Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అభివృద్ధి పనులకు జిల్లా ప్రణాళిక కమిటీ ఆమోదం

$
0
0

సంగారెడ్డి,మే 14: 2013-14 సంవత్సరానికిగాను 4060 పనులను 3969.30 లక్షల రూపాయల వ్యయంతోపూర్తి చేయాలని అంచనా కేటాయింపులను జిల్లా ప్రణాళిక కమిటీ సమావేశం రూపొందించింది. ఈమేరకు సకాలంలో పనులను పూర్తి చేసి నిధులు వచ్చే రీతిలో చర్యలను కూడా తీసుకోవాలని తీర్మానించింది. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళికా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఏ దినకర్‌బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యే టి హరీష్‌రావు,పి కిష్టారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. 2013 -14 అంచనా కేటాయింపులకు 100 శాతం నిధులలకు గాను గ్రామ పంచాయతీలకు 50 శాతం కేటాయింపులతో 1095 లక్షల రూపాయలు 1752 పనులకు, 30 శాతం నిధులను మండల ప్రజాపరిషత్ పనులకు గాను 699లక్షల వ్యయంతో 430 పనులకు,జిల్లా పరిషత్‌కుగాను 20 శాతం నిధులతో 406 లక్షల వ్యయంతో 143 పనులకు మున్సిపాలిటీలకు గాను 380 లక్షల వ్యయంతో 145 పనులకు ఆమోదించడం జరిగింది. కాగా, మరో 50 శాతం అదనపు ప్రణాళికను గాను 1388.30 లక్షల వ్యయంతో 1590 పనులను పూర్తి చేయడానికి సభ ఏకగీవ్రంగా ఆమోదించింది.ఈ విషయంపై మొదటగా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం 2001 జనాభా ప్రతిపాదికన కేటాయించడం జరిగిందని తాజాగా వచ్చిన జనాభా లెక్కలు(2011)ప్రకారం నిధుల కేటాయింపు చేయాలని ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపాలని కోరగా సభ ఆమోదించింది. అనంతరం జిల్లా కలెక్టర్ ఏ దినకర్‌బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొదటగా పారిశుద్ధ్యం, తాగు నీరు, రహదారుల లాంటి వసతుల కల్పనకు గతంలో వివిధ శాఖలకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బిఆర్‌జిఎఫ్ నిధులను సక్రమంగా ఖర్చు చేసి అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథణలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. కలెక్టర్ మాట్లాడిన అనంతరం ఎమ్మెల్యే హరీషరావు మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ దష్ట్యా ముందస్తుగా ఎరువులు, విత్తనాలు సమస్య లేకుండా చూడాలని కోరారు.అలాగే రైతాంగం రోడ్డెక్క కుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. పంట బీమా చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని వెంటనే చేయాలని కోరారు.బ్యాంకర్లు ఏడున్నర కోట్ల డబ్బులు రైతాంగానికి పంపిణీ చేసినట్లు చెబుతున్న ఇప్పటి వరకు రైతాంగ ఖాతాలోకి డబ్బులు రాలేదన్నారు. అలాగే 2009 నుంచి జిల్లాలో కురుస్తున్న వడ గళ్ల్ల వానకు రైతాంగానికి పరిహారం అందడం లేదని ఆరు నెలల క్రితం వచ్చిన నీలం తుఫాను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిహారం చెల్లింపులు జరుగుతున్నాయని సకాలంలో రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ వడ్లగళ్ల వర్ష నష్టపరిహారం చెల్లింపు విషయంలో జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడాలని హరీష్‌రావు కోరారు. అలాగే ఎరువుల వ్యాపారం చేయనున్న మహిళ సంఘాలకు అన్ని విధాలుగా అధికార యంత్రాంగం నుండి సహకారం అందించాలని సూచించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సానుకూలంగా మాట్లాడారు. ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో గత రెండేళ్ల కాలంగా మురికి కాలువలు, చెత్తను తీసువేసేవారు లేరని పంచాయతీ కార్యదర్శులు అసలే పట్టించుకోవడం లేదని ఉన్న కొద్దిపాటి నిధులను కూడా లెక్క పత్రం లేకుండా డ్రా చేస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక, మిరుదొడ్డి పంచాయతీల్లో ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉందని దీంతో దుబ్బాక పంచాయతీ ఏడు కోట్ల రూపాయల మైనస్‌లో ఉందని ఇలా ఉంటే స్థానిక సంస్థల అభివృద్ధి ఏలా సాధ్యమవుతుందన్నారు. రైతాంగానికి సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందే రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మరో ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి ఖరీఫ్‌కు సీజన్‌కు ముందస్తుగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈసమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో పరిశుభ్రత నెలకొనే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు మంచినీరు సౌకర్యం సకాలంలో పుస్తకాలు, దుస్తులు అందే రీతిలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అశీర్వాదం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసులో..
ముగ్గురికి జీవిత ఖైదు
చిన్నశంకరంపేట, మే 14: 2008లో చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి చెప్టాల నర్సింలు(48)ను అతని భార్యతో కలిసి హత్యచేసిన కేసులో ముగ్గురికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. నర్సింలు(48)ను మిర్జాపల్లి రైల్వే క్వార్టర్స్‌లోని ఇంట్లో అతని భార్యతో కలిసి తూప్రాన్ మండలనికి చెందిన బత్తుల రాజు, కుచారం రాములు, ములుగు మండలం నర్సాపూర్‌కు చెందిన బాబు గొంతునులిమి చంపారు. కాగా కేసు విచారణ సాగుతుండంగా నర్సింలు భార్య మృతి చెందగా మంగళవారం కోర్టులో వాదోపవాదాలు విన్న మెదక్ అదనపు న్యాయమూర్తి గోవర్ధన్‌రెడ్డి రాజు, రాములు, బాబులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు చిన్నశంకరంపేట ఎస్సై తెలిపారు.

