ఉరవకొండ, మే 27: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిళ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీవారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని గరుడ వాహనంపై సతీసమతుడైన శ్రీవారిని ఊరేగించారు. ఆలయంలోని మూల విరాట్ స్వామి వారికి తెల్లవారు జామున సుప్రభాత సేవలో భాగంగా అభిషేకం, అలంకరణ, మహా మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. భూదేవి, శ్రీదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, ఫల పుష్పాలతో అలంకరించారు. గరుడ వాహనంపై కొలువు దీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయంలోని తీసుకెళ్లి ప్రత్యేక పూజలను ప్రధాన అర్చకులు ద్వారకా నాథ్‌చార్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇఓ సుధారాణి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం...
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మండలంలోని పెద్ద కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎర్రిస్వామి రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ఈ నెల 31 వరకు రోజు 24 గంటలు ఉచిత వైద్యసేవలు అందిస్తామన్నారు.
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిళ లక్ష్మీనరసింహ స్వామి
english title:
v
Date:
Tuesday, May 28, 2013