Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమస్యలు లేని రాష్రం మనదే

$
0
0

కర్నూలు, మే 8: దక్షిణాది రాష్ట్రాల్లో సమస్యలు లేని రాష్ట్రం మనదొక్కటేనని, ఇందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలేనని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఒకే ఒక లోపం చేసింది చెప్పుకోలేకపోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమవుతుందని పార్టీ అధిష్టానం గ్రహించిందని మంత్రి టీజీ అన్నారు. ఈ కారణంగా ముఖ్యమంత్రి మార్పు ఆలోచన ఏదీ కాంగ్రెస్ పెద్దల వద్ద లేదన్నారు. సీఎం తీరుపై మంత్రివర్గంలో అసమ్మతి చెలరేగిందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కొత్త పథకాలు ప్రవేశపెడుతున్న ప్రతి సందర్భంలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన చర్చిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో పేరు సూచించమని కోరుతున్నారని తెలిపారు. అయితే కొత్తపథకాలు ప్రవేశపెట్టేటప్పుడు మంత్రివర్గంతో చర్చించాలని కొంత మంది మంత్రులు సూచిస్తున్నారే తప్ప మరో అభిప్రాయం వారిలో లేదన్నారు. దీన్ని అసమ్మతిగా భావించవద్దన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులెవరూ తప్పులు చేయలేదన్నారు. తాజాగా మంత్రి శైలజానాథ్‌పై వచ్చిన ఆరోపణల్లో కూడా నిజం లేదన్నారు. ఆయన స్నేహితుడికి సాయం చేసేందుకే మాట్లాడి ఉంటారని, ఆయనలో వ్యాపార ధోరణి లేదని వివరించారు. కిరణ్ పాలన కారణంగా రానున్న ఎన్నికల్లో కర్నాటకలో మాదిరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని మంత్రి టిజి వెంకటేష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో
జూపాడుబంగ్లా తహసీల్దారు

కర్నూలు, మే 8: రైతుకు పట్టాదారు పాస్ పుస్తాకాలు ఇచ్చేందుకు జూపాడుబంగ్లా తహాసీల్దారు వెంకటేష్ నాయక్ రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఎసిబి డిఎస్పీ విజయపాల్, సిఐ నాగరాజు యాదవ్, తహాసీల్దారు కర్నూలు నగరంలోని ఎసిబి కార్యాలయం వెనుకవున్న బి క్యాంపు ప్రభుత్వ క్వాటర్స్‌లోని ఆయన ఇంట్లో వెంకటేష్ నాయక్‌ను బుధవారం సాయంత్రం అరెస్టుచేశారు. జూపాడుబంగ్లాకు చెందిన రైతు దాసరి నారాయణకు 26.6 ఎకరాల పొలం వుంది. పొలానికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసేందుకు తహాసీల్దారు వెంటకటేష్ నాయక్ రైతు ఆదినారాయణను రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తం ఇవ్వలేనని ప్రాధేయపడగా రూ.8 లక్షలు ఇవ్వాలని తహాసీల్దారు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రైతుచెప్పగా చివరకు రూ. 5 లక్షలు ఇచ్చేందుకు బేరం కుదిరింది. ఇందులో రూ. 2లక్షలు మొదటి విడతగా ఇచ్చి పాస్‌పుస్తకాలు పూర్తి అయిన తర్వాత మిగతా మొత్తం ఇవ్వాలని ఖరారు చేసుకున్నారు. ముందుగానే ఎసిబి అధికారులను ఆశ్రయించిన బాధిత రైతు నారాయణ పకడ్బందీగా వెంకటేష్ నాయక్‌ను ఇరికించివేశారు. తహాసీల్దారును అరెస్టుచేసి కర్నూలు ఎసిబి కోర్టుకు తరలించారు.

