బిట్రగుంట, ఫిబ్రవరి 28: కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్నా ఎక్కడి పనులు అక్కడే ఉండటంతో కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆలయంలో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 3వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నా పనులు జరగక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండపై ఎక్కడ చెత్త అక్కడే వుండటం ఆయనకు కోపం తెప్పించింది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదని స్థానిక ఆలయ కార్యనిర్వహణాధికారిని హెచ్చరించారు. మార్చి 2వతేదీ సాయంత్రం లోపు అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొండ మీద గాని, కింద గాని అంగళ్లు దూరంగా ఏర్పాటు చేయాలని, మహిళా భక్తులకు ప్రత్యేకంగా స్నానపు గదులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, తదితర అంశాలపై స్థానిక గ్రామ రెవెన్యూ అధికారి సలాంతో చర్చించారు. స్వామి దర్శనం క్యూ లైను సక్రమంగా ఉండాలని తెలిపారు. ఉత్సవాలు సరియైన సమయంలో ప్రారంభించి ఆలస్యం లేకుండా గ్రామోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మహాంకాళి ప్రభాకర్ చెప్పారు. ఏది ఏమైనా అన్ని శాఖలతో మరోసారి సమీక్ష నిర్వహించి బ్రహ్మోత్సవాలు లోటుపాట్లు లేకుండా ఘనంగా జరిపేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ప్రసన్న వెంకటేశుని ఆలయ ఇఓపై ఆర్డీఓ ఆగ్రహం
english title:
e
Date:
Wednesday, February 29, 2012