గులాబీ దళంలో గుప్పుమన్న విభేదాలు
* దుబ్బాకలో భగ్గుమన్న
టిఆర్‌ఎస్ గ్రూపు విభేదాలు
* ఆర్‌ఎల్‌ఎల్, కెపిఆర్ వర్గీయుల
పరస్పర దూషణలు
దుబ్బాక, మే 14 : దుబ్బాక నియోజక వర్గంలో టిఆర్‌ఎస్‌లో గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. గత కొన్ని నెలలుగా దుబ్బాక టిఆర్‌ఎస్‌లో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నేత కొత్తప్రభాకర్‌రెడ్డిల మధ్య గ్రూపు వార్ నడుస్తుంది. దీంతో ఎవరికి వారే తమ క్యాడర్‌ను కాపాడుకుంటు వస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం దుబ్బాకలో జరిగిన టిఆర్‌ఎస్ ఆందోళన కార్యక్రమంలో గ్రూపు విబేదాలు బయటపడ్డాయి. ఆర్‌ఎల్‌ఆర్, కెపిఆర్ వర్గాలకు చెందిన నాయకుల గల్లాలు పట్టుకొని తోపులాటకు దిగటం శోచనీయం. నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి వుండగా మళ్లీ కెపిఆర్ వర్గం ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆర్‌ఎల్‌ఎర్ వర్గానికి చెందిన నాయకులు ఆస స్వామితో పాటు మరికొందరు నేతలు కెపిఆర్ వర్గానికి చెందిన మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆస యాదగిరిలు చొక్కాలు పట్టుకొని తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. దీంతో ఒక్కసారిగా గెస్టుహౌజ్ ప్రాంత మంత ఉద్రిక్తతగా తయారైంది. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకునే యత్నంలో అక్కడే వున్న టిఆర్‌ఎస్ నేతలు కల్పించుకొని ఇరువర్గాలను శాంతింప చేశారు. ఇంతకాలం నివురు గప్పిన నిప్పుల వున్న టిఆర్‌ఎస్ గ్రూపు విభేదాలు తాజాగా బయట పడటం నియోజక వర్గంలో చర్చనీయంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఉండగా కెపిఆర్‌కు టికెట్ వస్తుందంటు కొంతకాలంగా ప్రచారం జరుగుతుండటం పట్ల ఈగ్రూపుల మధ్య రోజురోజుకు విభేదాలు మరింత తీవ్రమైనాయి. తాజగా ఈసంఘటన చోటుచేసుకోవటంతో టిఆర్‌ఎస్ అధిష్టానంకు సైతం తీవ్ర తలనొప్పిగా మారెపరిస్థితి కన్పిస్తుంది.

వ్యాధులను అరికట్టేందుకు
సమగ్ర ప్రణాళిక
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
సంగారెడ్డి, మే 14: నీటి కాలుష్యం, దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టేందుకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్తు మినీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీటి కాలుష్యం ద్వారా నీళ్ల విరోచనాలు, రక్త విరోచనాలు, కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు వచ్చే అవకాశముందని ఎక్కడ కూడ నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.దోమకాటు ద్వారా మలేరియా,డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ఎక్కడ నీటి నిల్వ గుంతలు ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయించాలన్నారు.మంచినీటిలో క్లోరినేషన్ విధిగా చేయాలని, బోర్లు, చేతి పంపులు,కుళాయిలు,నీటి ట్యాంకుల వద్ద నీరు గుంతలలో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామాల్లో పరిశుభ్రత పాటించడానికి 5వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుందని వాటిని వినియోగించి మురికికాల్వలు, వీధులు శుభ్రపర్చడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులు చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాలలో జనన మరణాల వివరాలను విధిగా రిజిష్టర్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సి.రంగారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ విజయప్రకాష్, జడ్‌పి సిఈఓ ఆశీర్వాదం, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డిఆర్‌డిఎ పిడి సుధాకర్, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డిపిఓ జగన్నాథ్‌రెడ్డి,డిఎంఓ డాక్టర్ నాగయ్య పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

పోలీసుల 3కె రన్
తూప్రాన్, మే 14: తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌లకు మంగళవారం అల్లాపూర్ రోడ్డులో శివ్వంపేట ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో 3కే రన్ నిర్వహించారు. ఇందులో సుమారు 40మంది కానిస్టేబుల్‌లు పాల్గొన్నారు.

