Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పిడిఎఫ్‌ల సంగతేంటి? - కంప్యూటర్ కాలమ్

$
0
0

చాలామందికి ఈ పీడీఎఫ్ అంటే ఏమిటా అని అనిపిస్తూంటుంది. పీడీఎఫ్ అంటే పోర్టబుల్ డేటా ఫార్మాట్. ఎలాటి సిస్టంలోనైనా దాన్ని చదవగలగాలి. అదే దాని ఉద్దేశం. ఈ ఫార్మాట్ ఎంత పాపులర్ అయ్యిందంటే, మనకు ఇ-మెయిల్స్ ద్వారా వచ్చే బ్యాంక్ స్టేట్‌మెంట్లూ, ఇతర రసీదులూ ఈ పీడీఎఫ్ ఫైల్స్ రూపంలోనే వస్తున్నాయి. మన బ్రౌజర్లూ వాటిని అర్థం చేసుకుని ఓపెన్ అయ్యేలా ప్లగిన్స్ కూడా ఉన్నాయి. ఇంత పాపులరైన పీడీఎఫ్ రీడర్ అనే దాన్ని అడోబ్ సంస్థ తొలిసారిగా ప్రవేశపెట్టింది. దానే్న అక్రోబాట్ రీడర్ అంటారు. ఈ రీడర్ ఉచితంగానే లభిస్తుంది. ఎటొచ్చీ, ఒక డాక్యుమెంట్‌ను కానీండి, డిటిపి ఫైలునో లేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ని కానీండి మనం వాడిన ఫాంట్లతో చక్కగా పీడీఎఫ్ ఫైలు చేయాలంటే మాత్రం క్రియేటివ్ సూట్స్‌లో డిస్టిలర్, రైటర్ వంటి తోక ఉపకరణాలు లభిస్తున్నాయి.
ఎంఎస్ వర్డ్ వంటి వాటిల్లో ఇటీవల వచ్చిన వర్షన్లలో సేవ్ యాస్ పీడీఎఫ్ అనే ఆప్షన్ ఇచ్చారు కానీ దీని ద్వారా ఫైలు సేవ్ చేసేటపుడు ఫార్మాటింగ్ కొంత చెదురుమదురు అవుతోంది. అలాటి వాటిని కచ్చితంగా మార్చడానికే అడోబ్ డిస్టిలర్, రైటర్ వంటివి అవసరం. ఐతే ఇంటర్నెట్‌లో మనకు పిడిఎఫ్ రైటర్, క్యూట్ పీడీఎఫ్ వంటి పలు ఉచిత ఉపకరణాలు మన ఫైల్స్‌ను ఏ మాత్రం ఫార్మాటింగ్ చెడకుండా పిడిఎఫ్‌లుగా మార్చుకోడానికి వీలు నిస్తున్నాయి. ఇవి ప్రింటర్ డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌లలా ఉంటాయి. మనం ఏ ఫైలునైతే పీడీఎఫ్ చేయాలనుకుంటామో, ఆ ఫైలును సదరు వర్డ్ వంటి సాఫ్ట్‌వేర్‌లలో ఓపెన్ చేసి ప్రింట్ ఆప్షన్ ద్వారా మనం ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకుని పిడిఎఫ్‌ను రూపొందించుకోవచ్చు.
సంగతేంటంటే, ఈ పీడీఎఫ్ ఫైల్స్‌ను అడోబ్ పీడీఎఫ్ రీడర్ ద్వారా చదువుకోవచ్చు. ఐతే పీడీఎఫ్ రీడర్ అంటే అడోబ్ పీడీఎఫ్ రీడర్ మాత్రమే కాదని తెలుసుకోవాలి. ఎందుకంటే, ఇంటర్నెట్‌లో నేడు ఈ పీడీఎఫ్‌లను చదవడానికి ఎన్నో ఉచిత రీడర్ సాఫ్ట్‌వేర్‌లు లభిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా సాఫ్ట్‌వేర్‌లను రూపొందించిన సంస్థల వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసేసి