హైదరాబాద్, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ వొకేషనల్ జూనియర్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎం. సుబ్రహ్మణ్యం తెలిపారు.
దరకాస్తులను మార్చి 12వరకూ స్వీకరిస్తామని ఆయన చెప్పారు. జీవోలు 29, 114,05లకు లోబడి ఈ కాలేజీల ఏర్పాటుకు అనుమతిస్తామని వివరించారు. దరఖాస్తు ఫీజు 500 రూపాయిలతో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి 5వేలు, మున్సిపాల్టీలకు 10వేలు, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలకు 20వేల రూపాయిలు తనిఖీల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్
english title:
v
Date:
Wednesday, February 22, 2012