Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ముగిసిన కుంభమేళా

$
0
0

న్యాల్‌కల్, జహీరాబాద్, మే 13: పంచవటి క్షేత్రంలో 13 రోజులపాటు జరిగిన కుంభమేళా ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. వందలాది మంది ప్రముఖులు, వేలాది మంది సాధువులు, లక్షలాది మంది భక్తులు కుంబమేళాలో పాల్గొని ఇక్కడి పుణ్య క్షేత్రాన్ని దర్శించుకున్నారు. చివరి రోజున పూర్ణాహుతి గంగాపూజ, గంగా మహా హారతి, అమృత స్నానం తదితర ఆధ్యాత్ని కార్యక్రమాలు నిర్వసించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి గీతారెడ్డితోపాటు గుజరాత్ బాబా ఆశ్రమానికి చెందిన నారాయణ స్వామిజీ పాల్గొన్నారు. నారాయణ స్వామిజీకి స్థానిక భక్తులు, సాదువులు భాజాభజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామీజి మంజీరాలో పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు పూజలు నిర్వహించారు. అంనతరం నిర్వహించిన పల్లకీ సేవలో స్వామి పాల్గొన్నారు. బిచుకుంద ఆశ్రమ పీఠాధిపతి సోమలింగ శివాశ్చార్య కూడా కుంభమేళాకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరి రోజు కావడంతో భక్తులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గీతారెడ్డి తన కూతురు మేఘనతోకలిసి మంజీరాలో గంగామాత పూజలు నిర్వహించారు. దీపాలు వెలిగించి గంగానదిలో వదిలారు. అనంతరం కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. మండలంలోని పంచవటి క్షేత్రంలో 9రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన కుంబమేళాలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలుచేసి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాదు, సంతులు యజ్ఞాలు నిర్వహించగా పండితులు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భజన కీర్తనలు తదితర అధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. పంచవటిలోని దేవతా మూర్థులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మేళ చివరిరోజున మహిళా భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజీరానదీ తీరాన సందడి నెలకొంది. సాదువులు కుంబమేళాకు వచ్చిన భక్తులను ఆశీస్సులు అందజేశారు. మంజీరా కుంబమేళాకు వచ్చిన భక్తులకు ఈ ప్రాంగణంలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సాదువులు రోజువారి కార్యక్రమంలో భాగంగా సోమవారం కూడా ధ్వజస్థంబానికి, పల్లకీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆటపాటలతో పల్లకీని ఊరేగిస్తూ మంజీనానది వరకు వెళ్లారు. అక్కడ గంగామాతకు పూజలు నిర్వహించారు. పుణ్యస్నానాలు చేశారు.

విత్తనాల విక్రయంలో మోసాలు చేస్తే కఠిన చర్యలు
* డీలర్లకు జెడిఎ హెచ్చరిక
సదాశివపేట, మే 13: రైతుల మోసాలకు గురి చేస్తూ అక్రమార్జన చేసే ఎరువులు, విత్తనాల డీలర్ల ఆగడాలను ఎంత మాత్రం సహించబోమని, లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని వ్యవసాయ శాఖ జెడిఎ ఉమామహేశ్వరమ్మ డీలర్లను హెచ్చరించారు. సోమవారం నాడు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించాలని సూచించారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. రైతులు కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రశీదును తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. రోజువారిగా స్టాక్, ధరల వివరాలను పట్టికలో పొందుపర్చాలని సూచించారు. ఈ ప్రాంతంలో అధిక శాతం రైతులు పత్తినే సాగు చేస్తున్నారని నకిలి విత్తనాలను గతంలో విక్రయించి రైతులకు అన్యాయం చేసారని ఈ సారి అలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇన్స్‌పెక్టర్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ప్రభుత్వం అనేక సబ్సిడి పథకాలను అందిస్తుందని, దాన్ని ఆసరగా చేసుకుని ఎవరైన అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే ఎవరైనా సరే ఊరుకోబోమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏమైన ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. స్వంత నిర్ణయాల వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పత్తి బిటి రకంలో నకిలి విత్తనాలను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సీజన్‌కు ముందుగానే అన్ని సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అధిక ధరలకు అమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎఓ బాబునాయక్, విస్తరణ అధికారి ప్రవీన్‌కుమార్, ఖాదిరి తదితరులు పాల్గొన్నారు.

