జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 18: స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలు రోడ్డులో నెక్కంటి జగదీష్ ఇంటిలో చోరీ జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయం కనిపెట్టి ఇంటి ఉత్తర వైపు తలుపుల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. జగదీష్ తల్లి చనిపోవడంతో మూడు నెలలుగా ఇల్లు ఖాళీ చేసి, ప్రక్కనే గల మరొక ఇంటిలో జగదీష్ కుటుంబం నివసిస్తోంది. జగదీష్‌తో భార్య, అక్క(అత్త) ఉంటున్నారు. ఖాళీ చేసిన ఇంటికి తాళాలు వేసి, ప్రతి రోజు ఉదయం వచ్చి శుభ్రం చేసుకుని వెళుతుంటారు. శనివారం ఉదయం శుభ్రం చేయడానికి వచ్చిన జగదీష్ సోదరి తలుపులు పగలగొట్టి ఉండటం గమనించి జగదీష్‌కు సమాచారం అందించింది. దానితో బంగారం, వెండి దాచి పెట్టిన గది తెరచి చూడగా అవి మాయం అయ్యాయి. తన వద్దగల బంగారం, వెండి వస్తువులు ఒక క్యారీ బ్యాగులో వేసి ఇంటి బయట స్టోర్‌రూమ్‌లో దాచిపెట్టి, స్టోర్‌రూమ్ తాళాలు పడకగదిలో భద్రపరచుకున్నారు. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగకు పడకగదిలోని స్టోర్ రూమ్ తాళం దాచిన ఫ్లాస్టిక్ బాక్స్ కనిపించడంతో తాళంతో స్టోర్‌రూమ్ తెరచి బంగారం, వెండి చోరీ చేసి, క్యారీబ్యాగు అక్కడే వదిలి యదావిధిగా స్టోర్ రూమ్‌కు తాళాలు వేసి తాళం చెవిని మరల పడకగదిలోని ప్లాస్టిక్ బాక్స్‌లో వేసి పరారయ్యాడు. ఇంటి వద్ద సిగరెట్ పీకలు, కిళ్ళీ ఉమ్ములు, భోజనం చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. జగదీష్ ఫిర్యాదు మేరకు స్థానిక సి.ఐ ఆర్.మనోజహార్, ఎస్సై పి.విశ్వం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఏలూరు నుండి క్లూస్ టీమ్ ఇన్‌స్పెక్టర్ కె.నరసింహారావు ఆధ్వర్యంలో వేలి ముద్రలు సేకరించారు. విజయవాడ నుండి వచ్చిన పోలీస్ జాగిలం పూనం చోరీ జరిగిన ఇంటిలోను, ఇంటి సమీపంలోను తిరిగింది. ఫలితం కనిపించలేదు. నెక్కంటి జగదీష్ స్థానిక పేరంపేట రోడ్డులో గత 20 ఏళ్ళుగా మోటార్ సైకిల్ షెడ్ నిర్వహిస్తున్నారు. తన భార్య, బంధువుల నగలు ఈ క్యారీ బ్యాగ్‌లోనే దాచినట్టు చెప్పారు. చోరీకి గురైన వస్తువులలో ఆరు కాసుల బంగారం బిస్కెట్ ముక్క, 5 కాసుల రెండు చైన్లు, ఒక కాసు నెక్‌చైను, 2 కాసుల నక్లెస్, అరకాసు ఉంగరం, కాసున్నర చెవి జాలర్లు, పావుకాసు చిన్నచెవి రింగులు ఉన్నట్టు, వెండి చెంబు, వెండి ఫ్లేటు, గినె్నలు, పూజా సామగ్రి, ఒక చిల్లర బాక్స్ చోరీకి గురైనట్టు జగదీష్ భార్య దేవి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సి.ఐ మనోజహార్ తెలిపారు.
శరవేగంగా వీరేశ్వరస్వామి ఉత్సవ ఏర్పాట్లు
పోలవరం, ఫిబ్రవరి 18: పట్టిసీమలోని శ్రీవీరేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆదివారం నుండి మంగళవారం వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి తరలి రానుండటంతో ఏర్పాట్లన్నీ పకడ్బందీగా జరుగుతున్నాయి. గోదావరి నదిలో భక్తులను అటూ, ఇటూ తరలించేందుకుగాను 12 లాంచీలు ఏర్పాటుచేయనున్నారు. ఫెర్రీ పాయింట్ వద్ద మూడు ఫ్లాట్‌ఫారాలు, గుడివైపున మూడు ఫ్లాట్‌ఫారాలను ఇసుక బస్తాలతో నిర్మించారు. ఇసుక తినె్నలపై భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా చలువ పందిళ్ళు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. గోదావరి ఒడ్డు నుండి గుడి వరకు కలువ పందిళ్లలో 15 చేతిపంపులను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో భక్తులు వెళ్ళేటప్పుడు తోపులాటలు జరగకుండా ఉండేందుకు ఇనుప గొట్టాలతో బారికేడ్లను నిర్మించారు. ఆలయం వద్ద ఏర్పాట్లన్నీ మేనేజర్ నాళం సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తహసీల్దార్ వి నాగార్జునరెడ్డి ఉదయం నుండీ పట్టిసీమలోనే మకాం చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఒక్క పంటు కూడా పట్టిసీమకు చేరుకోలేదు. ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం కోసం చేస్తున్న పనులు ఆదివారం కొనసాగేలా ఉన్నాయి. స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ ప్రాంతంలో రోప్ బారికేడ్లు ఏర్పాటు చేయవలసి ఉంది. అలాగే లోతైన ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, గత ఈతగాళ్ళను ఉంచవలసి ఉంది.
విఆర్వో పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వవద్దు
రంగంలోకి దిగిన క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్
english title:
18
Date:
Sunday, February 19, 2012