న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. 1992లో జయలలితకు అక్రమంగా మూడు లక్షల డాలర్లు అందిన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేయగా దానిని సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
జయలలితకు 1992లో న్యూయార్క్ కంపెనీ ఎఎన్‌జెడ్ గ్రిండ్లేస్ బ్యాంక్‌లో తీసిన మూడు లక్షల డాలర్ల డిడి అందినట్లు ఆరోపిస్తూ సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఇంత భారీ ఎత్తున అందిన ఈ మొత్తం అక్రమార్జనగా సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసుపై హైకోర్టులో జయలలిత పిటిషన్‌పెడుతూ దర్యాప్తులో అసాధారణ జాప్యం జరిగిందని పేర్కొంది. 1992లో జరిగినా ఐటి శాఖ దృష్టికి 1996లో వచ్చిందని, ఈకేసును అమెరికా, బ్రిటన్, యుఎఇలలో విచారించామని కనుక దర్యాప్తునకు ఇంత సమయం పట్టిందని సిబిఐ వాదించింది.
దీనిపై 2011 సెప్టెంబర్ 30న హైకోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. మళ్లీ సిబిఐ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు అల్తామస్ కబీర్,ఎస్.ఎస్. నిజ్జార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నోటీసు జారీ చేసింది.
1992లో 3లక్షల డాలర్ల విదేశీ డిడి కేసు
english title:
e
Date:
Wednesday, February 22, 2012