పాఠ్యపుస్తకాల సత్వర పంపిణీకి చర్యలు
మెదక్, మే 13: మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్, మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ ఆదేశాల మేరకు మెదక్‌లో ఉన్న జిల్లా పాఠ్య పుస్తక కార్యాలయం నుండి మండల కేంద్రాలకు ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు తరలింపు ప్రారంభమైంది. ఈ విషయాన్ని మెదక్ జిల్లా పాఠ్యపుస్తక విక్రయ కార్యాలయ మేనేజర్ సిహెచ్.వెంకటేశ్వర్‌లు సోమవారం నాడు మాట్లాడుతూ తెలిపారు. 201314 సంవత్సరానికి గాను 4,5,8,9వ తరగతుల పాఠ్యపుస్తకాలు సంపూర్ణంగా మరాయని వెంకటేశ్వర్‌లు తెలిపారు. ఉర్దు మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కూడా సూచించిన తరగతులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు మరాయని ఆయన తెలిపారు. 4వ తరగతిలో తెలుగు, 5వ తరగతిలో తెలుగు పాఠ్యపుస్తకాలు మరాయని ఆయన తెలిపారు. 8వ తరగతిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్‌లోను, సాంఘీక శాస్త్రం అనే పాఠ్యపుస్తకాలు మరాయని సిహెచ్.వెంకటేశ్వర్‌లు తెలిపారు. 9వ తరగతిలో హిందీ, గణితం ఇంగ్లీష్‌లో, ఫిజిక్స్ తెలుగు మీడియంలోను, ఇంగ్లీష్ మీడిలోకి, సాంఘీక శాస్త్రం తెలుగుమీడియంలోకి మరాయని ఆయన తెలిపారు. కగా మొత్తం 13 కొత్తరకాల పాఠ్యపుస్తకాలు దిగుమతి అయ్యాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాల, హైస్కూల్‌లు జూన్ 12న ప్రారంభమవుతున్న సందర్భంగా జూన్ 5లోపే మొదటి విడత పాఠ్యపుస్తకాలు జిల్లాలోని 46 మండల కేంద్రాలకు తరలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రైవేటు విద్య సంస్థల పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందజేయడానికి జిల్లాలో 25 షాపులకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 201314కు గాను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా 24 లక్షల 40 వేల 888 ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు ప్రతిపాధనలు పంపడం జరిగిందని డిపో మేనేజర్ వెంకటేశ్వర్‌లు తెలిపారు. గత సంవత్సరం డిపోలో 36 వేల 975 పాఠ్యపుస్తకాలు మిగిలాయన్నారు. ఇవిపోగా హైదరాబాద్, రామంతపూరం నుండి 24 లక్షల 3 వేల 913 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇందులో సోమవారం వరకు 4 లక్షల 275 పాఠ్యపుస్తకాలు రామంతపూరం నుంచి వచ్చాయని ఆయన తెలిపారు. ఇవి కాక రావల్సిన పాఠ్యపుస్తకాలు 20 లక్షల 3 వేల 638 ఉన్నాయని ఆయన తెలిపారు. రోజుకు 3 లారీల వంతున పాఠ్యపుస్తకాలు దిగుమతి అవుతున్నట్లు ఆయన తెలిపారు. గంజి శ్రీనివాస్ ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విద్య సంవత్సరం 140 ప్రింటింగ్ ప్రేస్‌లు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపాడు. గత సంవత్సరం 80 ప్రింటింగ్ ప్రెస్‌లు మాత్రమే పని చేశాయి. ప్రింటింగ్ ప్రెస్‌లను అధనంగా పెంచడం వలన పాఠ్యపుస్తకాల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగదని ఆయన తెలిపారు. ఈ నెల 20 నుండి రోజుకు ముడు మండలాలకు పాఠ్యపుస్తకాలను తరలించే విధంగా ప్రణాలిక సిద్దం చేసుకున్నామన్నారు. డిపోలో 201314కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు సిద్దంగా ఉన్నాయన్నారు. మండలాల్లో ఎంఆర్‌సిలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంఈఓలను డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పాఠ్యపుస్తకాల డైరెక్టర్ సుధాకర్ గత నెల 25న రాష్ట్రంలోని 23 జిల్లాలకు పాఠ్యపుస్తకాల తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. గత సంవత్సరం పాఠ్యపుస్తకాల సరఫరా కార్యక్రమంలో రాజమండ్రి మొదటి స్థానంలో ఉండగా మెదక్ రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఈ సంవత్సరం మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉండేందుకు డిపో మేనేజర్ సిహెచ్.వెంకటేశ్వర్లు పాఠ్యపుస్తకాల సరఫరాలో అత్యంత కృషి చేస్తున్నారు.

