ఘట్‌కేసర్, ఫిబ్రవరి 16: ఢిల్లీలో జరిగే జాతీయ టెన్నిస్, వాలీబాల్ క్రీడోత్సవాలలో అత్యున్నత ప్రతిభను చాటి రాష్ట్ర క్రీడాకీర్తిని ఇనుమడింపచేయాలని రాష్ట్ర టెన్నిస్, వాలీబాల్ సంఘం అధ్యక్షుడు నల్ల మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండల పరిధి నారపల్లిలోని నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన టెన్నిస్, వాలీబాల్ క్రీడాకారులు ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే 13వ జాతీయ టెన్నిస్, వాలీబాల్ క్రీడోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంగా జాతీయస్థాయికి రాష్ట్రం నుంచి ఎంపికైన జట్టుకు గురువారం క్రీడాదుస్తులు, కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తి కలిగిన ప్రతి ఒక్కరూ సమాజంలో రాణిస్తారన్నారు. అదే స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ నల్ల దివ్య, సంఘం ఉపాధ్యక్షుడు పి.సంపత్‌రెడ్డి, కార్యదర్శి టి.నర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జట్టుకు ఎంపికైన బి.యుగంధర్, కె.రాజేష్, పి.సంతోష్, వి.దినేష్, బి.కార్తీక్‌లను ఆయన అభినందించారు.
రాష్ట్ర క్రీడాకీర్తిని మరింత ఇనుమడింప చేయాలి
english title:
s
Date:
Friday, February 17, 2012