచేశానని, ఎన్టీఆర్ పట్ల అభిమానంతో పార్టీ అభివృద్ధికి కృషిచేశానని, ఆయన మరణానంతరం దేశం పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు తనను మోసగించారని, ఎమ్మెల్యేల కోటాలో తిరిగి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తానని మరోసారి మోసగించారని, తనను అడుగడుగునా దూరం చేస్తూ పార్టీనుండి నెట్టేప్రయత్నాలకు బాబు ఒడిగట్టారని వీరభద్రరావు వివరణ ఇచ్చారు. మీకు అటువంటి పరిస్థితి ఎదురైతే పార్టీ అధినేత బాబును కలసి తాము నిలదీస్తామని, మీరు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలోనే కొనసాగాలని, అలాకాకుండా వేరే పార్టీలోకి వెళ్తే తాము వచ్చేది లేదని, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని పలువురు నేతలు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తాను శనివారం వైఎస్సార్ సిపి అధినేత జగన్‌మోహనరెడ్డిని కలసి వైఎస్సార్ సిపిలో చేరే విషయమై చర్చిస్తానని, చర్చలు సానుకూలంగా జరిగితే ఆ పార్టీలో చేరతానని వీరభద్రరావు ప్రకటించడంతో మీరు ముందుగానే అన్ని ఒప్పందాలు కుదుర్చుకుని తమను మోసం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారని, మీ నిర్ణయం మీరు తీసుకున్నప్పుడు మా నిర్ణయంలో మార్పుండదని, టిడిపిలోనే కొనసాగుతామని పార్టీశ్రేణులంతా ఖరాఖండిగా దాడికి స్పష్టం చేసి సభనుండి వాకౌట్ చేశారు. దాడికి అత్యంత విధేయునిగా మెలిగే అతికొద్దిమంది మాత్రమే వీరభద్రరావు జిందాబాద్ అంటూ ఆయన దగ్గర నినాదాలు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మెజారిటీ నేతలు, కార్యకర్తలు సభనుండి బయటకు వచ్చి టిడిపిలోనే కొనసాగుతామని, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
ఇదిలాఉండగా దేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి తనయుడు రత్నాకర్ కూడా పార్టీని తాము వీడాల్సిన పరిస్థితిని సమర్థించుకుంటూ ఎంపిపి నిమ్మదల త్రినాథరావు, రొంగలి శ్రీరామ్మూర్తి నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన ఎంతోమంది నేతలతో చర్చలు జరిపారు. ఏనాడు పార్టీలో మనకు గుర్తింపులేదని, పార్టీ సీనియర్ నేత నాన్నగారికి అందరి కంటే ఆఖరి ఘడియల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పార్టీ అధినేత బాబు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని రత్నాకర్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్టవ్య్రాప్తంగానే మూడవ స్థానంలో ఉందని, అటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలో ఉండటం ఏ విధంగా శ్రేయస్కరం కాదని పార్టీశ్రేణులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
పర్యాటక కార్మికుల అరెస్టు: విడుదల
అరకులోయ, మే 3: పర్యాటక కార్యకలాపాలకు అడ్డుతగిలిన పర్యాటకశాఖ మెన్‌పవర్, దినసరి వేతన కార్మికులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశా రు. అదుపులోకి తీసుకున్న కార్మికులను పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం సాయంత్రం వారిని విడుదల చేశారు. సుధీర్ఘ చర్చల అనంతరం పూచీకత్తుపై ఎట్టకేలకు కార్మికులు బయటపడ్డారు. గ త సంవత్సరం కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చే స్తూ సమ్మెకు దిగిన కార్మికులు ఈ నెల 2 వతేదీన అఖిలపక్షం నాయకులతో కలి సి మహాధర్నా నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారుల తీరుపై నిరసన వ్యక్తంచేశారు. అంతటితో ఆగని ఆందోళనకారులు అరకులోయను సందర్శించిన పర్యాటకులను పలు ఇబ్బందులకు గురిచేశారు. పర్యాటక అతిథి గృహాల్లో బస చేసిన పర్యాకులను నిర్బంధించేందుకు ప్రయత్నించడం, ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి పర్యాటకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో మనస్థాపానికి గురైన పర్యాటకు లు కార్మికుల వ్యవహార శైలిపై మండిపడుతూ ఈ సంఘటపై పర్యాటక అభివృ ద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పర్యాటకుల నుండి ఫిర్యాదు అందుకున్న అధికారులు మెన్‌పవర్, దినసరి వేతన కార్మికులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి పున్నమి, మయూరి ప్రధాన గేట్లకు వేసిన తాళాల ను మేనేజర్లతో పగులగొట్టించి గేట్లను తెరిపించారు. యథావిధిగా పనులలో నిమగ్నమై అతిథి గృహాల్లో విడిది చేసే పర్యాటకులకు సేవలు అందించాలని మేనేజర్లు, సిబ్బందికి పోలీసులు సూచించారు.
