సూళ్లూరుపేట, జూలై 2: పిఎస్‌ఎల్‌వి-సి 22 విజయంతో శాస్తవ్రేత్తలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేస్తామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. పిఎస్‌ఎల్‌వి ప్రయోగం విజయానంతరం ఆయన సోమవారం అర్ధరాత్రి షార్‌లోని మీడియా సెంటర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ భవిష్యత్‌లో షార్ నుండి భారీ ప్రయోగాలు ప్రయోగించే విధంగా ప్రణాళిక రూపొందిచినట్లు తెలిపారు. ఇది అందరి విజయమని శాస్తవ్రేత్తలతో కలసి మీడియా సెంటర్‌లో ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ ఏడాది షార్ నుండి మరో మూడు ప్రయోగాలు ప్రయోగించనున్నట్లు వెల్లడించాడు. ఆగస్టులో రెండో ప్రయోగ వేదిక నుండి జిఎస్‌ఎల్‌వి-డి 5 ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందని జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. జిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో క్రయోజనిక్ దశల్లో ఎదురయ్యే సమస్యను అధిగమించి రాకెట్‌కు అన్ని పరీక్షలు కూడా చేశామని దీనిని కూడా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్టోబర్ 21న పిఎస్‌ఎల్‌వి-సి 25 ద్వారా మన దేశానికి చెందిన మంగళ్‌యాన్ ఉపగ్రహం, డిసెంబర్‌లో పిఎస్‌ఎల్‌వి-సి 23 రాకెట్ ద్వారా ఫ్రాన్సు దేశానికి చెందిన స్పాట్-7 ఉపగ్రహాన్ని ప్రయోగించన్నుట్లు పేర్కొన్నారు. దేశ సేవలకు అవసరమమ్యే ప్రయోగాలు వైపు దృష్టిసారించమన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ఉపగ్రహ విజయం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో 7 ఉప గ్రహాలను 2015-16లోపు ప్రయోగించి వీటి సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత హసన్‌లోని రాడార్ కేంద్రానికి సంకేతాలు అందాయని మరో వారంలో దీని పనితీరును గమనిస్తామన్నారు. వచ్చే ఏడాది చంద్రయాన్-2 ప్రయోగించేందకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. చంద్రయాన్ ద్వారా రోవర్స్ ఉపయోగించి చంద్రుని చుట్టూ ఉండే హీలియం అనే మట్టి లాంటి పదార్థాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్
english title:
e
Date:
Wednesday, July 3, 2013