స్ఫూర్తి
బ్రిటన్‌కి చెందిన జోవియట్ టౌన్‌షిప్ హైస్కూల్ విద్యార్థులు 800 టోకెన్లని తయారు చేయించారు. ఎవరైనా తమతో దయగా ప్రవర్తిస్తే, వారికి ఆ టోకెన్‌ని ఇస్తారు. దాని మీద ‘ఈ టోకెన్ యజమాని ఎంతో దయ గలవాడు’ అని ముద్రించి ఉంటుంది, స్కూల్ పేరుతో సహా. దాన్ని వారు ఇంట్లో అలంకార వస్తువుగా ఉంచుకోవచ్చు. డెబ్బీ ఫెర్రోస్ అనే విద్యార్థిని కైండ్‌నెస్ ప్రాజెక్ట్‌లో సమర్పించిన ఈ ఐడియా నచ్చడంతో దీన్ని అమలుచేశారు. దీనికి చెందిన వెబ్‌సైట్‌లో కూడా టోకెన్ ఇవ్వబడ్డ వ్యక్తి పేరు, ఫొటో, అతను చేసిన దయాపూరిత చర్య గురించి వివరిస్తారు.
లింగు-లిటుకు
లింగు: లెక్కల పుస్తకం ఎందుకు విచారంగా ఉంది?
లిటుకు: ఎందుకంటే దాన్నిండా ప్రాబ్లమ్సే.
వింత లోకం
ఉరుగ్వే దేశ ప్రెసిడెంట్ జోస్ ముజిక్ ప్రపంచంలోని అతి బీద ప్రెసిడెంట్. అతని నెల జీతం 12500 డాలర్లు. అందులోని పది శాతం అంటే 1250 మాత్రమే ఉంచుకుని మిగిలింది దానం చేసేస్తాడు 77 ఏళ్ల వయసున్న జోస్.
దురదృష్టపు దొంగ
శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన ఓ దొంగ బ్యాంక్ ఆఫ్ అమెరికాలోకి వెళ్లి ‘ఇది దొంగతనం. నీ దగ్గరున్న డబ్బంతా సంచీలో ఉంచు’ అని రాసిన కాగితాన్ని ఓ కేషియర్‌కి ఇచ్చాడు. దాన్ని చదివిన కేషియర్ నవ్వి, ఆ నోట్‌లోని స్పెల్లింగ్ తప్పులని దిద్ది వెనక్కిచ్చేసింది. దాంతో అవాక్కయిన ఆ దొంగ ఆ బ్యాంక్‌లోంచి బయటకి వచ్చి, రోడ్డు దాటి ఎదురుగా ఉన్న వెల్స్‌ఫార్గొ అనే ఇంకో బ్యాంక్‌లోకి వెళ్లి, అక్కడి కేషియర్‌కి ఆ నోట్‌ని ఇచ్చాడు. దాన్ని చదివిన ఆ కేషియర్ బదులు చెప్పింది.
‘సారీ బ్రదర్. నేను నీకు డబ్బివ్వలేను. ఈ నోట్‌ని నువ్వు బ్యాంక్ ఆఫ్ అమెరికా డిపాజిట్ స్లిప్ మీద రాశావు తప్ప మా బ్యాంక్ డిపాజిట్ స్లిప్ మీద కాదు’
దాంతో అతను నిస్పృహ చెంది, ఆ కాగితం తీసుకుని మళ్లీ రోడ్డు దాటి బ్యాంక్ ఆఫ్ అమెరికా కేషియర్ దగ్గర ఉన్న క్యూలోకి వెళ్లి నిలబడ్డాడు. ఈలోగా వెల్స్‌ఫార్గొ కేషియర్ పోలీసులకి ఫోన్ చేయడంతో వాళ్లు వచ్చి క్యూలో ఉన్న ఆ దొంగని అరెస్టు చేశారు.
ఈ షార్ట్ఫిల్మ్ చూశారా?
ది ఎలివేటర్ అనే 3 ని.ల 38 క్షణాలపాటు సాగే కామెడీ సినిమాని చూడటానికి యూట్యూబ్.కాంలోకి వెళ్లి The Elevator అని టైప్ చేసి సెర్చ్ చేయండి.
ఇలా అన్నారు...
ఎవరైనా నాతో ‘నువ్వు అందంగా ఉన్నావు’ అని చెప్పినపప్పుడల్లా మా అమ్మ నాకో డాలర్ ఇచ్చేది. అమ్మా! నాకో డాలర్ ఇచ్చినందుకు థాంక్స్.
-కుర్లిన్ మన్రో
హాలీవుడ్ కబుర్లు
వాల్ట్‌డిస్నీ తన తల్లిని చంపాడు. సూటిగా కాకపోయినా సరే. తన తల్లిదండ్రుల పాత ఇంట్లో హీటింగ్ సిస్టం పాడైపోతే తన డబ్బుతో పాతది తీయించి కొత్తది ఏర్పాటు చేశాడు. కాని వర్కర్స్ చేసిన తప్పువల్ల కార్బన్ మోనాక్సైడ్ ఇంట్లోకి విడుదలై అతని తల్లి మరణించింది.
డైవర్స్
ఆస్ట్రేలియాకి చెందిన ఓ భర్త తన భార్య నించి విడాకులు తీసుకుంటూ ఆస్తి పంపకాల్లో, తన భార్య పెంపుడు గొర్రెని కూడా తీసుకున్నాడు. అతను దాని మెళ్లో నా మాజీ భార్య అధికంగా ప్రేమించిన జీవి అనే బోర్డు కట్టి సిడ్నీ నగరంలోని వీధుల్లో ప్రతి శని ఆదివారాలు తిప్పుతున్నాడు.
ఓన్లీ ఇన్ ఇండియా
భారతదేశంలో రోడ్ల మీద పరిపూర్ణ స్వేచ్ఛగల జీవి ఒకటుంది. అది ఆవు. ఇవి రోడ్డు మీద వాహనాలకి అడ్డంగా పడుకోవడం, రోడ్డు డివైడర్ల మధ్యగల గడ్డిని తినడం, రోడ్డు మధ్య ఇష్టం వచ్చినట్లు చేస్తూంటాయి. అయితే భారతీయులు ఎవరూ దీన్ని తప్పుగా భావించకపోవడం విశేషం. ‘కౌస్ హేవ్ ఫుల్ డెమోక్రాటిక్ రైట్స్ ఆన్ ఇండియన్ రోడ్’ అనే షార్ట్ ఫిలిమ్‌ని ఈ దృశ్యాలని పొందుపరుస్తూ ఎవరో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు కూడా.
హెల్త్ టిప్
ఆలివ్ ఆయిల్, ద్రాక్ష గింజల నూనెలతో వంట వండితే కొలెస్టరాల్, కొవ్వు సమస్యలు ఉండవు. ద్రాక్ష గింజల నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇలు అధికంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ మన దేశంలో యూరోపియన్ దేశాల నించి దిగుమతి అయి వస్తున్నాయి. కాని మనం వాడే నూనెకి రెట్టింపు ధర ఉంటుంది.