త్రీ ఎమ్ కంపెనీలో స్పెన్సర్ సిల్వర్ పనిచేస్తున్న జట్టు ఒక కొత్త జిగురు గురించి పరిశోధనలు సాగించింది. సింతటిక్ జిగురు తయారు చేయడానికి అవసరమైన ముడి రసాయనాన్ని సిల్వర్, మరోకంపెనీ నుంచి తెప్పించాడు. జిగురు తయారయింది కానీ, గట్టిగా అతకదు. తెలిసిన పద్ధతులు, పరిమాణాలు అన్ని వాడి చూచాం. ఈ జిగురుకు మరే పదార్థము యిష్టం లేదు. అంటుకున్నట్లే అంటుకుని తిరిగి ఊడిపోతుంది అన్నాడు సిల్వర్ ఆ సందర్భంలో.
నిజానికి జిగురు పరిశోధనను ఆపేశారు. జట్టులో వారందరికీ మరేవో పనులు అప్పజెప్పారు. స్పెన్సర్ సిల్వర్‌కు మాత్రం తన రసాయనానికి ఏదో ప్రయోజనం ఉండి తీరుతుంది అన్న నమ్మకం లోపల ఉంది. దాన్ని గురించి అతను మరిచిపోలేదు. అందరితోనూ చర్చలు సాగిస్తున్నాడు. కంపెనీవారు పెదవి విరిచారు. ‘గోల’ ఆపమన్నారు.
నాలుగు సంవత్సరాలు గడిచాయి. సిల్వర్ మాత్రం తన జిగురు వదలలేదు. గట్టిగా పట్టుకున్నాడు. చివరకు ఆలోచన రానే వచ్చింది. పోస్ట్- ఇట్ నోట్ పేపర్స్ పుట్టాయి. అవసరంకొద్దీ అతికించి, ఆ తర్వాత తీసివేసే చిన్న చిన్న కాగితాలు, ఇవాళ ప్రపంచమంతటా వాడుకలో ఉన్నాయి. త్రీ ఎమ్ కంపెనీకి బిలియన్లలో లాభాలు అందిస్తున్నారుూ చీటీలు!
ఆలోచనలో గొప్పదనం అలా ఉంటుంది!
త్రీ ఎమ్ కంపెనీలో స్పెన్సర్ సిల్వర్ పనిచేస్తున్న
english title:
spencer silver
Date:
Wednesday, February 29, 2012