16న జాబ్‌మేళా
సంగారెడ్డి, మే 14: రాజీవ్ యువ కిరణాలు పథకంలో భాగంగా ఈ నెల 16న ఉదయం 10గంటల నుండి సంగారెడ్డి పాత డిఆర్‌డిఎ కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు డిఆర్‌డిఎ ఇన్‌చార్జ్ పిడి సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ కంపెనీలలో మార్కెటింగ్ ఎక్సికూటీవ్స్ మరియు మేనేజర్స్ పోస్టుల కోసం ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి పాసై , 19-30సంవత్సరాల వయస్సులోపు యువకులు అర్హులని తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్ట్ఫీకేట్స్‌తో హాజరుకావాలన్నారు.

టిఆర్‌ఎస్ బైక్ ర్యాలీ

* తెలంగాణలో ఉక్కు పరిశ్రమను
ఏర్పాటు చేయాలని డిమాండ్
సిద్దిపేట, మే 14 : బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు...తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు సిద్దిపేటలో టిఆర్‌ఎస్ నేతలు పట్టణంలో ప్రధాన వీధుల గుండా భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నయ్యర్ పటెల్, జిల్లా అధికార ప్రతినిధి మోహన్‌లాల్, వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు నివాసం ఎదుట ప్రారంభమైన బైక్ ర్యాలీ భారత్‌నగర్, విక్టరీ చౌరస్తా, గాంధీ చౌక్, మెయిన్‌రోడ్డు, మార్కెట్ చౌరస్తా, లాల్‌కమాన్, నర్సాపూర్ చౌరస్తా, మెదక్ రోడ్డు, అంబేద్కర్ నగర్, కాంచీట్ చౌరస్తా, ముస్తాబాద్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వద్ద బైక్ ర్యాలీ ముగించారు. ఈసందర్భంగా టిఆర్‌ఎస్ నేతలు నయ్యర్ పటేల్, మోహన్‌లాల్, వేణుగోపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ బయ్యారం ఉక్కును ఇనుప తట్టను సైతం తరలించకుండ టిఆర్‌ఎస్ నేతలు ఉక్కు కవచంగా వుంటారన్నారు. ఉక్కు పరిశ్రమను తెలంగాణ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలన్నారు. ఉక్కు పరిశ్రమ తెలంగాణాలో ఏర్పాటు చేసినట్లయితే ఈప్రాంత నిరుద్యోగులకు, ఉద్యోగ, ఉపాధి లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైన బయ్యారం ఉక్కును విశాఖకు తరలించే యత్నాన్ని విరమించుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేవరకు టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. టిఆర్‌ఎస్ నేతలు వెన్నమనేని కిషన్‌రావు, లోక లక్ష్మిరాజం, గుండు శ్రీనివాస్, శేషుకుమార్, నరేందర్‌రెడ్డి, కరాటే కృష్ణ, నగేశ్, చిప్ప ప్రభాకర్, బాల్‌రెడ్డి, మిద్దేరవి, యోగేశ్వర్,సంపత్‌రెడ్డి, బాలకిషన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

బసవ తత్వాలను ఆలపిస్తూ మహిళల ఊరేగింపు
సదాశివపేట, మే 14: బసవేశ్వరుడి 880వ జయంతి ఉత్సవాలను పురష్కరించుకుని ఎడ్లబజార్ బసవేశ్వర మందిరం వీరశైవ సమాజం, మహిళ విభాగం ఆధ్వర్యంలో బసవేశ్వరుడి చిత్ర పటాన్ని ఊరేగించారు. బసవేశ్వరుడు, ఆయన శిష్యులతో కూడిన బృందంగా చిన్నారుల విచిత్ర వేషధారణ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మహిళలు బసవేశ్వరుడు రచించిన తత్వాలు, పద్యాలను ఆలపిస్తూ బసవేశ్వర మందిరం నుంచి పురవీధుల గుండా ఊరేగించారు. పురుషులు భజనలు చేసారు. మందిరానికి చేరుకున్న అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముద్ద నాగ్‌నాథ్, గందిగె రాజు, సభ్యులు సిద్దేశ్వర్, అమ్రాది రాచన్న, సురేష్, వినోద్, రవి, సంగప్ప, వీరన్న, మహిళా కమిటి సభ్యులు స్వాతి, అన్నపూర్ణ, నర్సమ్మ, శశికల, సావిత్ర, దేవి, కవిత తదితరులు పాల్గొన్నారు.

2013-14 సంవత్సరానికిగాను 4060 పనులను 3969.30
english title: 
dev

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>