తిరుపతి,మే 11: పంచాయతీ ఎన్నికల్లో అద్బుతమైన ఫలితాలను సాధించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని, ఏవైనా చిన్నచిన్న బేదాభిప్రాయాలుంటే వాటికి దూరంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు పిలుపునిచ్చారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆయన తిరుగుప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం, విఐపి లాంజ్‌లో బోజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, నరసింహా యాదవ్, సూరా సుధాకర్‌రెడ్డి,శ్రీధర్‌వర్మ, పుష్పావతితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులు గెలిచి తీరాల్సిందేనన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా జిల్లాలోని 14 నియోజవర్గాలను కైవసం చేసుకునేవిధంగా పార్టీని బలోపేతం చేయాలన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న బాబు
టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడు శనివారం ఉదయం విరామ సమయంలో తనయుడు లోకేష్, భార్య భువనేశ్వరితో స్వామిని దర్శించుకున్నారు. వాస్తవానికి ఆయన సుప్రభాతసేవలో స్వామివారిని దర్శించుకుంటారని ముందుగా భావించారు. అయితే ఆయన విఐపి సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా టిటిడి అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో అద్బుతమైన ఫలితాలను సాధించేందుకు ప్రతి
english title:
babu
Date:
Sunday, May 12, 2013