ముంబయి, ఫిబ్రవరి 21: గత ఏడాది జూన్‌లో జరిగిన ‘మిడ్ డే’ పత్రిక సీనియర్ జర్నలిస్టు జె డే హత్య కేసుకు సంబంధించి అరెస్టు చేసిన జర్నలిస్టు జిగ్నా వోరాపై ముంబయి పోలీసు క్రైమ్ బ్రాంచ్ మంగళవారం మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (మోకా)లోని వివిధ సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. నగరానికి చెందిన ఓ దినపత్రికలో డిప్యూటీ బ్యూరో చీఫ్‌గా పని చేస్తున్న వోరాను ఈ హత్య కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ 25న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబయి పోలీసులు గత డిసెంబర్‌లో ఈ కేసుకు సంబంధించి 12 మంది నిందితులపై చార్జిషీటు కూడా దాఖలు చేసారు. అయితే ఆ చార్జిషీటులో వోరా పేరు లేదు. మోకా కోర్టులో దాఖలు చేసిన 3,055 పేజీల చార్జిషీటులో డే హత్య కేసుతో సంబంధం ఉన్న పది మంది పాత్రను వివరంగా వివరించారు. చార్జిషీటులో పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ పేరు కూడా ఉంది. అయితే రాజన్, మరో నిందితుడు నయన్ సింగ్‌ల జాడ ఇంకా తెలియలేదని, వారు పరారీలో ఉన్నారని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. డే మొబైల్ నంబర్‌ను, ఆమె కచ్చితంగా ఎక్కడ ఉంటుందో ఆ వివరాలను చోటా రాజన్‌కు వోరా ఇచ్చిడనేది పోలీసుల ఆరోపణ.
- ‘మిడ్ డే’ జర్నలిస్టు డే హత్య కేసు-
english title:
e
Date:
Wednesday, February 22, 2012