హైదరాబాద్, మే 3: బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం శిఖర్ ధావన్ రాకతో బలాన్ని పుంజుకుంది. చేతి గాయం కారణంగా ఆరో ఐపిఎల్ తొలి మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన ధావన్ పూర్తిగా కోలుకోని మైదానంలోకి దిగడం సన్‌రైజర్స్‌కు ఊరటనిస్తోంది. తనపై అభిమానులు ఉంచిన ఆశలకు తగ్గట్టు అతను అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మరోసారి అతని ఆట కీలకంగా మారనుంది. ధావన్ ఎంత సేపు క్రీజ్‌లో నిలబడతాడన్న అంశంపైనే సన్‌రైజర్స్ విజయావకాశాలు ఆధాపడి ఉంటాయి. పటిష్టమైన బౌలింగ్ విభాగం పలు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపించింది. ఇప్పుడు బ్యాటింగ్ విభాగం కూడా మెరుగుపడడంతో, ఢిల్లీకి గట్టిపోటీనివ్వడం ఖాయం. సన్‌రైజర్స్ పది మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సంపాదించుకోగా, ఢిల్లీ అనే్నమ్యాచ్‌లు ఆడి, ఆరు పాయింట్లు సాధించింది. ఈసారి ఐపిఎల్‌లో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడిన అన్ని మ్యాచ్‌లను గెల్చుకున్న సన్‌రైజర్స్ మరోసారి హోం గ్రౌండ్‌లో చెలరేగేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ నంబర్‌వన్ బౌలర్ డేల్ స్టెయిన్ ఈ జట్టు ప్రధాన అస్త్రం. మీడియం పేసర్ ఇశాంత్ శర్మ, లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలక సమయాల్లో రాణిస్తున్నారు. బ్యాట్స్‌మెన్ విఫలమై, తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ, ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో వీరు సఫలమవుతున్నారు. ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించడంలో తిసర పెరెరా, కరన్ శర్మ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో ధావన్‌కు డారెన్ సమీ మద్దతు లభించనుంది. కెప్టెన్ కుమార సంగక్కర తన స్థాయికి తగినట్టు రాణించలేకపోతున్నా, ముంబయి ఇండియన్స్‌పై అత్యంత కీలక సమయంలో 21 పరుగులు చేసి ఫరవాలేదనిపించుకున్నాడు. హనుమ విహారీ, అక్షత్ రెడ్డి వంటి యువ ఆటగాళ్ల అండ కూడా జట్టుకు ఉంది. సొంత గడ్డపై, రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్‌కి సిద్ధమైన సన్‌రైజర్స్‌ను ఏ విధంగా అడ్డుకోవాలన్నది మహేల జయవర్ధనే నాయకత్వంలోని ఢిల్లీ జట్టును తీవ్రంగా వేధిస్తున్న సమస్య. స్టార్ బ్యాట్స్‌మన్ వీరేందర్ సెవాగ్ బ్యాటింగ్ ఇంకా గాడిలో పడలేదు. ఉన్ముక్త్ చాంద్ ఇంకా బ్యాట్‌ను ఝళిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ బాధ్యత మొత్తం డేవిడ్ వార్నర్ ఒక్కడే తన భుజాలపై ఎత్తుకోవాల్సి వస్తోంది. బ్యాటింగ్‌తో పోలిస్తే ఈ జట్టు బౌలింగ్ విభాగం కొంత మెరుగ్గా ఉంది. ఇర్ఫాన్ పఠాన్, ఆశిష్ నెహ్రా, ఉమేష్ యాదవ్ వంటి సమర్థులు ఈ జట్టులో ఉన్నారు. వీరంతా నిలకడగా రాణిస్తేనే శనివారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఢిల్లీ గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది.
నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో సన్‌రైజర్స్ పోరు
english title:
d
Date:
Saturday, May 4, 2013