పుణె, మే 3: భారత యువ మహిళా ఆర్చర్ ప్రతిమ బోరొ ఆర్మీ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకున్నట్టు శిక్షణ శిబిరం అధికాలు ప్రకటించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. 2009లో షాంఘైలో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్-4, అదే ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న భారత బృందంలో ప్రతిమ సభ్యురాలు. అంతకు ముందు ఆమె టాటా ఆర్చరీ అకాడమీలో కెడెట్‌గా శిక్షణ పొందింది. భారత ఆర్చరీ సమాఖ్య గుర్తింపును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడంతో, రికర్వ్ ఈవెంట్ శిక్షణ శిబిరాన్ని సాయ్ కేంద్రంలో కాకుండా, ఆర్మీ ఆర్చరీ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్‌కు ప్రతిమ హాజరుకాకపోవడంతో, ఇతర ఆర్చర్లు ఆమె గదికి వెళ్లడంతో ఈ విషయం తెలిసింది. ప్రతిమ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఆమె మానసికంగా కుంగిపోయినట్టు కనిపిస్తున్నదని, అయితే, వివరాలు మాత్రం తెలియవనీ తోటి ఆర్చర్లు అంటున్నారు.
భారత యువ మహిళా ఆర్చర్ ప్రతిమ బోరొ
english title:
m
Date:
Saturday, May 4, 2013