కళ్యాణదుర్గం, మే 27: కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, రెండు నెలల్లో దుర్గం చెరువులకు సాగునీరు మళ్లించడానికి సమగ్రనివేధిక ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, ఎంపి అనంతలు నియోజక వర్గంలోని నాలుగు కోట్లు నిధులతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సోమవారం బ్రహ్మసముద్రంలో నిర్మించిన పోలీస్టేషన్ భవనాన్ని, కళ్యాణదుర్గంలో రూరల్ పోలీస్టేషన్‌ను మంత్రులు ప్రారంభించారు, అక్కడి నుంచి వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత మిల్క్ చిల్లింగ్ కేంద్రాన్ని, రూ.175 లక్షలతో నిర్మించిన లక్ష్మిదేవమ్మ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటే అభివృద్ధిని తెలిపారు. ఎన్నికల్లో ఓట్లు కోసం తాము రాలేదని, నా ప్రజల అభివృద్ధి కోసం తాము వచ్చామన్నారు. జీడిపల్లి ప్రాజెక్టుకు నీరు తెస్తామని చెప్పాము,కానీ తీసుకుని వచ్చామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా నియోజక వర్గంలోని ప్రాధాన్యత కల్గిన చెరువులకు సాగునీరు తీసుకుని వస్తామని మంత్రి తెలిపారు. నీరు విషయమై సిఎంకు రెండు రోజుల క్రితం ఈ విషయం వివరించినట్లు, అందుకు ఆయన సైతం నివేధిక ఇవ్వాలని కోరినట్లు మంత్రి చెప్పారు. గతంలో రైతులకు 9 శాతంతో వ్యవసాయ రుణాలు ఇచ్చే వారు, అయితే పావలా వడ్డీకి వ్యవసాయ రుణాలు ఇవ్వడం జరిగింది. రైతులు 365 రోజులుగా, అంటే రుణం తీసుకున్న నాటికి ఒక రోజు డాటి పోపుకుండా రుణం తీసుకున్న రోజులోగా, బ్యాంకు వద్దకు పోయి సంతకం చేయాలని, ఒక రోజు డాటిపోయినా, రైతులకు 9 శాతం వడ్డీతో వడ్డీ, అసలు చెల్లించాల్సివుంటుందన్నారు. కళ్యాణదుర్గం రైతులను దృష్టిలో వుంచుకుని కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకుని రావడం జరిగిందని, రాష్ట్రంలో 18 కెవికె కేంద్రాలు వుంటే, మన జిల్లాలోనే రెండవ కేంద్రం కళ్యాణదుర్గం అని మంత్రి తెలిపారు. జిల్లాలో నేడు 5 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి జరుగుతోందని, వచ్చే నాలుగేళ్ళలో 10 లక్షల లీటర్లకు చేరే విధంగా కృషి చేస్తామని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంత ప్రాజెక్టుకై 30న ఢిల్లీకి: జిల్లాను అన్ని విధాల ఆదుకోవడాని కోసం తయారు చేసిన నివేధికకు రూప కల్పన జరుగుతుందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. అనంత ప్రాజెక్టుకు అమలు చేయడానికి రూ.7.5 కోట్లు నిధులు అవసరమని సిఎం దృష్టికి తీసుకుని పోతే ఈ నెల 30న డిల్లీలో ఈ విషయంపై ఫ్లానింగ్ కమిషన్ వద్దకు తీసుకుని పోయి నిధులు మంజూరు చేయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన్నట్లు మంత్రి తెలిపారు.
రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం * గడువు దాటితే వడ్డీమాఫీ వర్తించదు * మంత్రి రఘువీరారెడ్డి
english title:
d
Date:
Tuesday, May 28, 2013