అనంతరం పర్యాటకులను ఇ బ్బందులకు గురిచేసిన మెన్‌పవర్, దినసరి వేతన కార్మికుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కార్మికులపై కఠినమైన సెక్షన్‌లను విధించి కేసు న మోదుచేసి కోర్టుకు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మాజీ శా సనసభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుంభా రవిబాబు, సి.పి. ఎం. ప్రతినిధులు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్, వి.మహేశ్వరరావు పోలీసులతో జరిపిన చర్చలు ఫలించడంతో కార్మికులను విడుదల చేశారు. పోలీసుల అ దుపులోకి తీసుకున్న వారిలో జి.్ధర్మ, ఎం.సుందరరావు, పి.శంకరరావు, జి. లక్ష్మణ్, ఎస్.అర్జున్, ఎస్.కృష్ణ, కె.ప్రసా ద్, పి.ఎస్.నంద ఉన్నారు. కార్మికులు అరెస్టు, విడుదలతో అతిథిగృహాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుం డా ఉండేందుకు పోలీస్ పికెట్ ఏర్పా టు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్.ఐ. మురళీకృష్ణ పాల్గొన్నాయి.
'ఫ్యాక్టరీ మనుగడ, రైతుల భవిష్యత్‌కు ఎన్నికలే కీలకం’
చోడవరం, మే 3: గోవాడ సుగర్స్ ఎన్నికలతో ఫ్యా క్టరీ మనుగడ, రైతు భవిష్యత్ ఆధారపడి ఉన్నాయని, ఈ విషయంలో రైతులు విజ్ఞతతో మెలగాల్సిన అవసరం ఉందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు అన్నారు. శుక్రవారం స్థానిక సిఐటియు కా ర్యాలయంలో ఎపి రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ స మావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మా ట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతుచైతన్య సదస్సులు కేవలం కంటితుడుపు చర్యలుగానే భావించాల్సి వస్తుంద న్నారు. రైతుచైతన్య సదస్సులకు ఏ మండలంలో పట్టుమని పదిమంది రైతులు హాజరుకావడంలేదని, అటువం టి సమావేశాలు నిర్వహిస్తే ఫలితమేముంటుందని ఆయన విమర్శించారు. ఇప్పటికే రైతులకు వ్యవసాయం చేయడంలో కావాల్సినంత అనుభవం ఉందని, వారికి అందజేయాల్సిన రాయితీలు, పంటరుణాలు సకాలం లో ఇచ్చేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉం దన్నారు. గోవాడ సుగర్ ఫ్యా క్టరీ పాలకవర్గ ఎన్నికలు ఈనెల 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రకటించినందున రైతులు భవిష్యత్‌ను నిర్ణయించుకునేందుకు అవసరమైన పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. సుగర్ ఫ్యాక్టరీలు చెరకు టన్నుకు మూ డు వేల రూపాయలుగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశా రు. జిల్లా కలెక్టర్ టన్ను చెరకు ధరను 2500 రూపాయలుగా అందజేస్తామని చెప్పడం విచారకరమన్నా రు. ఆయా అంశాలన్నింటిపై చర్చించేందుకు శనివారం ఉదయం తొమ్మిది గం టలకు గోవాడ సుగర్స్‌లోగల వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిసా రు. ఈ కార్యక్రమానికి ఫ్యాక్టరీ పరిధిలోని సభ్యరైతులు, జిల్లాలోని చెరకు రైతులందరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో సంఘ ఉపాధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ, చెరకు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు యన్నంశెట్టి సీతారాం పాల్గొన్నారు.
నేటితో తాండవలో క్రషింగ్ పూర్తి
పాయకరావుపేట, మే 3: తాండవ చక్కెర కర్మాగారంలో 2012-13 ఏడాదికి శనివారంతో చెరకు క్రషింగ్ పూర్తి అవుతున్నట్లు కర్మాగారం మేనేజింగ్ డైరక్టర్ వి.సన్యాసినాయుడు తెలిపారు. శనివారం రాత్రి బి-షిప్టుతో క్రషింగ్ పూర్తవుతున్నట్లు తెలిపారు. గురువారం నాటికి ఈ సీజనులో మొత్తం 1,89,845 టన్నులు క్రషింగ్ జరిపామని తెలిపారు. దీని ద్వారా 1,74,895 క్వింటాళ్ల పంచదార ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రైతులకు సకాలంలో పేమెంట్లు చెల్లించామని తెలిపారు. ఈనెల 4వతేదీతో క్రషింగ్ పూర్తవుతుందనే విషయాన్ని తోటల్లో చెరకు ఉన్న రైతులకు ముందుగానే తెలియజేసినట్లు తెలిపారు.
పర్యాటక కార్మికుల అరెస్టు అన్యాయం
* మాజీ ఎమ్మెల్యే రవిబాబు
అరకులోయ, మే 3: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ శాంతియుతంగా సమ్మె చేస్తున్న పర్యాటక మెన్‌పవర్, దినసరి వేతన కార్మికులను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ శాసన సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నా యకుడు కుంభా రవిబాబు పేర్కొన్నా రు. గిరిజన కార్మికులను పోలీసులు అరె స్టు చేశారన్న సమాచారం తెలుసుకున్న ఆయన అరకులోయను శుక్రవారం సం దర్శించి పోలీసులతో చర్చలు జరిపారు. కార్మికులను అరెస్టు చేయడంతో వారిని విడుదల చేయాలని కోరుతూ పలువు రు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు.