నెల్లిమర్ల, ఫిబ్రవరి 18: రైలు ఢీకొని జ్యూట్ కార్మికుడు మృతి చెందాడు. శనివారం ఉదయం ఏ సిప్టులో విధులు నిర్వహించడానికి వెళ్తుండగా తాడ్డిపైడితల్లి (54) అనే జ్యూట్ కార్మికుడు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండలంలో చంద్రంపేటకు చెందిన జ్యూట్ కార్మికుతు తాడ్డి పైడితల్లి ఉదయం తన విధులు నిర్వహించడానికి మిల్లులోనికి వెళ్తుండగా రైలు పట్టాలు దాటే సమయంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌రైలు ఢీకొన్న ప్రమాదంలో పైడితల్లి అక్కడికక్కడే మృతి చెందాడు తల్లిదండ్రులు ఇద్దరు మృతిచెందడంతో కుమార్తెలు అనాథలుగా మిగిలారు. రైల్వేపోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్మికులు మృతదేహంతో ధర్నా నిర్వహించారు.
పల్స్‌పోలియో విజయవంతానికి పిలుపు
విజయనగరం (కలెక్టరేట్), ఫిబ్రవరి 18: ఐదేళ్లలోపు పిల్లలందరికి పోలియో వ్యాక్సిన్ వేసి పల్స్‌పోలియోను విజయవంతం చేయాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏ ప్రాంతాల్లో ఉన్నా ఎలాంటిపనుల్లో ఉన్నా పిల్లలకు పోలియోచుక్కలు వేయడం మరువద్దని ప్రజలకు సందేశాన్ని నిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్చంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు అన్ని వార్గాల ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఆరోగ్య కార్యకర్తల తమకు కేటాయించిన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చిన్నారులు కేంద్రాలకు వచ్చేలా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో 2,39,719 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి కలెక్టర్‌కు వివరించారు. ఎజెసి రామారావు, ఎడిఎంహెచ్‌ఒజి.వరలక్ష్మి పాల్గొన్నారు.
సహకార రైతులకు వడ్డీలేని రుణాలు
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 18: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను ఈ రబీసీజన్‌లో రెన్యువల్ చేయించుకుంటే వడ్డీలేని రుణాలను అందిస్తామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వంగపండు శివశంకర ప్రసాద్ తెలిపారు. 2011-2012 సంవత్సరంలో రుణాలు తీసుకున్న రైతులు ఈ రబీసీజన్‌లోగా రుణాలను రెన్యువల్ చేయించుకోవాలని ప్రభుత్వం జి.ఒ.నెంబర్ 270 విడుదల చేసిందన్నారు. శనివారం తన కార్యాలయంలో వడ్డీలేని రుణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 16వేల మంది రైతులకు 80 కోట్ల రూపాయల రుణాలను అందిస్తామన్నారు. ఇందులో 6,700 మంది రైతులు 35 కోట్ల రూపాయల రుణాలను రెన్యువల్ చేయించుకున్నారన్నారు. వీరందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలో సహకార రైతులందరి రుణాలను మార్చినెలాఖరులోగా రెన్యువల్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధంగా రెన్యువల్ చేస్తే వడ్డీలేని రుణాలు పొందేందుకు అర్హత పొందుతారన్నారు. 11 బ్రాంచ్‌ల ద్వారా బంగారు ఆభరణాలపై రుణాలను అందిస్తున్నామని తెలిపారు. ఇంతవరకు 15 కోట్ల రూపాయల రుణాలను అందించామన్నారు.