హైదరాబాద్, జూలై 2: సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లకు మంచి స్పందన లభించినట్లు ఇంధన శాఖ ప్రకటించింది. వెయ్యి మెగావాట్లను నెలకొల్పేందుకు టెండర్లను ఆహ్వానించారు. 331 బిడ్స్ అర్హత సాధించాయి. 161 ప్రదేశాల్లో వీటిని నెలకొల్పనున్నారు. కాగా తుది దశలో 418 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదనకు 35 బిడ్డర్లను ఎంపిక చేశారు. ఈ బిడ్డర్లు సౌరవిద్యుత్‌ను ప్రభుత్వం ఖరారు చేసిన యూనిట్ ఆరు రూపాయల 49 పైసలకే సరఫరా చేసేందుకు అంగీకరించారు. 418 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చిన సంస్ధలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను ఇస్తారు. ఇంతవరకు 144 మెగావాట్లకు సంబంధించి 21 సంస్ధలకు లెటర్ ఇచ్చారు. బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనలేని మరి కొన్ని విద్యుత్ సంస్ధలు ప్రస్తుతం సౌరవిద్యుత్ ఉత్పాదన చేసేందుకు ఆసక్తిని కనపరుస్తున్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికేసౌరవిద్యుత్‌కు సంబంధించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. సౌరవిద్యుత్ ఉత్పత్తికి సంబంధించి రాజ్‌భవన్, హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం, తిరుమల తిరుపతి దేవస్ధానం రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశాయి. సౌరవిద్యుత్‌పై ట్రాన్స్‌కో సిఎండి హీరాలాల్ సమారియా, జాయింట్ ఎండి పి రమేష్ సమీక్షించారు.
ఇంధన శాఖ వెల్లడి
english title:
s
Date:
Wednesday, July 3, 2013