కాకినాడ, జూలై 1: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న ఆరోపణలపై తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ఇరిగేషన్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఎఇగా పనిచేస్తున్న శ్రీవత్సవాయ వెంకట పద్మనాభరాజు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం మెరుపుదాడులు నిర్వహించారు. కాకినాడ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు చోట్ల ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖాధికార్లు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెంలో గల ఇరిగేషన్ కార్యాలయంలో క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్న వెంకట పద్మనాభరాజు నగరంలోని గంగరాజునగర్ రోడ్డు నెంబరు-3లో నివసిస్తున్నారు. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నట్టు అందిన సమాచారం మేరకు సోమవారం ఎసిబి అధికార్లు మూడు బృందాలుగా ఏర్పడి తనిఖీలకై రంగంలోకి దిగారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న
english title:
acb
Date:
Tuesday, July 2, 2013