కళ్యాణదుర్గం, మే 27: రైతుల కోసం తాము పని చేస్తామని, అందుకు రైతు ప్రభుత్వమని గట్టిగా చెప్పడం జరగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం కళ్యాణదుర్గం నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డితో కలసి రూ.4 కోట్లు అభివృద్ధి పనులను ప్రారంభించారు. లక్ష్మీదేవమ్మ కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కన్నా మాట్లాడుతూ రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వుందన్నారు. రైతు సంక్షేమన్ని దృష్టిలో వుంచుకుని వ్యవసాయ బడ్డెట్ సైతం రూ.29 వేల కోట్లుకు పెంచడం జరిగిందన్నారు. లక్ష రూపాయలు వ్యవసాయ రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ రుణాల కోసం రూ.72 వేల కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. రైతల కోసం విత్తన సబ్సిడీకి రూ.400 కోట్లు ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో రైతులకు 6 లక్షలు విత్తన క్వింటాళ్లు వేరుశెనగ అవసరం వుండగా, జిల్లాకే నాలుగు లక్షల క్వింటాళ్లు వరకు మంజూరు చేశామని, రైతులకు అవసరం అయితే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధమని , రైతుల కోసం ఎన్ని రుణాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. గతంలో పంట నష్టపోయి రైతులకు పరిహారం తక్కువగా ఇవ్వడం జరిగిందని, అయితే నేడు హెక్టారుకు పది వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలపై కన్నా విమర్శి: ఏళ్ల తరబడి ప్రజలకు సేవలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందని, అయితే ప్రాంతీయ పార్టీల ఓట్లు కోసం, అధికారం కోసం, వారి స్వలాభం కోసం పని చేస్తున్నారని, అయితే వారికి రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టవని ఆయన తెలిపారు. అధికారం కోసం కొందరు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని, పాదయాత్రల పేరుతో రాష్ట్రాన్ని తిరిగి వచ్చారని, తిరుగుతున్నారని ఆరోపించారు. తాము ఎవరి మోసం చేయడానికి రాలేదని, ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేయడానికే వచ్చామని ఆయన తెలిపారు. ఎంపి అనంత కళ్యాణదుర్గం నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి, అందుకు కృషి చేసిన వారినిపై అభినందన వర్షం కురిపించారు. జిల్లాలో రైతుల నష్టపోయిన పంటల కోసం వాతావరణ బీమా కింద రూ.830 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్సీ ఖాశీం, వ్యవసాయ శాఖ జెడి, కెవికె శాస్తవ్రేత్తలు తదితరులు పాల్గొన్నారు.
* మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
english title:
r
Date:
Tuesday, May 28, 2013