Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అసలు చెల్లించండి.. వడ్డీ వద్దు

$
0
0

విజయనగరం, మే 13: వ్యవసాయ రుణం తీసుకున్న రైతులు అసలు కడితే చాలని, వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సోమవారం ఇక్కడ రాజీవ్ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించిన డివిజన్ స్థాయి రైతు చైతన్య సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వెయ్యి కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుగా అందజేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తోందన్నారు. లక్ష రూపాయల రుణం పొందిన వారు సంవత్సరంలోగా అసలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారన్నారు. రైతు చైతన్య సదస్సుల ముఖ్య ఉద్దేశం గురించి చెబుతూ ఈ ప్రభుత్వం ఏం చేస్తొంది? రైతులకు ఏం కావాలన్న దానిపై చర్చించడానికే ఈ సదస్సులు నిర్వహిస్తొన్నామన్నారు. ముందుగా జిల్లాలో పంటల విస్తీర్ణం, ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే విషయమై వ్యవసాయశాఖ జెడి లీలావతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతుల అభిప్రాయాలను అడిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను వివరించారు. ఎ.పి. సీడ్స్ ద్వారా సరఫరా చేస్తున్న 1001 రకం విత్తనాలు అమ్మకానికే తప్ప తినడానికి పనికిరావడం లేదని గంట్యాడ రైతు పేర్కొన్నారు. అందువల్ల సాంబమసూరి విత్తనాలు కావాలని కోరారు. దీనికి మంత్రి బొత్స స్పందిస్తూ తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 1001 రకం సరఫరా చేస్తున్న విషయం గుర్తు చేశారు. మరో రైతు సాంబమసూరి రకంనకు ఎక్కువ తడులు కావాలని, సోనా మసూరికి తక్కువ తడులతో పండుతుందని వివరించారు. ఎపి సీడ్స్ ద్వారా సరఫరా చేసిన విత్తనాల్లో కేళీలు వచ్చాయని వాటికి నష్టపరిహారం ఇవ్వలేదని మంత్రి దృష్టికి రైతులు తీసుకురాగా, నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసుకుంటే దానికి ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుందని, కేంద్రం 30 శాతం, రాష్ట్రం 20 శాతం సబ్సిడీ ఇవ్వనుందని మంత్రి తెలిపారు. మిగిలిన మొత్తాన్ని రైతులు బ్యాంకుల నుంచి రుణంగా పొందే వీలుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో 2700 గ్రామాల్లో రైతు చైతన్య సదస్సులు నిర్వహించామన్నారు. 1.30 లక్షల మంది రైతులు రైతు సదస్సుల్లో పాల్గొన్నారని చెప్పారు. జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తున్నారని వీరందరికి అవసరమైన విత్తనాలు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రైతులు అవసరం మేరకు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ఎక్కువ కొనుగోలు చేసి నిల్వలు చేసుకోవద్దని హితవు పలికారు.

