బొబ్బిలి, ఫిబ్రవరి 18: సక్రమంగా విధులను నిర్వహిస్తున్న మున్సిపాల్టీ ప్రత్యేకాధికారి ఉపాధ్యాయులపై కక్ష కట్టి సస్పెండ్ చేస్తున్నారని ఉపాధ్యాయులు ఎ శ్రీనివాసరావు, అచ్యుతరావు, మాధవీలతలతోపాటు మరికొంత మంది కమిషనర్ కె.ప్రసాద్‌కు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా శనివారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేక తరగతులకు 10 నిమిషాలు ఆలస్యమైతే ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఇకపై ఇదే విధంగా కొనసాగితే ఉపాధ్యాయులంతా సామూహిక సెలవులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు. సక్రమంగా పనిచేసిన వారికే శిక్ష విధించడం మంచి పద్ధతి కాదన్నారు.
సక్రమంగా విధులను నిర్వహిస్తున్న మున్సిపాల్టీ ప్రత్యేకాధికారి
english title:
u
Date:
Sunday, February 19, 2012