చల్లబడ్డ వాతావరణం
కర్నూలు, మే 8: ఎండ వేడిమితో తట్టుకోలేక జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడుగా ఏడాపెడా విద్యుత్ కోతల వల్ల ఉక్కపోతలో ముగ్గిపోతున్నారు. జిల్లాలో వారం రోజు నుండి 43 డిగ్రీలకు తగ్గకుండ ఎండవేడిమి పీల్చిపిప్పి చేస్తోంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు రోడ్డుపైకి ప్రజలు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. సాయంత్రం కర్నూలు నగరంలో గాలితోకూడిన వర్షపు జల్లులు రావడంతో వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతోవేడి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గాలి బీభత్సంతో జిల్లాలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, పూరి గుడిసెలు నేలకొరిగాయి. ఎండవేడిమి తట్టుకోలేక జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో ఇద్దరు చొప్పున మృతి చెందుతున్నారు. ఎండి వేడిమి నుంచి ప్రజలు బయటకి రావడానికి జంకుతున్నారు. ఎండివేడి వల్ల చల్లని పానీయాలతో సేద తీర్చుకుందామని వెళ్తే చల్లని పానియాల ధరలు ఆకాశాన్నింటుతున్నాయి. రోజు రోజుకు ఎండివేడిమి ఎక్కువ కావడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే బయపడుతున్నారు.
నంద్యాలలో
నంద్యాలటౌన్:గత వారం రోజుల నుంచి వేసవి తాపంతో తల్లడిల్లుతున్న ప్రజలకు బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో వీచిన పెనుగాలులకు గుడిసెల పైకప్పులు ఎగిరిపోయి నష్టం వాటిల్లింది. అలాగే గడ్డివాములు గాలికి చెల్లాచెదురుగా ఎగిరిపోవడంతో రైతులకు కొంత నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా అంతరాయ ఏర్పడడంతో పట్టణంలో గంటపాటు అంధకారం అలుముకుంది. అలాగే వివిధ చోట్ల చెట్లు నేలకూలాయి. ఇకనైనా వర్షాలు సమృద్ధిగా కురిస్తే విద్యుత్ కోతలు తక్కువగా ఉంటాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుపై సంబరాలు
కల్లూరు, మే 8: కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో కర్నూలులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం స్థానిక డిసిసి కార్యాలయం ముందు భారీఎత్తున్న బాణ సంచాకాల్చి మిఠాయిల పంచారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకలలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీపై దేశవ్యాప్తంగా ప్రజలకు విశ్వాసం ఉండబట్టే కర్నాటకలో కాంగ్రెస్‌కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేంద్రమంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు సుధాకర్, షాకీర్, విష్ణు, ఇబ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాగునీటి సమస్యపై
ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు
కౌతాళం, మే 8: మండల కేంద్రమైన కౌతాళంలో తాగునీటి సమస్యపై బుధవారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ప్రజలు నిలదీశారు. అత్తర్‌వీధి, వైఎస్సార్ కాలనీ మహిళలు తాగునీటి సమస్యపై గత 20రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. వేసవిలో తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు తాగునీటి సరఫరాలో సక్రమంగా పనిచేయడం లేదని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటి సమస్యపై పంచాయతీ అధికారులతో మాట్లాడి సక్రమంగా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నదిచాగి, బాపురం రోడ్డు మరమ్మతులకుగాను రూ. 7.47కోట్లు మంజూరైయ్యాయని, కుప్పగల్, హాల్వి రోడ్డుకు రూ. 1.48కోట్లు మంజూరైయ్యాయని, గుడికంబాలి గ్రామానికి తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 35లక్షలు మంజూరైయ్యాయని, హాల్వి, మరళి గ్రామాలకు రూ. 30లక్షలు మంజూరైయ్యాయని, అదేవిధంగా కౌతాళం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ. 38లక్షలు మంజూరైయ్యాయని ఎమ్మె ల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. త్వరలో పనులను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైకాపా దేశాయికృష్ణ, నాగరాజుగౌడు, రామన్నగౌడు, శేషరావు, నాగభూషణం, వడ్డేరాము, అవతారం, కామవరం దేవదాసు, అధికారులు పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్ సేవా
కార్యక్రమాలు విస్తరించాలి
నంద్యాల, మే 8: రెడ్ క్రాస్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని, ప్రపంచ వ్యాప్తంగా రెడ్‌క్రాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు గొప్పవని నంద్యాల ఆర్డీఓ శంకర్, మున్సిపల్ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, తహశీల్దార్ మాలకొండయ్యలు తెలిపారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ వ

దక్షిణాది రాష్ట్రాల్లో సమస్యలు లేని రాష్ట్రం మనదొక్కటేనని,
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>