వాడుకోవచ్చు. అలాటి వాటిల్లో కూల్ పీడీఎఫ్ అనేది నిజంగానే చాలా కూల్. దీన్లో మరో వెసులుబాటూ ఉంది. అదేంటంటే, మనం ఓపెన్ చేసిన పీడీఎఫ్ ఫైల్‌ను టెక్స్ట్ ఫైలుగా, ఇమేజి ఫైలుగా (బిఎంఎఫ్, జిఫ్, పిఎన్‌జి వగైరా) కూడా మార్చుకుని సేవ్ చేసుకుని వాడుకోవచ్చు. దీని వెబ్ చిరునామా http:/www.coolpdf.com/ఇదే రకంగా ఇంటర్నెట్‌లో స్కిమ్ అనే రీడర్ ఒకటుంది. దీని వెబ్ చిరునామా http:/www.skimapp.sourceforge.net/మన ఫీడీఎఫ్ ఫైల్స్‌లోని పేజీలను హైలైట్ చేయడం, క్రాపింగ్, బుక్ మార్కింగ్ వగైరాలను చేయడం చాలా ఈజీ. పీడీఎఫ్ ఫైల్స్‌లో ఏవన్నా మార్పులు చేయాలంటే ఈ స్కిమ్ చాలా బాగా వినియోగిస్తుంది. ఇది ఎక్కువగా మాక్ ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేసే సాఫ్ట్‌వేర్. అన్నట్టు, ఎస్టీడియూ అని మరో రీడర్ ఉంది. ఇదీ ఫ్రీయే. దీని వెబ్ చిరునామా http:/www.stdutility.com/ stu viewer.html. ఇది కేవలం పీడీఎఫ్ ఫైల్స్‌నే కాదు, టెక్స్ట్ ఫైల్స్‌నూ, టిఫ్ వగైరా ఫార్మాట్‌లలో ఉండే ఫైల్స్‌నూ కూడా చదవగలదు. పైగా అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలలోనూ పనిచేసేలాగా వివిధ వర్షన్లు లభిస్తున్నాయి. ఇది ముఖ్యంగా సాంకేతిక, వైజ్ఞానికపరమైన డాక్యుమెంటేషన్స్ చేసేవారికి ఎంతో వినియోగిస్తుంది.
అక్రోబాట్ రీడర్ ఎందుకొద్దూ అని మీరడగవచ్చు. ముందే చెప్పినట్టు మెజారిటీ నెటిజనులు దానే్న వాడటంవల్లా, ఇ-మెయిల్ అటాచ్‌మెంట్‌లూ రావడంవల్లా అక్రోబాట్ రీడర్ ద్వారా మీ పీసీలోకి వైరస్‌లను వ్యాపింపజేసేలా మనకు ఇ-మెయిల్ అటాచ్‌మెంట్‌లు వస్తున్నాయి. అందువల్ల వేరే పీడీఎఫ్ రీడరైతేనే రైటు. ఏమంటారు?
అన్నట్టు, పీడీఎఫ్ ఫైలును చదవడానికి ఎలాటి రీడరూ లేకుండా ఎవరూ ఉండరు గానీ, నిజంగా మీ పీసీలో అలాంటి రీడర్ లేకపోతే, ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్ డే కూడా చాలు. దాంతో ఓపెన్ చేసి చదివేసుకోవచ్చు. ఎటొచ్చీ ఆ ఫైల్‌లో ఎక్కువ పేజీలు వుంటే మళ్లీ ఇంపోర్టు చేసుకోవడం - ఇదంతా తలనొప్పి. అందువల్ల ఏదో ఓ పీడీఎఫ్ రీడర్ మాత్రం మీ సిస్టంలో ఉండాల్సిందే. తప్పదు. మరో సంగతేంటంటే, ఇక్కడ ఒకట్రెండు పీడీఎఫ్ రీడర్ల గురించే చెప్పుకున్నాం. ఇంటర్నెట్‌లో వెదికితే బోలెడు ఉచిత రీడర్లు దొరుకుతాయి. ట్రై చేయండి.