సరకుల కోసం రేషన్ డీలర్ల పడిగాపులు
విజయనగరం , మే 13: పౌరసరఫరాల వ్యవస్థ పనితీరు కారణంగా రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా గోదాముల నుంచి సరకులు విడిపించుకుని రేషన్ డిపోలకు చేర్చడం సమస్యగా మారిందని విమర్శిస్తున్నారు. మే నెలకు సంబంధించి 13వ తేది నాటికి లబ్ధిదారులకు రేషన్ బియ్యం తప్ప ఇతర సరకులు అందలేదు. విజయనగరం ఎం.ఎల్.ఎస్ పాయింట్లకు సంబంధించి ఈ నెల 6 తేదిన అమ్మహస్తం సరకులను కేటాయించారు. దీంతో డీలర్లు ఈ సరకులను విడిపించేందుకు ఆర్వోలు తీసుకుని సుమారు వారం రోజులు గడుస్తున్నా నేటికి రేషన్ డీలర్లకు సరకులు అందలేదు. దీంతో ప్రతి రోజు డీలర్లు గోదాములు చుట్టూ తిరుగుతుండగా, లబ్ధిదారులు రేషన్ దుకాణాలు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. రేషన్ డీలర్లకు సరకులు సకాలంలో అందివ్వకపోవడం వల్ల అటు అధికారులకు, ఇటు లబ్ధిదారులకు డీలర్లు సమాధానం చెప్పుకోలేక నలిగిపోతున్నారు. సరకుల రవాణా విషయంలో కూడా రేషన్ డీలర్లు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా రేషన్ బియ్యంతోపాటు ఇతర సరకులను గుత్తేదారు వాహనాల్లో సరుకులను రేషన్ షాపులకు తరలించేవారు. అయితే గుత్తేదారు నెలమధ్యలో ఒక్కసారిగా సరకులు రవాణా చేయలేమంటూ చేతులు ఎత్తేసారు. దీంతో ఇప్పటి వరకు రెండో విడత బియ్యం చాలా రేషన్ దుకాణాలకు చేరలేదు. అటు బియ్యం రాక, ఇటు 9 రకాల సరకులు లేక రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్న రేషన్ సరుకులను సకాలం విడిపించాలంటూ పౌరసరఫరాల అధికారులు నిబంధనలు పెడుతున్నారు. దీంతో డీలర్లు అధికారులకు ఎదుర చెప్పలేక, లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక ఏమి పాలుపోని స్థితిలో ఉండిపోతున్నారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) ఎల్.నాగేశ్వరరావును వివరణ కోరగా, గుత్తేదారుడు వాహనాలను నిలిపివేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వారితే చర్చించి సరకులు సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై ఇక్కడి మండలం రేషన్ డీలర్ల సంఘం నాయకుడు ఎ.ఎస్ ప్రకాష్ మాట్లాడుతూ గోదాముల నుంచి రేషన్ సరకులు సకాలంలో అందకపోవడంతో లబ్ధిదారులకు అందజేయలేకపోతున్నామని తెలిపారు. ఆర్వోలు తీసిన తర్వాత వారం, పదిరోజుల వరకు సరకులు అందివ్వకపోవడం వల్ల వేల రూపాయల పెట్టుబడి వృథాగ ఉండిపోయి, వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. సరకులు రవాణా విషయంలో కూడా రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అక్రమంగా నిల్వ చేసిన కిరోసిన్ స్వాధీనం
జామి, మే 13 : మండల కేంద్రమైన జామిలో మంగళివీధిలో గల ఓఇంటిలో కిరోసిన్‌ను అక్రమంగా నిల్వ చేసారు. ఈవిషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది సంబంధిత పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ శేషగిరి సోమవారం దాడులు నిర్వహించి 30 లీటర్లు కిరోసిన్ అక్రమంగా అమటపు ఆదితాత ఇంటి వద్ద నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విజయనగరం పట్టణం కొత్త అగ్రహారానికి చెందిన ఓ వ్యక్తి ఖాళీ కిరోసిన్ కేనులతో ఆదితాత ఇంటికి రావడంతో అధికారులు విచారించగా ఫోన్ ద్వారా ఆదితాత తనను పిలిపించి కిరోసిన్ అమ్ముతానని చెప్పినట్లు తెలిపారు. 5 సంవత్సరాల నుండి ఇద్దరి మద్య అక్రమ కిరోసిన్ వ్యాపారం జరుగుతున్నట్లు తెలిపాడు దీంతో అధికారులు చెప్పిన విషయాలను రికార్డు చేసి కిరోసిన్ నిల్వ చేసిన ఇంటిని సీజ్ చేయడంతో పాటుగా ఆదితాతపై ఎ6గా కేసు నమోదు చేసినట్లు హెచ్‌డిటి శేషగిరి తెలిపారు. ఈదాడుల్లో రెవెన్యూ ఇన్స్‌ప్పెక్టర్ గౌరీశంకర్, సంత్యంలు ఉన్నారు. సీజ్ చేసిన ఇంటి వద్ద గ్రామ తలయారీని ఉంచినట్లు అధికారులు తెలిపారు.

