హైదరాబాద్, మే 11: వచ్చే నెల 10వ తేదీలోగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి పాఠ్య పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్రావు కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విద్యా రంగ సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలన్నారు. వేసవి సెలవులు పూర్తయ్యేలోగా అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను ప్రచురించి సంబంధిత పాఠశాలలకు పంపాలన్నారు. అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగు నీటి సదుపాయాన్ని కల్పించాలన్నారు. బాలికల పాఠశాలల్లో అధ్వాన్నమైన పరిస్ధితులు ఉన్నాయని పేర్కొన్నారు. సరైన మరుగుదొడ్లు లేనందు వల్ల విద్యార్ధినులు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారన్నారు.
సిఎంకు హరీష్రావు లేఖ
english title:
harish rao
Date:
Sunday, May 12, 2013