విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 18: పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి కోరారు. శనివారం ఇక్కడ రాజీవ్ ఇండోర్‌స్టేడియంలో పల్స్‌పోలియో కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందస్వామి మాట్లాడుతూ పట్టణంలో 32,600 మంది పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకు 87 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సమారు 12,600 పోలియో డోసులను సిద్ధం చేశామన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ తదితర చోట్ల పోలియో చుక్కల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలియో నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అందువల్ల అయిదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలందరికీ పోలియోచుక్కలు వేయాలని ఆయన కోరారు. ఈనెల 20, 21 తేదీల్లో కూడా ఇంటింటికి వెళ్లి పోలియోచుక్కలు వేయాలన్నారు. పట్టణాన్ని పోలియోరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ యు.ఎ.రాజు, డాక్టర్ పతివాడ రామునాయుడు, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు హెచ్.శంకరరావు, కె.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఐకెపి ఉద్యోగుల నిరసన, రాస్తారోకో
విజయనగరం (కలెక్టరేట్), ఫిబ్రవరి 18: సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టిన ఐకెపి ఉద్యోగులను ప్రభుత్వం పలు విధాలుగా బెదిరింపులకు యత్నిస్తుందని ఇందుకు భయపడేదిలేదని, సమస్య పరిష్కారమయ్యేంత వరకు వెనకడుగు వేసేది లేదని ఐకెపి ఉద్యోగులు స్పష్టం చేశారు. సుమారు 12 ఏళ్లుగా కాంట్రాక్టు పద్దతిపై పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కొరుతూ సమ్మె చేస్తున్న వారికి చార్జిమెమోలు ఇవ్వడం సరికాదంటు ఐకెపి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ అన్నారు. ఇందుకు నిరసనగా శనివారం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. అనంతరం అక్కడే ఉన్నఅంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేస్తున తమ డిమాండ్‌లైన ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఇస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలంటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే ఈ సందర్భంగా కలెక్టరేట్ జంక్షన్ వద్ద సుమారు 20 నిమషాలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనితో పట్టణ పోలీసులు కలుగజేసుకుని ఆందోళన చేస్తున్న ఐకెపి ఉద్యోగులను వారించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కార్యక్రమంలో ఐకెపి ఉద్యోగుల సంఘం నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
24న జిసిసి కార్యాలయాల ముట్టడి
* మాజీ ఎమ్మెల్యే కోలక
కురుపాం, ఫిబ్రవరి 18:గిరిజనులు సేకరించే చింతపండుకు గిట్టుబాటు ధర ఇవ్వనందుకు నిరసనగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న కార్యాలయాలను ముట్టడించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే లక్ష్మణమూర్తి తెలిపారు. గత ఏడాది కిలో 22 రూపాయలకు కొనుగోలు చేసిన జిసిసి ఈ ఏడాది 15 రూపాయలకు తగ్గించిందన్నారు. ఎప్పుడైనా గతంలో ఉండే ధర కంటే పెంచాలి లేకుంటే అదే ధర ఉంచాలి గాని దానికి విరుద్ధంగా జిసిసి చేస్తోందన్నారు. బయట మార్కెట్‌లో 20 రూపాయలకు పైగా కొంటుండగా 15 రూపాయలకు ప్రకటిస్తే జిసిసి ఉంటుందా? అని ప్రశ్నించారు. జిసిసి ఎత్తివేత లక్ష్యంగా ప్రణాళికలు ప్రతిపాదిస్తున్నారన్నారు. ప్రతి వస్తువు ధర పెంచిన ప్రభుత్వం గిరిజనుల అటవీ ఉత్పత్తుల ధరపై శీతకన్ను వేస్తోందన్నారు. దీన్ని నిరసిస్తూ 24న గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు జిసిసి కార్యాలయాలతోపాటు కురుపాం ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అప్పటికీ దిగి రాకుంటే విశాఖలోని ఎండి కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. కిలో 40 రూపాయలకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో గిరిజనాభివృద్ధికి కేటాయించిన నిధులు తక్కువేనని నాగూరు మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి అన్నారు. బడ్జెట్‌లో గిరిజనులకు ఎంతగానో నిధులు కేటాయిస్తున్నామని అంకెల గారడీ చేస్తోందని విమర్శించారు.
పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని
english title:
p
Date:
Sunday, February 19, 2012