శ్రీకాకుళం , ఫిబ్రవరి 27: ఉపాధి హామీ పనులు వేగవంతం చేసి మ రింత ఉపాధి పొందాలని ఆర్డీవో నక్క సత్యనారాయణ సూచించారు. మండలంలోని శానివాడ ఊరచెరువు ఉపాధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. కూలీల సంఖ్య, వేతనాల చెల్లింపులపై ఆరా తీశారు. మస్టర్ల నిర్వహణ, మేట్లు, క్షేత్రసహాకుల విధులు అడిగి తెలుసుకున్నారు. పనులవద్ద కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారన్న విషయాలపై ప్రశ్నిస్తున్నారు. మంచినీరు, ప్రాథమిక చికిత్స నిర్వహణ కోసం మెడికల్ కిట్ అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని ఉపాధి అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో ఆర్.వెంకట్రామన్, ఎపివో యుగంధర్, ఇ.సి.శంకరరావు ఉన్నారు.
* ఆర్డీవో సత్యనారాయణ
english title:
upadhi panulu
Date:
Tuesday, February 28, 2012