భోపాల్, ఫిబ్రవరి 21: 2జి కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి పి చిదంబరం పాత్రపై విచారణ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యన్ స్వామి వెల్లడించారు. చిదంబరంపై విచారణను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వారం రోజుల్లో సుప్రీంలో సవాలు పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఆయన ఇక్కడ జరిగిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో స్పష్టంచేశారు.
ఈ నెల ప్రారంభంలో తాను విడుదల చేసిన 70 పేరాల తీర్పులో ట్రయల్ కోర్టు జడ్జ్ 65 పేరాలతో ఏకీభవించారని, అయినప్పటికీ హైకోర్టు తన పిటిషన్‌ను తోసిపుచ్చిందన్నారు. ఫలితంగా 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న చిదంబరం నేరాలను రుజువు చేయలేకపోయానన్నారు.
దీంతోనే తాను సుప్రీంకోర్టుకు వెళ్తున్నానని తెలిపారు. చిదంబరాన్ని విచారణ చేస్తేనే అతను పాల్పడిన నేరాలు బహిర్గతమవుతాయన్నారు. ఇదిలావుంటే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈ సందర్భంగా స్వామి విమర్శలు చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబాల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఒకే ఒక నేత రాజీవ్ గాంధీ అన్నారు. సోనియా, రాహుల్‌లు వారివారి వ్యక్తిగతంగా సాధించిందేమీ లేదన్నారు.
స్పెక్ట్రమ్ కేసుపై స్వామి వెల్లడి
english title:
v
Date:
Wednesday, February 22, 2012