‘సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయాలి’
విజయనగరం , మే 13: పట్టణంలో చేపట్టే పలు అభివృద్ధిపనులను సంక్రాంతిలోగా పూర్తి చేయాలని పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర రవాణాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలో అశోక్‌నగర్ నుంచి గౌడువీధి జంక్షన్ వరకు 25.80లక్షల రూపాయల వ్యయంతో కాలువలు, రోడ్ల మరమ్మతులను సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధి అభివృద్ధి చేస్తారని వేచిచూశామని, నాలుగేళ్ల నుంచి ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని తెలుగుదేశం ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజునుద్ధేశించి పరోక్షంగా అన్నారు. ఎవరి నిందించడానికో, బాధించడానికో శంకుస్థాపనలు చేయడంలేదన్నారు. పట్టణాభివృద్ధి గురించి కొంతమంది విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేయడం వల్ల ప్రజల కడుపు నిండదని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో వుడాకాలనీల్లో రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధిపనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. పట్టణంలో నిరుపేదలకు 18వేల పింఛన్లు ఇస్తున్నామని, మరో రెండువేల పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే 6,200 కొత్తరేషన్‌కార్డులు, 1830 దీపం గ్యాస్ కనెక్షన్‌లు ఇచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. వీటిని జూలైనెల మొదటివారం నుంచి అర్హులైనవారందరికీ ఇస్తామన్నారు. జమ్మునారాయణపురంలో పేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లను చాలామంది ఇంతవరకు నిర్మించలేదని, ఇలాంటివారి ఇళ్లను రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు ఇస్తామన్నారు.
ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి గురించి తాము కృషి చేస్తుంటే ప్రతిపక్షపార్టీ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. అభివృద్ధి పనులను గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, నాఫెడ్ డైరెక్టర్ కె.వి.సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, ఆర్డీఒ జి.రాజకుమారి, ప్రజారోగ్య, పురపాలక సాంకేతిక శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ఆర్.గోపాలరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పిళ్లా విజయకుమార్, పిళ్లా వినాయకమ్మ, యడ్ల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అర్జీదారులతో కిటకిటలాడిన ‘గ్రీవెన్స్’
విజయనగరం, మే 13 : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాటి గ్రీవెన్స్ సెల్ అర్జీదారులతో కిటకిటలాడింది. మినీ కానె్ఫరెర్స్ హాలులో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారం కోరుతూ 150కి పైబడి వినతులు అందాయి. డిఆర్‌ఒ హెచ్‌ఎస్ వెంకటరావు వినతులను స్వీకరించారు. రానున్న ఎన్నికల్లో బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి 2011 జనాబా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ వార్డులు పెంచాలని, మున్సిపల్ చైర్మన్ పదవిని ఎస్సీలకు రిజర్వు చేయాలని కోరుతూ బొబ్బిలి పట్టణ దళిత ఐక్య సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు జి.విజయ్‌కుమార్ వినతినిచ్చారు. భోగాపురం మండలం గూడెపువలస విఆర్వోగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉషారాణిని కొనసాగించాలని కోరుతూ గ్రామస్తులు వినితినిచ్చారు. ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ డెంకాడ మండలం రఘమండ గ్రామానికి చెందిన పలువురు వికలాంగులు కోరారు. వేపాడ మండలం వీలుపర్తి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతు పి.వెంకటేశ్వరరావు వినతినిచ్చారు. సులబ్ కాంప్లెక్స్‌ల్లో పనిచేస్తున్న వారి వేతన సమస్యను పరిష్కరించాలని విజయనగరానికి చెందిన గణపతిరావు కోరారు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహ బహుమతి అందించాలని బలిజిపేటకు చెందిన ఎల్.శ్రీనివాసరావు కోరారు. తమ జిరాయితీ భూములను ఇతరులకు ఇళ్ల స్థలాలుగా మంజూరు చేస్తూ పంపిణీ చేయడంపై దర్యాప్తు జరిపించాలని నెల్లిమర్లకు చెందిన కె.శ్రీనివాసరావు కోరారు. ఎస్సీ కార్పొరేషన్ రుణం ఇప్పించాలని బొబ్బిలి మండలం బోడ్డవలసకు చెందిన డి.ఈశ్వరరావు కోరారు. ఇంకా పలు సమస్యలపై పలువురు వినతినందించారు.

