Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రైతు ప్రయోజనాలను దెబ్బతీయొద్దు

$
0
0

శ్రీకాకుళం , ఫిబ్రవరి 27: మడ్డువలస రిజర్వాయర్ ద్వారా పొందూరు మండలంలోని వావిలపల్లిపేట, విఆర్‌గూడెం, బొట్లపేట గ్రామాలకు సాగునీరందించేందుకు కాలువ ప్రతిపాదనలు పంపారని, వీటిలో మార్పులు చేస్తే రైతుల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుందని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజకీయ ఒత్తిళ్లకు కాలువను మార్పు చేస్తున్నారని పేర్కొన్నారు. తొలుత ప్రతిపాదనల మేరకే కాలువ ఏర్పాటు చేయాలని, కాలువ మార్పు వలన రైతుల విశాల ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఇంజనీర్ల నిర్వాహకం వలనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కాలువ విస్తరణ పనులు మార్పు చేయవద్దని కోరారు.

* కలెక్టర్‌ను కలిసిన మాజీమంత్రి తమ్మినేని
english title: 
majee manthri

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>