మేడ్చెల్, ఫిబ్రవరి 16: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం, శైవక్షేత్రం శ్రీరామ లింగేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. 400 సం.ల చరిత్ర గల ఈ ఆలయం మేడ్చెల్ పట్టణ శివారుల్లో అందమైన కొండలపైన వెలసి స్వయంభూ లింగం. మేడ్చెల్‌కుచెందిన పూర్వీకులైన ధాత్రిక రామలింగం అనే జమిందార్ కలలో సాక్షాత్తు పరమశివుడు కనిపించి గుట్టపై లింగ రూపంలో తాను ఉన్నానని, తనకు దేవాలయం నిర్మించాల్సిందిగా కోరినట్టు ప్రతీతి. ఈ క్షేత్రాన్ని దర్శించినవారి కోరికన కోర్కెలు తీరడమేకాక, సకల పాపాలుకూడా తొలిగిపోతాయని ఇక్కడి ప్రజల నమ్మకం.
ప్రజల కొంగుబంగారం రామలింగేశ్వరుడు
english title:
d
Date:
Friday, February 17, 2012