ఆచంట, ఫిబ్రవరి 18: ఆచంట మండలం వల్లూరు పంచాయితీ శివారు నీరుల్లిపాలెంకు చెందిన యార్లగడ్డ సువార్త (64) అనే వృద్ధురాలు సిమెంటు గోడ కూలి మరణించింది. శనివారం ఇంటి పక్కనే ఉన్న సిమెంటు గోడ పక్క నుంచి వెళ్తుండగా, ఆకస్మికంగా గోడ కూలి మరణించినట్లు ఇన్ఛార్జ్ తహసీల్దార్ సలీంఖాన్ తెలిపారు. సువార్తకు భర్త మావుళ్ళ చనిపోయాడు. దైవసేవ చేసుకుంటూ జీవిస్తోంది. ఈమెకు బేబీ అనే 24 సంవత్సరాల వికలాంగురాలైన బాలికను పెంచుకుంటోంది. తహసీల్దార్ సలీంఖాన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ మధుకుమార్, మాజీ జడ్పీటిసి ముప్పాల వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆచంట మండలం వల్లూరు పంచాయితీ శివారు
english title:
c
Date:
Sunday, February 19, 2012