తెలుసుకోవాల్సిన సంగతి..

విండోస్ లక్షణాలు
విండోస్‌ని ఆపరేట్ చేయడం చాలా తేలికైన పద్ధతి. విండోస్ లక్షణాలు ఇవీ:
1.విండోస్‌లో ఆదేశాలు (commands) గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
2.బొమ్మలు (icons), మెనూ (menu) ల ఆధారంగా ఆదేశాలను ఉపయోగించుకోవచ్చు.
3.విండోస్‌లో తెర మీద డాక్యుమెంట్ సైజ్‌ని పెంచుకోవచ్చు లేక తగ్గించుకోవచ్చు.
4.ఒకేసారి రెండు మూడు అప్లికేషన్స్‌లో తేలికగా పని చేసుకోవచ్చు. దీనినే Multi Tasking facility అంటారు.
5.విండోస్‌లో ఫైళ్లని తెరవాలంటే ఒక మెనూ నుండి మరొక సబ్ మెనూలోకి వెళ్లాలి. విండోస్‌లో మీకు కావల్సిన ప్రధాన విభాగం మీద క్లిక్ చేస్తే మరో విభాగం కనిపిస్తుంది. అక్కడ నుండి మరో ఉప విభాగానికి వెళ్లి మీకు కావల్సిన ఫైలు లేదా ఫోల్డర్ (డైరెక్టరీ)ని ఎన్నుకోవచ్చు.
6.విండోస్‌ని మూసేయాలంటే shut down computer మీద క్లిక్ చేయాలి.
7.ఒక్కోసారి విండోస్‌లో మీరు ఏదైనా ఫైలును గాని, డైరెక్టరీనిగాని, ఎక్కడుందో మర్చిపోయారనుకోండి. అప్పుడు విండోస్‌లో మీకు ఆ ఫైలుగాని, డైరెక్టరీ గాని ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఫైండ్ (find) కమాండ్ ద్వారా తెలుసుకోవచ్చు.
8.ఏదన్నా ఒక విషయం గురించి తెలియజేయడానికి, విండోస్‌లో హెల్ప్ (help) మెనూ ఉంది.

సామెత: డేటాకు తిమ్మరాజు (టీం లీడరు) ప్రోగ్రాముకు పోతరాజు (ప్రోగ్రామర్) అన్నట్టు...

నెట్ న్యూస్
మైక్రో ‘సాఫ్ట్’ కంపెనీ
మన దేశంలో నైపుణ్యంగల ఉద్యోగులు మిగతా కంపెనీలతో పోటీగా జీతాల చెల్లింపూ, ఉద్యోగ రక్షణా కోరుకుంటారు. అందుకే, మన దేశంలో మంచి కంపెనీగా గుర్తింపు పొందితే చాలు. మంచి నిపుణులైన సిబ్బందిని నిలుపుకోవడం, ఆకర్షించుకోవడం చాలా సులువు అంటారు విషయం తెలిసిన వ్యాపారవేత్తలు. ఇటీవల దేశవ్యాప్తంగా సుమారు 7వేల మందిని కలిసి నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మన దేశంలోని వివిధ కంపెనీల జీతాల చెల్లింపు, ఉద్యోగులకు ఇతర సదుపాయాలు, ఉద్యోగ రక్షణ పట్ల అత్యంత శ్రద్ధ చూపుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగులు ‘చక్కటి పని వాతావరణం’ కోరుకుంటున్నారని ఆ సర్వేలో తేలింది. అంతేకాదు. మన దేశంలో ఉద్యోగులు పని చేయాలంటే చక్కటి సంస్థ ‘మైక్రోసాఫ్ట్’ కంపెనీయే అని పేరు పొందింది. హెచ్‌ఆర్ సర్వీస్ సంస్థ ‘రాండ్‌స్టడ్’ నిర్వహించిన సర్వే ప్రకారం వరుసగా 3వ సంవత్సరమైన 2013లో కూడా నిరుద్యోగులు ఆ సంస్థకు తొలి మార్కు వేశారు. హెల్ట్ పాకర్డ్, గూగుల్ ఇండియా తర్వాత మైక్రోసాఫ్ట్ ఆకర్షణీయ కంపెనీగా మూడవ స్థానంలో నిలిచింది. అమెరికా వీసాలకు మీసాలొస్తే మరంతేగా జరిగేదీ...

పద పారిజాతం

Warm boot - వార్మ్ బూట్ అనేది కంప్యూటర్ పనిచేసేపుడు గనక ఏదైనా కారణాల వల్ల సిస్టం పనిచేయడం మానేస్తే (system hanging) మన ఫ్రోగ్రాంలు పనిచేయవు. అపుడు సిస్టంని ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయాల్సి ఉంటుంది. దానే్న రీబూటింగ్ అంటారు.
WAN - వాన్ అంటే వైడ్ ఏరియా నెట్‌వర్క్ అని అర్థం. భౌగోళికంగా వేర్వేరు ప్రదేశాలలో ఉన్న కంప్యూటర్లని ఒక నెట్‌వర్క్‌లో కలిపితే ఆ నెట్‌వర్క్‌ని వాన్ అంటారు. ఉదాహరణకు నిక్‌నెట్.

కంప్యూటర్ కాలమ్
english title: 
computer column
author: 
- వి.వి.వి. రమణ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>