రేపటిలోగా అన్ని గ్రామాలలో
రెవెన్యూ కార్యాలయాల ఏర్పాటు
మెదక్, మే 13: మెదక్ డివిజన్‌లోని అన్ని గ్రామాలలో ఈ నెల 15 నాటికి గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేయాలని మెదక్ సబ్ కలెక్టర్ భారతి హొళ్లికేరి తహశీల్దార్‌లను ఆదేశించారు. సోమవారం నాడు తహశీల్దార్‌ల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయాల్లో సరిపడ ఫర్నిచర్‌ను సమకుర్చుకుని, అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని కూడా సబ్ కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామంలో మంచినీటి సమస్యపై దృష్టి సారించి మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి స్వచ్చమైన నీటిని ప్రజలకు అందిచాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మండల కేంద్రంలో ఒక రిజిస్ట్రర్ ఏర్పాటు చేసి నీటి కొరత ఉన్నవారు ఈ రిజిస్టర్‌లో సమస్యను నమోదు చేస్తే పరిష్కరిస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదోడ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు బిల్లులు చెల్లించాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కంరించాలని ఆదేశించారు. అర్హులైన కౌలు రైతులకు రుణ అర్హత కార్డులతో పాటు బ్యాంక్ రుణాల మంజూరులో జాప్యం లేకుండా చుడాలన్నారు. రైతు ఆత్మహత్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. సాగురైతు రక్షణ హాస్తం పథకంపై గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. ఆ తరువాత జరిగిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో 45 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 50 శాతం దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేశారు. రెషన్ కార్డులు, ఇండ్ల స్థలాలో కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. సర్ధన రేషన్ డీలర్ వీణావాణి షాపులో అమ్మహాస్తం సరుకుల కోసం 300 మంది వద్ద అడ్వన్స్‌గా డబ్బులు వసులు చేశారని, కిరోసిన్ బ్లాక్‌లో అమ్ముతుండగా తహశీల్దార్ సీజ్ చేయడం జరిగిందని, అమ్మహాస్తం సరుకులకు అడ్వన్స్‌గా తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరుతూ యాదగిరి ఆధ్వర్యంలో 8 మంది ప్రజాదర్భార్‌లో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పు తీసుకున్న డబ్బులు చెల్లించినప్పటికినీ కుంచెరకల వారు తమను బాగా వేదిస్తున్నారని, వారి నుండి తమను కపాడమంటూ ఒక యువతి సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం 10:30 నుండి నిర్వహించే ప్రజాదర్భార్‌లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ భారతి హొళ్లికేరి కోరారు. ఈ సమావేశంలో మున్సిపాల్ కమీషనర్ ప్రభాకర్, రాంరెడ్డి, ఎఈ సురేష్, శంకరయ్య, మంగ నాగభూషనం తదితర అధికారులు పాల్గొన్నారు.

కార్మికుని అనుమానాస్పద మృతి
తూప్రాన్, మే 13: మండల పరిధిలోని ముప్పిరెడ్డిపల్లిలో ఓ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసు కుంది. ఈ సంఘటనకు సంబందించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులోని ప్రైవేటు కంపెనీలో కాళ్లకల్ కు చెందిన లింగ నాగరాజు(28) ఆదివారం రాత్రి విధులు ముగించుకొని అక్కడే నిద్రించాడు. అయితే తెల్లవారే సరికి నాగరాజు ఫ్యాక్టరీ సంప్‌లో పడి మృతి చెంది కనిపించడంతో సోమవారం ఉద్రిక్తతతకు దారి తీసింది. ఈ సమాచారం తెలుసుకున్న బాధితులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగగా కంపెనీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో 2గంటల అనంతరం ఆందోళన విరమించగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తూప్రాన్ ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా, మృతునికి భార్య, ఓ కుమార్తెలు ఉన్నారు.

కిటకిటలాడిన శ్రీ విద్యాధరి క్షేత్రం
గజ్వేల్, మే 13: అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తమ చిన్నారులకు అక్షర స్వీకారాలు చేయించగా, వేదపండితులు తీర్థప్రసాదాలతోపాటు మహా ప్రసాదం అందజేశారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాటు చేయగా, శ్రీ విద్యాధరి, శ్రీ లక్ష్మిగణపతి, శ్రీ శనైశ్చర, శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ మేనేజర్ రఘుపవనశర్మ, ఆలయ నిర్వాహకులు నూక భిక్షపతిగుప్త, మల్లారెడ్డి, ప్రొద్దుటూరి పాండు రంగం, వెంకట్‌రాంరెడ్డి, బచ్చు ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ల కోసం ధర్నా
కొండపాక,మే 13: అర్హులైన వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని దళిత సేన జిల్లా అధ్యక్షులు దేవి రవిందర్ ఆరోపించారు. సోమవారం కొండపాక ఎంపిడిఓ కార్యాలయంకు తాళం వేసి ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేరవేర్చడం లేదని మండిపడ్డారు. వికలాంగుల పింఛన్లు, వితంతువుల పింఛన్లు, వృద్ధుల పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. వృద్ధులు పింఛన్ల కోసం కార్యాలయాల చుట్ట్టూ తిరిగినా పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ఇటు పని చేయ్యలేక అటు తినడానికి తిండికి లేక నానాతంటాలు పడుతున్నారన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైనా వారికి పింఛన్లు వెంటనే మంజూరు చేయకపోతే మరిన్ని ఉద్యమాలు చేయాల్సివస్తుందన్నారు.

పంచవటి క్షేత్రంలో 13 రోజులపాటు జరిగిన కుంభమేళా
english title: 
mela

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles