నిజామాబాద్, మే 11: వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మరింత లోతుగా చర్చించేందుకు వీలుగా ఈ నెల 16వ తేదీన సచివాలయంలో అఖిలపక్షం మలివిడత సమావేశాన్ని నిర్వహించనున్నామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఇదివరకే ఒక దఫా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బాబ్లీపై చర్చించామని, మరింత లోతైన చర్చ జరపాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 16వ తేదీన మలివిడత సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొనే ఈ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులతో చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.
వివాదాస్పదమైన బాబ్లీ ప్రాజెక్టు విషయమై
english title:
babli
Date:
Sunday, May 12, 2013