నాగావళిలో తగ్గుతున్న నీటి ప్రవాహం
గరుగుబిల్లి, మే 13: ప్రస్తుత వేసవి ఎండల తీవ్రతకు నాగావళి నదిలో గడిచిన కొద్ది రోజుల నుంచి నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. దీంతో కుడి, ఎడమ కాలువల పరిధిలోని పలు గ్రామాలకు మంచినీటి అవసరం నిమిత్తం విడుదల చేసిన నీటి ప్రవాహం తగ్గింది. ఇటీవల అక్కడక్కడా వర్షాలు కురిసినప్పటికీ నదిలో నీటి ప్రవాహం పెరగలేదని పలువురు అంటున్నారు. ఎండల తీవ్రతకు రోజురోజుకు నదిలో నీటి ప్రవాహం తగ్గుతోంది. కాలువల పరిధిలోని రావివలస, లఖనాపురం, శివ్వాం, కొత్తూరు, కొత్తపల్లి గ్రామాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో నీరు నిల్వ చేసుకునేందుకు అధికారులు నీటిని విడుదల చేశారు. కొద్ది రోజుల్లో కాలువల ద్వారా నీటి సరఫరా నిలుపుదల చేస్తామని అధికారులు అంటున్నారు.
‘సమస్యల పరిష్కారానికి చర్యలు’
విజయనగరం (కంటోనె్మంట్), మే 13: జిల్లా ఎస్పీ కార్తికేయ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 9, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 3 ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అమలాపురానికి చెందిన పి.ఉషా కామేశ్వరికి విజయనగరం పట్టణం కె.ఎల్.పురానికి చెందిన శివప్రసాద్‌తో వివాహం జరిగిందని, అయితే భర్త శివప్రసాద్, అత్తమామలు అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విజయనగరం పట్టణం కంటోనె్మంట్‌కు చెందిన ఒక మహిళ తన ఇంటి స్థలాన్ని విజయనగరం, ఏనుగురాయి వీధికి చెందిన ఒకరు దౌర్జన్యంగా ఆక్రమించుకుడని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

కొనసాగుతున్న ఉపాధ్యాయుల కౌనె్సలింగ్
విజయనగరం, మే 13: ఉపాధ్యాయ కౌనె్సలింగ్ రెండో రోజు కొనసాగింది. సోమవారం స్కూల్ అసిస్టెంట్ మేద్స్, భాషా పండితులు తెలుగు, హిందీ, పిఇటి, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఎస్‌జిటిలకు కౌనె్సలింగ్ నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్లు 182, ఎల్.పి. తెలుగు 67, ఎల్.పి. హిందీ 69, పిఇటి 38, పిఎస్‌హెచ్‌ఎం 95, ఎస్.జి.టిలు 400 మందికి కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈ ఖాళీల్లో చాలా వరకు నచ్చిన పోస్టింగ్ దొరకలేదన్న కారణంగా చాలా మంది విముఖత చూపారు. పారదర్శకంగా కౌనె్సలింగ్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటునన్నారు. కౌనె్సలింగ్‌లో అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు, డిఇఒ కృష్ణారావు, డిప్యూటీ డిఇఒ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ రుణం తీసుకున్న రైతులు అసలు కడితే
english title: 
interest

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>