తిరుపతి, మే 6: టిటిడి ఆధ్వర్యంలో ఎస్వీ భక్త్ఛినల్ -2ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ, ధర్మాదాయశాఖా మంత్రి సి రామచంద్రయ్య చెప్పారు. సోమవారం టిటిడి అధికారులఔ సమీక్షా సమావేశం నిర్వహింఛారు. సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎస్వీభక్త్ఛినల్ ప్రసారాలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎస్వీబీసి -2ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళం, కన్నడం, మళయాళంలో వస్తున్న ప్రసారాలను మరింతగా పెంచనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రధాన ఆలయాలన్నింటిని ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా అనుసంధానం చేసి హైదరాబాద్‌లోని స్టూడియోను అభివృద్ధి చెయ్యాలని సూచించినట్లు తెలిపారు. కాగా టిటిడి ఏర్పాటు చేసిన కేంద్ర ధార్మిక మండలిని రద్దు చేయనున్నట్లు తెలిపారు. చట్టప్రకారం దీన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదన్నారు. దాని స్థానంలో ధర్మప్రచార సదస్సును ఏర్పాటు చెయ్యాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మఠాధిపతులు, పీఠాధిపతులతో కలిసి సదస్సుపై అభిప్రాయాలను కూడా సేకరిస్తామన్నారు. ప్రధానంగా టిటిడిలో ఏళ్ల తరబడి పనిచేసిన టిటిడి అటవీ కార్మికుల సర్వీసు రెగ్యులేజేషన్ చెయ్యాలని టిటిడికి ఆదేశించినట్లు తెలిపారు. టిటిడి అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయ్యాల్సి వుండగా ఇష్టానుసారం ఖర్చులు చేస్తున్నారన్నారు. టిటిడిలో అధికారులు ఖర్చులను బాగా తగ్గించుకోవాలని సూచించామన్నారు. వకుళామాత ఆలయాన్ని నిర్మించేందుకు పేరూరు బండకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న నేపధ్యంలో ఆలయ నిర్మాణం పెండింగ్‌లో ఉందన్నారు. పవిత్ర స్థలాల్లో జరిగే చిన్నచిన్న తప్పులను మీడియాలో పెద్దవిగా చూపడం వలన భక్తుల మనోభావాలను దెబ్బతినే అవకాశం ఉందని మీడియాతో అన్నారు. ఇటీవల తిరుమల అన్నప్రసాద భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో కొన్ని గోనె సంచులు మాత్రమే కాలాయన్నారు. ఇలాంటి ప్రచారాలు భక్తుల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళతాయన్నారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్, కమిషనర్ బలరామయ్య, జేఇఓ శ్రీనివాసరాజు, సివిఎస్‌ఓ అశోక్‌కుమార్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
* మంత్రి సి రామచంద్రయ్య
english title:
bhakti channel
Date:
Tuesday, May 7, 2013